E-Paper
Advertisement

Crime Thriller OTT : మట్టిలో ఎముకల గూళ్ళు… ఈ డెడ్లీ మర్డర్ మేజ్లో అడుగు పెడితే అంతే సంగతులు

Crime Thriller OTT : మట్టిలో ఎముకల గూళ్ళు… ఈ డెడ్లీ మర్డర్ మేజ్లో అడుగు పెడితే అంతే సంగతులు
Advertisement

Crime Thriller OTT : ఊహించని మలుపులతో, ట్విస్టులు, టర్నులతో పిచ్చెక్కించే క్రైమ్ థ్రిల్లర్స్ ఖతర్నాక్ ఉంటాయి కదా. ఈరోజు మన మూవీ సజెషన్ కూడా అలాంటిదే. ఊర్లో వరుసగా మనుషులు మిస్ అవ్వడం, మట్టిలో తవ్విన కొద్దీ ఎముకలు బయటపడడం వంటిం ఇంట్రెస్టింగ్ సీన్లతో ఉండే ఈ మూవీని ఎక్కడ చూడవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆహాలో స్ట్రీమింగ్

వేణు మురళీధర్ వడ్నాల డైరెక్ట్ చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘ముఖ్య గమనిక 2024’. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో యంగ్ కానిస్టేబుల్ తన తండ్రిని చంపింది ఎవరో తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం చుట్టూ సాగే స్టోరీ ఇది. విరాన్ ముత్తంశెట్టి, లావణ్య సహుకార, ఆర్యన్ ఇప్పిలి ప్రధాన పాత్రలు పోషించారు. సపోర్టింగ్‌ క్యారెక్టర్స్ లో బాషా, జ్యోతి స్వరూప్ వంటి యాక్టర్స్ నటించారు. 2024 ఫిబ్రవరి 23న థియేటర్స్‌లో రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడు Ahaలో స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఇష్టపడేవాళ్లకి బెస్ట్ చాయిస్ ఈ మూవీ. IMDbలో 8.6 రేటింగ్ ఉన్న ఈ మూవీ ఇంటర్వెల్ ట్విస్ట్, సస్పెన్స్ తో ఆకట్టుకుంటుంది. కానీ స్లో పేసింగ్ ఇబ్బంది పెడుతుంది.

Advertisement

Read Also : షార్ట్ కట్ లో కోటీశ్వరుడు కావాలనుకునే సిన్సియర్ పోలీస్ కొడుకు… క్లైమాక్స్ ట్విస్టుకి ఫ్యూజులు అవుట్

స్టోరీలోకి వెళ్తే…

యంగ్ కానిస్టేబుల్ విరాన్ (విరాన్ ముత్తంశెట్టి) చేసే ఇన్వెస్టిగేషన్ చుట్టూ సాగుతుంది సినిమా. అతను సదాశివపేట పోలీస్ స్టేషన్‌ లో కానిస్టేబుల్ గా జాయిన్ అవుతాడు. అక్కడ సీఐ రుద్ర చెప్పిందే చట్టం. ఆయన చాలా కఠినంగా ఉంటాడు. స్టేషన్ లో చాలా సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. విరాన్ తన డ్యూటీలో సెటిల్ అవుతున్న సమయంలో… అతని ఫాదర్ ను ఎవరో హత్య చేస్తారు. అదే సమయంలో ఒక మహిళ హస్బండ్ మిస్టీరియస్‌ గా మిస్ అవుతాడు.

Advertisement

ఈ రెండు ఈవెంట్స్ ఒకదానికి ఒకటి లింకు అవ్వడంతో, విరాన్ నిజం ఏంటో తెలుసుకోవడానికి డీప్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగుతున్న కొద్దీ విరాన్ ఒక డెడ్లీ మేజ్‌లోకి ఎంటర్ అవుతాడు. విలేజ్ పాలిటిక్స్, కరప్షన్, మోసం ఒక్కటేమిటి మనిషి జీవితంలో చూడకూడని అనుకున్నవి అన్నీ బయట పడతాయి. డేంజర్స్ ఎదుర్కొంటూ, తనకు ప్రియమైన వాళ్లను ప్రొటెక్ట్ చేస్తూ ఇన్వెస్టిగేషన్ ను కొనసాగిస్తాడు విరాన్. కేసులో ఇన్నోసెంట్ పీపుల్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. ఇంటర్వెల్ ట్విస్ట్ ఇన్‌క్రెడిబుల్‌గా ఉంటుంది. సెకండ్ హాఫ్‌లో సస్పెన్స్, బ్యాక్‌స్టాబ్బింగ్, రివిలేషన్స్‌తో ఎడ్జ్ ఆఫ్ సీట్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది. క్లైమాక్స్‌లో స్టార్ట్లింగ్ కనెక్షన్స్ బయట పడతాయి. ఆ ట్విస్టులు ఏంటి? హీరో తండ్రిని చంపింది ఎవరు? అనే విషయాలు తెలియాలంటే ఈ మూవీపై ఓ లుక్కేయండి.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×