E-Paper
Advertisement

మురుగదాస్, మణిరత్నం.. ఇప్పుడు రమేష్ వర్మ! ధ్రువ్ విక్రమ్ మళ్లీ సేమ్ సీన్ రిపీట్?

మురుగదాస్, మణిరత్నం.. ఇప్పుడు రమేష్ వర్మ! ధ్రువ్ విక్రమ్ మళ్లీ సేమ్ సీన్ రిపీట్?
Advertisement

Dhruv Controversy:ధ్రువ్ విక్రమ్… విక్రమ్ కొడుకుగా తొలి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్నాడు కానీ సరైన ప్లానింగ్ లేకో లేక చెప్పేవాళ్ళు లేకో కానీ వివాదాలలో ఇరుక్కుంటున్నాడు .ఇదే క్రమంలో తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నాడు అంటూ కోలీవుడ్ సర్కిల్స్ లో ఒక వార్త తెగ సర్కులేట్ అవుతుంది .
అవును… చేతిదాకా దాకా వచ్చిన ప్రాజెక్టులను మధ్యలోనే వదిలేయడం ధ్రువ్ విక్రమ్ కి అలవాటుగా మారిందన్న టాక్ ఫిలిం సర్కిల్స్ గట్టిగా వినిపిస్తుంది.

దీనికి ఫలితంగానే ఇప్పుడు ఏకంగా తమిళ్ ఫిలిమ్ చాంబర్లో ఆయనపై కంప్లైంట్ ఫైల్ కావడం కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లోనూ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది .
అసలు విషయంలోకి వెళ్తే.. నీలాద్రి ప్రొడక్షన్స్ మరియు పెన్ స్టూడియోస్ కలిసి ధ్రువ్ విక్రమ్. హీరోగా ఒక సాలిడ్ యాక్షన్ సినిమాని ప్లాన్ చేశాయి.
దీనికి రాక్షసుడు , ఖిలాడి సినిమాల దర్శకుడు రమేష్ వర్మ దర్శకత్వం వహించాల్సి ఉంది.

Advertisement

ధ్రువ్ విక్రమ్ కి ఏకంగా కోటి రూపాయలు అడ్వాన్స్

ఇక అగ్రిమెంట్ ప్రకారం ఈ సినిమా ధ్రువ్ విక్రమ్ కెరియర్ లో నాలుగో సినిమాగా ఉండాలి .ఇక ఇందుకోసం ధ్రువ్ విక్రమ్ కి ఏకంగా కోటి రూపాయలు అడ్వాన్స్ కూడా చెల్లించారట మేకర్స్ .ఇక సినిమా ని భారీగా తీద్ధామంటూ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి త్వరలోనే సెక్స్ మీదకి వెళ్లేందుకు రెడీ అయిపోయారు కూడా.
కానీ షూటింగ్ మొదలయ్యే సమయానికి ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు ధ్రువ్ విక్రమ్. అవును మీ సినిమా తర్వాత ముందు మైత్రి మూవీ మేకర్స్ లో ఒక సినిమా చేసుకొని వస్తా అంటూ సరికొత్త సినిమాని అనౌన్స్ చేశాడు .దీనిని కరణ్ దర్శకత్వం వహిస్తున్నాడు ఇక తాజాగా ఈ సినిమా పూజ కార్యక్రమాలు కూడా జరుపుకుంది .

Advertisement

Also read :‘చెన్నై లవ్ స్టోరీ’కి షాకింగ్ ట్విస్ట్.. OTT డీల్‌లో ఏం జరిగింది?

అయితే అగ్రిమెంట్ ప్రకారం రమేష్ వర్మ సినిమా అయ్యాకే మైత్రి సినిమా మొదలవ్వాలి కానీ అది అది ముందు మీది తర్వాత అంటూ వెనక్కినట్టడంతో షాక్ అయ్యారు ప్రొడ్యూసర్స్.ఇప్పటికే కోట్లు కుమ్మరించి సినిమా పనులు మొదలు పెట్టామని ఇప్పుడు గనక సినిమాని వెనక్కి తిడితే మరింత భారం పడుతుందంటూ ఫిలిం ఛాంబర్ మెట్లెక్కారు సదరు నిర్మాతలు.

కెరియర్ లో ఇలాంటివి కొత్తేమి కాదు

ఇదిలా ఉంటే ధ్రువ విక్రమ్ కెరియర్ లో ఇలాంటివి కొత్తేమి కాదు. అతడి మొదటి సినిమానే వివాదాల మధ్య బయటకి వచ్చింది. అదే అర్జున్ రెడ్డి కి రీమేక్ గా వచ్చిన వర్మ .మొదట్లో బాల దర్శకత్వంలో ఈ సినిమా అవుట్ ఫుట్ నచ్చలేదంటూ విక్రం మళ్లీ హరీషయ్యతో రిషూట్ చేయించాడు. ఇవే కాదు గతంలో ఏ ఆర్ మురగదాస్ ప్రొడక్షన్లో ఒక సినిమా, అలాగే మణిరత్నం దర్శకత్వంలో మరో సినిమా అనుకున్నప్పటికీ అవి సెట్స్ మీదికి రాకముందే వెనకడుగు వేశాయి.

ఇక ప్రశాంత్ నీల్ , గౌతమ్ మీనన్ వంటి వాళ్ళుధ్రువ్ విక్రమ్ తో సినిమాలు అనుకున్న ఏది ఒక కొలిక్కి రాని పరిస్థితి. ఈ సమయంలో ఏరి కోరి చేస్తామంటూ వచ్చిన నీలాద్రి ప్రొడక్షన్స్ ,పెన్ స్టూడియోస్ కి ఇలా హ్యాండ్ ఇవ్వడంతో మరోసారి ధ్రువ్ విక్రమ్ మీడియాలో హైలెట్ అవుతున్నాడు చూడాలి మరి ఈ సమస్యలని ఈ కుర్ర హీరో ఎలా పరిష్కరించుకుంటాడో !

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×