// // 2025 Highest Viewed OTT Movies : 'కాంతారా చాప్టర్ 1' ఊచకోత... -->
E-Paper
Advertisement

2025 Highest Viewed OTT Movies : ‘కాంతారా చాప్టర్ 1’ ఊచకోత… ఓటీటీలలో వ్యూస్ రాబట్టిన 2025 మూవీస్

2025 Highest Viewed OTT Movies : ‘కాంతారా చాప్టర్ 1’ ఊచకోత… ఓటీటీలలో వ్యూస్ రాబట్టిన 2025 మూవీస్
Advertisement

2025 Highest Viewed OTT Movies : రిషబ్ శెట్టి బ్లాక్ బస్టర్ ‘కాంతార చాప్టర్ 1’ మూవీ ఇప్పటికీ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది అత్యధిక వ్యూస్ సాధించి కొత్త రికార్డును సృష్టించింది. 2022లో వచ్చిన పౌరాణిక యాక్షన్ ‘కాంతార’ తరువాత ‘కాంతార చాప్టర్ 1’ చూడటానికి ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూసారు. అనుకున్నట్లే ఈ సినిమా రికార్డులు సృష్టించింది. అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా 850 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. అక్టోబర్ 31 నుంచి ప్రైమ్ వీడియోలో డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చి మరో సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఇప్పటికీ మోస్ట్ వ్యూస్ సాధించిన సినిమాగా స్ట్రీమింగ్ అవుతోంది.

హిందీలో ఆలస్యంగా

ఈ సినిమా మొదట కన్నడ, తమిళం, తెలుగు, మలయాళ భాషలలో మాత్రమే విడుదలైంది. అయితే హిందీలో ఆలస్యంగా వచ్చి అభిమానులను కొంత నిరాశపరిచింది. నవంబర్ 27 నుండి ఈ చిత్రం హిందీ డబ్బింగ్ వెర్షన్ అందుబాటులోక వచ్చింది. ఇది భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 200 కి పైగా దేశాలలో ప్రసారం అవుతోంది. వ్యూస్ పరంగా ప్రైమ్ వీడియోలో మాత్రమే కాకుండా అన్ని ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లను అధిగమించింది. ఈ చిత్రం వరుసగా ఆరు వారాల పాటు అగ్రస్థానాన్ని నిలుపుకుంది. టాప్ వ్యూస్ తో ముందు వరసలో ఉన్న టాప్ 10 సినిమాలు ఈ విధంగా ఉన్నాయి

టాప్ 10 సినిమాలు

Advertisement

కాంతారా చాప్టర్ 1 – 18.9 మిలియన్లు (ప్రైమ్ వీడియో)
జ్యువెల్ థీఫ్ – $18.2 మిలియన్లు (నెట్‌ఫ్లిక్స్)
కేసరి చాప్టర్ 2 – 18.1 మిలియన్లు (జియో హాట్‌స్టార్)
కూలీ – 17.4 మిలియన్లు (ప్రైమ్ వీడియో)
హౌస్‌ఫుల్ 5 – 13.6 మిలియన్లు (ప్రైమ్ వీడియో)
పర్యాటక కుటుంబం – 13.1 మిలియన్లు (జియో హాట్‌స్టార్)
లోక చాప్టర్ 1 – 10.5 మిలియన్లు (జియో హాట్‌స్టార్)
ధూమ్ ధామ్ – 12.4 మిలియన్లు (నెట్‌ఫ్లిక్స్)
రైడ్ 2 – 12.3 మిలియన్లు (నెట్‌ఫ్లిక్స్)
సయారా – 10 మిలియన్ (నెట్‌ఫ్లిక్స్)

కదంబ రాజవంశం నేపథ్యంలో రూపొందిన “కాంతార చాప్టర్ 1″లో రిషబ్ శెట్టి, రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా వరుసగా ఆరు వారాల పాటు ప్రైమ్ వీడియోలో అత్యధికంగా వీక్షించబడిన చిత్రంగా ట్రెండ్ అవుతోంది.
ఆరవ వారంలో 2 మిలియన్ల వ్యూస్ తో మొత్తం 18.9 మిలియన్ల వ్యూస్ ను సంపాదించింది.

Advertisement

 

Read Also : ఓటీటీలోకి బెంగాలీ డిటెక్టివ్ థ్రిల్లర్… డాక్టర్ హత్య కేసుతో ఉత్కంఠ రేపే స్టోరీ… క్లైమాక్స్ వరకు ట్విస్టులే

 

 

 

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×