E-Paper
Advertisement

Medical Thriller OTT : డాక్టర్ పీకకు చుట్టుకునే పిల్లాడి చావు… మైండ్ బెండింగ్ మెడికల్ థ్రిల్లర్

Medical Thriller OTT : డాక్టర్ పీకకు చుట్టుకునే పిల్లాడి చావు… మైండ్ బెండింగ్ మెడికల్ థ్రిల్లర్
Advertisement

Medical Thriller OTT : సీను సీనుకో ట్విస్టుతో టెన్షన్ పెట్టే మెడికల్ థ్రిల్లర్ లకు ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతోంది. నిజానికి ఈ జానర్లో వచ్చే సినిమాలు చాలా అరుదు. కానీ ఎంగేజింగ్ స్టోరీస్ తో ఇలాంటి సినిమాలు ఇచ్చే కిక్కు అంతా ఇంతా కాదు. మీరు కూడా ఓటీటీలో ఏదైనా కొత్తగా చూడాలనుకుంటే ఈ మూవీ మీ కోసమే. గ్రిప్పింగ్ స్టోరీతో ఇంటెన్స్ మెడికల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ ఏ ఓటీటీలో ఉందో తెలుసుకుందాం పదండి.

జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్

హిందీ మెడికల్ థ్రిల్లర్ చిత్రం ‘అంకుర్ అరోరా మర్డర్ కేస్’ (Ankur Arora Murder Case) మూవీ 2013లో విడుదలైంది. దర్శకుడు సుహైల్ తతారీకి ఇదే మొదటి మూవీ. ఇది రియల్ లైఫ్ మెడికల్ నెగ్లిజెన్స్ కేసుల ఆధారంగా తీసిన ఫిక్షనల్ మూవీ. హాస్పిటల్స్‌ లో జరిగే చిన్న చిన్న పొరపాట్లు, వాటివల్ల జరిగే పరిణామాలు ఏంటి అన్న విషయాలను ఇందులో ప్రత్యేకంగా చూపించారు. కేకే మీనన్ ఇందులో డాక్టర్ ఆస్థానా అనే టాప్ సర్జన్ గా నటించాడు. అర్జున్ మాథుర్ రోమేష్ అనే ఇంటర్న్ డాక్టర్ పాత్రను పోషించాడు. విశాఖా సింగ్ నందితా అనే లాయర్ గా, తస్కీన్ రహ్మాన్ విక్టిం అంకుర్ అరోరాగా నటించారు. 2 గంటల 9 నిమిషాలు రన్‌టైమ్ ఉన్న ఈ మూవీ 2013 జూన్ 14న థియేటర్స్‌లో రిలీజ్ అయ్యింది. IMDbలో 6.4 రేటింగ్ ఉన్న ఈ మూవీ Jio Hotstarలో స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంది.

Advertisement

Read Also :  గోడలో దాగి ఉన్న కాళీమాత… వరుస హత్యలతో వల్లకాడుగా మారే మ్యాన్షన్… క్షణక్షణం ఉత్కంఠ రేపే మర్డర్ మిస్టరీ

స్టోరీ వివరంగా

కథ ఒక ప్రైవేట్ హాస్పిటల్‌ చుట్టూ తిరుగుతుంది. అంకుర్ అరోరా (తస్కీన్ రహ్మాన్) అనే 8 ఏళ్ల అబ్బాయి ఓ జబ్బుతో ఆపరేషన్ కోసం అడ్మిట్ అవుతాడు. సింపుల్ ప్రొసీజర్ చేయాల్సి ఉంటుంది. టాప్ సర్జన్ డాక్టర్ ఆస్థానా (కే కే మీనన్) చేతుల మీదుగా ఈ ఆపరేషన్ జరుగుతుంది. కానీ ఆపరేషన్ టైమ్ లో ఇంటర్న్ డాక్టర్ రోమేష్ (అర్జున్ మాథుర్) చేసిన చిన్న పొరపాటు డాక్టర్స్ ను డేంజర్ లో పడేస్తుంది. ఆ ఇంటర్న్ వల్ల అంకుర్ ఆపరేషన్ టేబుల్ మీదే చనిపోతాడు. ఆస్థానా ఈగో వల్ల మిస్టేక్ ‌ను కవర్ చేయడానికి ట్రై చేస్తాడు. ఫేక్ రిపోర్ట్స్ తయారు చేయించి తనపై మచ్చ పడకుండా చూసుకుంటాడు. అంతేకాదు ఆ తప్పుకు రోమేష్‌ ను బ్లేమ్ చేస్తాడు. అంకుర్ తల్లి నందితా (విశాఖా సింగ్) మాత్రం తన కొడుకు చావు విషయంలో వెనక్కి తగ్గదు. జస్టిస్ కోసం ఫైట్ చేయడానికి ముందుకు వస్తుంది. లాయర్‌ గా మారి కేసును ఫైల్ చేయడమే కాదు కొడుకు చావుకు న్యాయం జరిగేదాకా పోరాడుతుంది. ఒకవైపు కోర్ట్ ట్రయల్ సాగుతుంటే… మరోవైపు హాస్పిటల్ మేనేజ్‌మెంట్, డాక్టర్స్ టీమ్ ఎవిడెన్స్ ను నాశనం చేస్తారు. అంతేకాదు విట్నెసెస్‌ ను సాక్ష్యం చెప్పొద్దు అని బెదిరిస్తారు. రోమేష్ గిల్ట్ ఫీల్ అయినా సర్జన్ ఆస్థానా ప్రెషర్ వల్ల సైలెంట్ అయిపోతాడు. ఏ దిక్కూ లేక నందితా ఒంటరిది అవుతుంది. ఇంతకీ ఆ పిల్లాడి చావుకు న్యాయం జరిగిందా ? పిల్లాడి తల్లికి ఈ న్యాయ పోరాటంలో తోడు నిలిచింది ఎవరు ? చివరకు డాక్టర్ బండారాన్ని ఎలా బయట పెట్టారు ? అన్నది తెరపై చూడాల్సిన విషయాలు.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×