// // Middle Class OTT : మిడిల్ క్లాస్ కష్టాలతో తెరకెక్కిన మరో మూవీ... -->
E-Paper
Advertisement

Middle Class OTT : మిడిల్ క్లాస్ కష్టాలతో తెరకెక్కిన మరో మూవీ… ఓటీటీలోకి వచ్చేసిన తమిళ ఫ్యామిలీ కామెడీ డ్రామా

Middle Class OTT : మిడిల్ క్లాస్ కష్టాలతో తెరకెక్కిన మరో మూవీ… ఓటీటీలోకి వచ్చేసిన తమిళ ఫ్యామిలీ కామెడీ డ్రామా
Advertisement

Middle Class OTT : ఓటీటీలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ ల కోసం వెతుకుతున్నారా ? అయితే ఈ మూవీ మీ కోసమే. రీసెంట్ గా థియేటర్లలో సందడి చేసిన ఓ తమిళ ఫ్యామిలీ డ్రామా తాజాగా ఓటీటీలోకి అడుగు పెట్టింది. ప్రతీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యేలా రూపొందిన ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? దాని స్టోరీ ఏంటి? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం పదండి.

జీ5లో స్ట్రీమింగ్

తమిళ ఫ్యామిలీ డ్రామా ‘మిడిల్ క్లాస్’ (Middle Class) సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చింది. కిషోర్ ముత్తురామలింగం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మునిష్కాంత్ ప్రధాన పాత్రలో నటించారు. నాలుగు వారాలు థియేటర్లలో ఆడియన్స్ ను ఆకట్టుకున్న తర్వాత, ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ రంగంలోకి అడుగు పెట్టింది. ఈ మూవీ ప్రస్తుతం ZEE5లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇది ప్రస్తుతానికి తమిళంలో మాత్రమే అందుబాటులో ఉంది. విజయలక్ష్మి అహతియన్, కాళి వెంకట్, రాధా రవి, వేలా రామమూర్తి వంటి ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. మధ్యతరగతి కుటుంబంలోని కష్టాలను, కలలను నవ్విస్తూనే మనసుకు హత్తుకునేలా ఇందులో చూపించారు.

Advertisement

Read Also :  ఏడాది గడిచినా విడుదలకు నోచుకోని ఉపేంద్ర యాక్షన్ థ్రిల్లర్… చేతులెత్తేసిన మేకర్స్

స్టోరీలోకి వెళ్తే…

కార్ల్ మార్క్స్ (మునీష్కాంత్) సాధారణ మిడిల్ క్లాస్ వ్యక్తి. అతను EMIలు, ఆర్థిక ఇబ్బందులు, సమాజ ఒత్తిళ్ల మధ్య ఇరుక్కుపోయి సతమతం అవుతూ ఉంటాడు. అతని భార్య (విజయలక్ష్మి) అతిగా మాట్లాడే స్వభావం, పిల్లలు, కుటుంబ బాధ్యతలతో అన్నీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లాగానే కామన్ గా బతుకుతాడు. ఒక పొలం కొని ఫార్మింగ్ చేయాలనేది అతని కల. అయితే ఒక రోజు అనూహ్యంగా తన చనిపోయిన తండ్రికి బహుమతిగా వచ్చిన 1 కోటి రూపాయల చెక్ కనిపిస్తుంది. ఈ అద్భుతం వల్ల కుటుంబం ఒక్కసారిగా ధనవంతులుగా మారిపోతుంది. కొత్త జీవితం, ఖర్చులు, సంతోషం అన్నీ వస్తాయి. కానీ కుటుంబం ఈ రిచ్ జీవితానికి అలవాటు పడుతున్న సమయంలో చెక్ పోతుంది. ఇక అక్కడి నుంచి కామెడీ, ఎమోషన్, గందరగోళం మొదలవుతాయి. పైసా వాల్యూ, కుటుంబ బంధాలు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ జీవితాలను నవ్వులు, కన్నీళ్లతో చూపిస్తుంది. ఈ రియలిస్టిక్ ఫ్యామిలీ డ్రామాను ఫ్యామిలీలకు బాగా రిలేట్ అయ్యే కథతో, హీరోయిజం లేకుండా, సహజమైన నటన, హార్ట్‌వార్మింగ్ మూమెంట్స్ తో అద్భుతంగా రూపొందించారు.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×