// // Mistery Thriller OTT :అమ్మాయికి నరకం చూపించే ముగ్గురు ముసుగు -->
E-Paper
Advertisement

Mistery Thriller OTT : అమ్మాయికి నరకం చూపించే ముగ్గురు ముసుగు దొంగలు… ఊపిరి బిగబట్టే వేట…

Mistery Thriller OTT : అమ్మాయికి నరకం చూపించే ముగ్గురు ముసుగు దొంగలు… ఊపిరి బిగబట్టే వేట…
Advertisement

Mistery Thriller OTT : థ్రిల్లర్ సినిమాలు, సిరీస్ లు ఇప్పుడు ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. ఆడియన్స్ కూడా వీటిని బాగా ఆదరిస్తున్నారు. ఇక గత ఏడాది వచ్చిన ‘ది స్ట్రేంజర్స్ – చాప్టర్ 2’ (The Strangers – Chapter 2) ఓటీటీలో థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటోంది. మొదటి భాగంలో ప్రాణాలతో బయటపడిన మాయా, ఈ భాగంలో ముగ్గురు ముసుగు హంతకుల నుండి తప్పించుకోవడానికి చేసే పోరాటమే ఈ సినిమా కథ. ఇది ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఏ ఓటీటీలో చూడచ్చు అంటే

ఈ హర్రర్ థ్రిల్లర్ చిత్రం పేరు ‘ది స్ట్రేంజర్స్ – చాప్టర్ 2’ (The Strangers – Chapter 2). ఇది 2025 సెప్టెంబర్ 26న థియేటర్లలో విడుదలయ్యింది. ఈ చిత్రం 2024లో మొదలైన ‘ది స్ట్రేంజర్స్’ ట్రైలజీలో రెండవ భాగం. దీనికి రెన్నీ హార్లిన్ దర్శకత్వం వహించారు. ఇందులో మడెలైన్ పెట్ష్ ప్రధాన పాత్రలో నటించారు. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఈ సిరీస్‌లో చివరిదైన ‘ది స్ట్రేంజర్స్: చాప్టర్ 3’ కూడా ఇటీవలే 2026 ఫిబ్రవరి 6న విడుదలైంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

సినిమా మొదటి పార్ట్ లో జరిగిన దారుణమైన దాడి తర్వాత, మాయా (మడెలైన్ పెట్ష్) తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరుతుంది. తన ప్రియుడిని కోల్పోయిన బాధలో ఉన్న ఆమెను, ఆ ముగ్గురు ముసుగు హంతకులు అస్సలు వదిలిపెట్టరు. మాయా ఇంకా బతికే ఉందని తెలుసుకున్న వాళ్ళు, ఆమెను చంపడానికి ఆసుపత్రి వరకు వస్తారు. అక్కడి నుండి ప్రాణాలు కాపాడుకోవడానికి మాయా ఒక తెలియని ఊరిలోకి పారిపోతుంది, కానీ ఆ హంతకులు ఆమెను నీడలా వెంటాడుతూనే ఉంటారు.

మొదటి భాగంలో కేవలం భయపడిన మాయా, ఈ రెండో భాగంలో మాత్రం వాళ్ళకి ఎదురుతిరుగుతుంది. వాళ్ళు ఎందుకు తనను చంపాలనుకుంటున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూనే, తన ప్రాణాలను కాపాడుకోవడానికి పోరాడుతుంది. అయితే ఆ హంతకులు చాలా తెలివిగా ప్లాన్ చేసి మాయాని మళ్ళీ ఒక ఉచ్చులోకి లాగుతారు. చివరికి మాయా వాళ్ళ బారి నుండి పూర్తిగా తప్పించుకుందా ? ఆ ముసుగు మనుషుల చేతిలో బలవుతుందా ? ఇంతకీ వాళ్ళు ఎందుకు వీళ్ళ వెంట పడుతున్నారు ? అనే విషయాలతో క్లైమాక్స్ ఉత్కంఠంగా ముగుస్తుంది.

Advertisement

Read Also :  వింతైన విమాన ప్రమాదం… అగ్రరాజ్యం రాజకీయాలను కదిలించే మర్డర్ మిస్టరీ… ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×