E-Paper
Advertisement

హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాకు చుక్కలు చూపించే లేడీ సింగం… ఒక్కొక్కడికీ చుక్కలే

హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాకు చుక్కలు చూపించే లేడీ సింగం… ఒక్కొక్కడికీ చుక్కలే
Advertisement

Action Thriller: కూతురి జోలికి వస్తే కుక్కను కొట్టినట్టు కొడతారు ఎవరైనా. మామూలు మనుషులే ఇలా ఆలోచిస్తే… మరి ఆర్మీ ఆఫీసర్ అయితే కూతురి విషయంలో ఎలా ఉంటారు? తెలుసుకోవాలి అంటే ‘ప్రొటెక్టర్’ (Protector) సినిమాను చూడాల్సిందే. ఒక మాజీ సైనికురాలు తన కూతురిని కాపాడుకోవడానికి చేసిన ఫైట్ నేపథ్యంలో తెరకెక్కింది హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్. మరి ఆమె ఉత్కంఠభరితమైన ప్రయాణం ఏంటి ? సినిమా స్టోరీ ఏంటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

నిక్కీ (మిలా జోవోవిచ్) అనే మాజీ మిలిటరీ వార్ హీరో మన హీరోయిన్. ఒకరకంగా చెప్పాలంటే ఈ సినిమాకు ఆవిడే హీరోయిన్. తన ప్రమాదకరమైన గతాన్ని వదిలేసి, కూతురు క్లోయ్ (ఇసాబెల్ మైయర్స్)తో కలిసి చాలా ప్రశాంతంగా బతకాలని అనుకుంటుంది. కానీ అంతలోనే అనుకోని ప్రమాదం ఎదురవుతుంది. ఒకరోజు నిక్కీ ఒక పాడుబడిన ఫ్యాక్టరీలో కళ్ళు తెరుస్తుంది.

Advertisement

లేచి చూసేసరికి, తన కూతురు క్లోయ్ కనిపించకుండా పోతుంది. డేంజరస్ అంతర్జాతీయ హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా ఆమె కూతురిని కిడ్నాప్ చేసిందని నిక్కీకి తెలియడానికి ఎక్కువ టైమ్ ఏమీ పట్టదు. తన కూతురిని ఎలాగైనా రక్షించుకోవడానికి నిక్కీ నగరంలోని క్రైమ్ అండర్ వరల్డ్‌లోకి ఒంటరిగా అడుగు పెడుతుంది. అయితే, ఆమె ఆ కిడ్నాపర్ల ముఠాను క్రూరంగా వేటాడుతున్న క్రమంలో అటు పోలీసులు, ఇటు మిలిటరీ బలగాలు కూడా నిక్కీని పట్టుకోవడానికి వెంట పడతాయి.

ఈ పోరాటంలో నిక్కీ ఒక్కతే ఎవ్వరి హెల్ప్ లేకుండా శివంగిలా నిలబడుతుంది. తనకున్న ఆర్మీ స్కిల్స్ ను ఉపయోగించి, గన్ ఫైట్స్, హ్యాండ్-టు-హ్యాండ్ కాంబాట్ సీన్స్‌లతో శత్రువుల బొక్కలు విరగ్గొడుతుంది. మరి హీరోయిన్ తన కూతుర్ని తిరిగి తీసుకురాగలిగిందా ? ఆ హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా మొత్తాన్ని మట్టుబెట్టిందా ? ఒక ఆడది సింగిల్ హ్యాండ్ తో ఇంతమందిని ఎలా చితగ్గొట్టింది ? అన్నది తెలియాలంటే సినిమాను మిస్ అవ్వకుండా చూడాల్సిందే.

తెలుగులో అవైలబుల్ గా ఉందా ?

Advertisement

ఒక తల్లి తన కూతురి కోసం చేసే పోరాటం ఎంత భయంకరంగా, ఉత్కంఠభరితంగా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు చూపించే హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ప్రొటెక్టర్’. 2026లో వచ్చిన ఈ సినిమాను బెన్ లియోన్‌బర్గ్ డైరెక్ట్ చేశారు. మిలా జోవోవిచ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం టేకెన్ తరహాలో సాగుతుంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇంగ్లీష్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

తెలుగు ఆడియో ఇంకా అందుబాటులోకి రాలేదు. కాబట్టి ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ సహాయంతో చూడచ్చు. మాథ్యూ మోడైన్, డి.బి. స్వీనీ, ఇసాబెల్ మైయర్స్ వంటి నటులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాలో తల్లి ప్రేమను అద్భుతంగా చూపించారు. కాబట్టి వీకెండ్ ఒక మంచి ఎమోషనల్ అండ్ యాక్షన్ డ్రామాను చూడాలి అనుకుంటే ఈ మూవీని చూడడం అస్సలు మరిచి పోవద్దు.

Read Also: దేవత కళ్ల నుండి కారే రక్తం… ఈ దెయ్యం చేసే పని చూస్తే దిమాక్ కరాబ్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×