// // Mystery Thriller OTT : మరణం చుట్టూ ముడిపడి ఉన్న దర్శకుల కథ -->
E-Paper
Advertisement

Mystery Thriller OTT : మరణం చుట్టూ ముడిపడి ఉన్న నలుగురు దర్శకుల కథ… క్లైమాక్స్ కెవ్వు కేక

Mystery Thriller OTT : మరణం చుట్టూ ముడిపడి ఉన్న నలుగురు దర్శకుల కథ… క్లైమాక్స్ కెవ్వు కేక
Advertisement

Mystery Thriller OTT : క్షణక్షణం ఉత్కంఠభరితంగా ఉండే సీన్స్ తో మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంగేజింగ్ గా ఉంచుతాయి మిస్టరీ థ్రిల్లర్ మూవీస్. మీరు కూడా అలాంటి సినిమానే ఓటేటీలో చూడాలి అనుకుంటున్నారా? అయితే ఈ మూవీ మీ కోసమే. మరి ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఓ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.

ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లేలో స్ట్రీమింగ్

శ్రీజిత్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన ఇంట్రెస్టింగ్ బెంగాలీ సైకలాజికల్ థ్రిల్లర్ చతుష్కోణ్ (Chotushkone – 2014). “చతుష్కోణ్” అంటే నాలుగు మూలలు. సినిమా నలుగురు ప్రముఖ డైరెక్టర్స్ చుట్టూ సాగుతుంది. అపర్ణా సేన్, చిరంజీవి చక్రవర్తి, గౌతమ్ ఘోష్, పరంబ్రత చటర్జీ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా డెత్ థీమ్‌తో నాలుగు షార్ట్ స్టోరీస్‌ను ఇంటర్‌లింక్ చేసి చెప్పే యాంథాలజీ స్టైల్ థ్రిల్లర్. IMDb 8.2 రేటింగ్ ఉన్న ఈ సినిమా నేషనల్ అవార్డ్స్‌లో బెస్ట్ బెంగాలీ ఫిల్మ్ అవార్డును గెలుచుకుంది. ఇప్పుడు Airtel Xstream Playలో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

Read Also :  ఒక్కరాత్రిలో 5 మంది హత్య… మర్డర్స్ తో పోలీస్ కే కనెక్షన్… మైండ్ బెండయ్యే ట్విస్టులున్న క్రైమ్ థ్రిల్లర్

స్టోరీలోకి వెళ్తే…

ఒక మిస్టీరియస్ ప్రొడ్యూసర్ నలుగురు ఫేమస్ బెంగాలీ డైరెక్టర్స్‌ను ఒక ఫిల్మ్ చేయమంటాడు. ఆ డైరెక్టర్స్ అపర్ణా సేన్, గౌతమ్ ఘోష్, చిరంజీవి, పరంబ్రత స్వయంగా నటిస్తారు. కానీ కాన్సెప్ట్ యూనిక్… నాలుగు షార్ట్ స్టోరీస్ ఒక్క సినిమాలో, ప్రతి స్టోరీలో థీమ్ “డెత్”. వాళ్లు ఒక రూమ్‌లో కలిసి సిట్టింగ్ పెట్టుకుని ఒక్కొక్కరూ తమ స్టోరీ చెప్పుకుంటారు. మొదటి స్టోరీలు సాగుతున్న కొద్దీ పాత ఫ్రెండ్‌షిప్స్, రివల్రీస్, సీక్రెట్స్ బయట పడతాయి. ఈ నలుగురి మధ్య ఒక ట్రాజిక్ పాస్ట్ ఉంటుంది.

Advertisement

ఇద్దరు డైరెక్టర్స్ మధ్య ఓల్డ్ లవ్ ట్రయాంగిల్, చేదు జ్ఞాపకాలు ఉంటాయి. స్టోరీస్ చెప్పుకుంటున్నప్పుడు రియల్ లైఫ్ ఈవెంట్స్ కూడా బయటకు వస్తాయి. ఒక స్టోరీలో సూసైడ్, మరొకటి మర్డర్, ఇంకోటిలో యాక్సిడెంట్… అన్నీ డెత్ థీమ్‌తో లింక్ అవుతాయి. క్లైమాక్స్‌లో మైండ్ బ్లోయింగ్ రివిలేషన్ ఉంటుంది. ఎవరి స్టోరీ నిజమైనది ? ఎవరు అబద్దాలు చెప్పారు? అనే సస్పెన్స్ చివరి వరకూ కొనసాగుతుంది. ఇంతకీ ఈ సినిమా క్లైమాక్స్ ఏంటి? ఆ అజ్ఞాత ప్రొడ్యూసర్ ఎవరు? అన్నది సినిమాలో చూడాల్సిందే.

ఈ సినిమాలో నటీనటుల నటన అద్భుతం. నలుగురు డైరెక్టర్స్ స్వయంగా నటించడం అన్నది ఇందులో ఉన్న స్పెషల్. అపర్ణా సేన్ ఎమోషనల్ స్టోరీ, పరంబ్రత ఇంటెన్స్, గౌతమ్ ఘోష్ కూల్, చిరంజీవి పవర్‌ఫుల్ స్టోరీస్ ఆకట్టుకుంటాయి. ఒక్కో స్టోరీని మేకర్స్ డిఫరెంట్ స్టైల్‌లో చూపిస్తారు. ఇంకా ఈ మూవీని చూడలేదా ? అయితే వెంటనే ఓ లుక్కేయండి.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×