E-Paper
Advertisement

Shambala Movie : ‘శంబాల’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..అనుకున్న సమయం కంటే ముందుగానే

Shambala Movie : ‘శంబాల’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..అనుకున్న సమయం కంటే ముందుగానే
Advertisement

Shambala Movie : యంగ్ హీరో ఆది సాయి కుమార్ హీరోగా నటిస్తున్న ‘శంబాల’ సినిమా ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. విభిన్నమైన కథాంశంతో, అద్భుతమైన విజువల్స్‌తో తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా ఓటీటీ హక్కులు ,స్ట్రీమింగ్ తేదీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.


అంతుచిక్కని రహస్యం

పురాణాల ప్రకారం ‘శంబాల’ అనేది ఒక రహస్యమైన ప్రదేశం. అదే స్ఫూర్తితో ఒక ఉత్కంఠభరితమైన మిస్టరీ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందించారు. టీజర్, ట్రైలర్‌లలో ఆది సాయి కుమార్ సరికొత్త మేకోవర్‌తో పాటు పవర్‌ఫుల్ నటన సినిమాపై హైప్‌ను పెంచేశాయి. వరుస ఫ్లాపుల తర్వాత ఆది ఈ విజువల్ వండర్ సినిమాతో ఎలాగైనా భారీ హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నారు.

Advertisement

సినిమా బడ్జెట్
ఈ సినిమా సుమారు 12 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కినట్లు సమాచారం. ఆది సాయి కుమార్ కెరీర్‌లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా నిలిచింది.కథా నేపథ్యం ప్రకారం ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్ , గ్రాఫిక్స్ కోసం నిర్మాతలు ఎక్కడా వెనకాడకుండా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

భారీ ధరకు ఆహా సొంతం
తాజా సమాచారం ప్రకారం.. ‘శంబాల’ ఓటీటీ హక్కుల కోసం ప్రముఖ సంస్థల మధ్య గట్టి పోటీ నెలకొంది. చివరికి, ఆహా సంస్థ భారీ ధరకు ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను దక్కించుకుంది. ఆది సాయి కుమార్ కెరీర్‌లో ఇది అత్యంత భారీ ఓటీటీ డీల్ అని ఫిలిం నగర్ వర్గాల సమాచారం.

Advertisement

స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సంక్రాంతి పండుగ నేపథ్యంలో భారీ సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అందుకే ‘శంబాల’ను పండుగ కంటే ముందే ఓటీటీలోకి తీసుకురావాలని ఆహా ప్లాన్ చేస్తోంది. జనవరి 9 లేదా 10వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. థియేటర్లలో విడుదలైన మూడు వారాలకే ఈ సినిమా డిజిటల్ ప్రేక్షకులను పలకరించబోతోంది. మిస్టరీ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ‘శంబాల’ ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×