E-Paper
Advertisement

Bhartha Mahasayulaku Wignyapthi : మాసోడి ‘ భర్త మహాశయులకు విజ్ఞప్తి ‘ సెన్సార్ పూర్తి.. రన్ టైం ఎంతంటే..?

Bhartha Mahasayulaku Wignyapthi : మాసోడి ‘ భర్త మహాశయులకు విజ్ఞప్తి ‘ సెన్సార్ పూర్తి.. రన్ టైం ఎంతంటే..?
Advertisement

Bhartha Mahasayulaku Wignyapthi : టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న రవితేజకు ఈ మధ్య ఒక్క హిట్ సినిమా కూడా పలకరించలేదు. ఆయన ఎన్ని చేసినా కూడా ఆ సినిమాల నీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ కాకుండా మాత్రమే సొంతం చేసుకుంటున్నాయి. మిస్టర్ బచ్చన్ మూవీ దారుణంగా నిరాశపరిచింది. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ రాబోతుంది.. సంక్రాంతి కానుకగా ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేస్తుందని తెలుస్తుంది.. మరి ఈ సినిమా సెన్సార్ రిపోర్ట్ ఎలా ఉంది? రన్ టైం ఎంత ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ రన్ టైం.. 

పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సబ్జెక్ట్‌గా ఈ మూవీని రూపొందించారు.. గతంలో వచ్చిన సినిమాలతో పోలిస్తే ఈ సినిమా జనాలను బాగా ఎంటర్టైన్ చేస్తుందని ఇప్పటివరకు రిలీజైన అప్డేట్స్ చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాతో రవితేజ చాలా రోజుల తర్వాత తన జోనర్ మార్చుకున్నాడు.. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నట్లు తెలుస్తుంది. యు /ఏ సర్టిఫికెట్ను అందుకోవడంతో పాటుగా రన్ టైమ్ ని కూడా లాక్ చేసుకుంది.. ఈ చిత్రానికి 2 గంటల 10 నిమిషాల రన్‌టైమ్ లాక్ చేశారని సినీ సర్కిల్స్‌లో చర్చ సాగుతోంది.. గతంలో ఎన్నడు లేని విధంగా రవితేజ సినిమాకు ఇలాంటి రన్ టైం రావడం ఇదే మొదటిసారి. దీంతో సినిమా ఏది చూపించాలో అది చూపించే విధంగా ఉంటుందని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు.. మరి సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Also Read : మహాను చూసి చక్రి ఫీల్.. కవితకు నో చెప్పిన మాధవ్..మహా కోసం చక్రి మరో ప్లాన్..

ఇద్దరు హీరోయిన్లతో రవితేజ రొమాన్స్.. 

మాస్ హీరో రవితేజ నటిస్తున్న తాజా చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి.. ఈ సినిమాలో రవితేజ సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లు.. 2026 సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి బయటకు వచ్చిన ప్రతి అప్డేట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి..టీజర్, సాంగ్స్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో మూవీపై మంచి హైపే నెలకొంది.. వామ్మో వాయ్యో అంటూ సాగే ఈ సాంగ్ ప్రోమో చూస్తుంటే పాట మంచి డ్యాన్స్ నెంబర్ లానే అనిపిస్తుంది.. ఈ సాంగ్ ను జనవరి 2 న రిలీజ్ చెయ్యనున్నారు. ఈ సాంగ్ ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.. ఈ మూవీ పై రవితేజ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. మరి ఈ సినిమా అయినా తన ఖాతాలో హిట్ పడేలా చేస్తూనేమో చూడాలి..

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×