E-Paper
Advertisement

Medical Drama ott : నిమిషానికో ట్విస్ట్… ఈ సిరీస్ ను చూశాక డాక్టర్లకు దండం పెడతారు… కే-డ్రామా లవర్స్ డోంట్ మిస్

Medical Drama ott : నిమిషానికో ట్విస్ట్… ఈ సిరీస్ ను చూశాక డాక్టర్లకు దండం పెడతారు… కే-డ్రామా లవర్స్ డోంట్ మిస్
Advertisement

Medical Drama ott : కొరియన్ సిరీస్ లు ఇప్పుడు హాట్ కేకులుగా మారాయి. కొన్ని సిరీస్ లు తీసిన ప్రతి సీజన్ సూపర్ హిట్ అవుతున్నాయి. అలాంటి సిరీస్ గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఇదొక మెడికల్ డ్రామా సిరీస్. మూడు సీజన్లు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఐయండిబిలో 8.0/10 రేటింగ్ కూడా ఉంది దీనికి. స్టోరీ అంతా ఒక హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంది. ఒక్క సారి చూడటం స్టార్ట్ చేస్తే ఇక ఆపమన్నా ఆపరు. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

సౌత్ కొరియన్ మెడికల్ డ్రామా సిరీస్ పేరు ‘డాక్టర్ రొమాంటిక్’ (Doctor romantic). ఇది యూన్ సె-హో దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో హాన్ సుక్-క్యు టైటిల్ రోల్‌లో నటించారు. యు యోన్-సియోక్, సియో హ్యూన్-జిన్, అహ్న్ హ్యో-సియోప్, లీ సుంగ్-క్యుంగ్, కిమ్ జూ-హున్‌ మిగతా పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ ఒక చిన్న కౌంటీ హాస్పిటల్‌లో జరిగే మెడికల్ డ్రామా. రొమాన్స్, ఫ్రెండ్‌షిప్ మిక్స్‌తో ఉంటుంది. ఇది దక్షిణ కొరియాలో అత్యంత పాపులర్ మెడికల్ డ్రామాల్లో ఒకటిగా నిలిచిపోయింది. మొదటి సీజన్ 2016 నవంబర్ 7 నుండి 2017 జనవరి 16 వరకు 20 ఎపిసోడ్‌ల తో ప్రసారం అయింది. రెండవ సీజన్ 2020 జనవరి 6 నుండి ఫిబ్రవరి 25 వరకు 16 ఎపిసోడ్‌లతో వచ్చింది. మూడవ సీజన్ 2023 ఏప్రిల్ 28 నుండి జూన్ 17 వరకు 16 ఎపిసోడ్లతో వచ్చింది. ప్రస్తుతం Netflix, Viki, Kocowa, Prime Video, mxplayerలో అందుబాటులో ఉంది.

Advertisement

Read Also :  సడన్ గా మిస్సయ్యే భార్య… కల్లోనే భర్తకు దారి చూపే ఆధారాలు… నరాలు కట్టయ్యే సస్పెన్స్ థ్రిల్లర్

స్టోరీ ఏమిటంటే

ఈ స్టోరీ దొలోస్ కౌంటీ హాస్పిటల్‌లో స్టార్ట్ అవుతుంది. ఇది ఒక చిన్న గ్రామీణ హాస్పిటల్. పెద్ద హాస్పిటల్స్‌తో పోలిస్తే చాలా సాధారణమైనది. కానీ ఇక్కడ కిమ్ సా-బు అనే ఒక లెజెండరీ సర్జన్ ఉన్నాడు. అతన్ని “డాక్టర్ రొమాంటిక్” అని కూడా ముద్దుగా పిలుస్తారు. అతను చాలా టాలెంటెడ్ సీనియర్ సర్జన్. కానీ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. గతంలో పెద్ద హాస్పిటల్‌లో పని చేసి రాజీనామా కూడా చేశాడు. ఇక కథలో ఇద్దరు యంగ్ డాక్టర్స్ ఎంట్రీ ఇస్తారు. కాంగ్ డాంగ్-జూ అనే ఒక టాలెంటెడ్ సర్జన్ వస్తాడు. కానీ అతనికి గతంలో ట్రామా ఉంది. అతను పేషెంట్స్‌ను సేవ్ చేయడానికి భయపడతాడు. అలాగే యూన్ సా-జియాన్ ఒక యంగ్ యువతి కూడా ఎంట్రీ ఇస్తుంది. అయితే ఆమెకు కూడా కాన్ఫిడెన్స్ ఉండదు.

Advertisement

ఈ ముగ్గురూ కలిసి దొలోస్ హాస్పిటల్‌లో పని చేస్తారు. చిన్న హాస్పిటల్ అయినా పెద్ద పెద్ద ఎమర్జెన్సీ కేసులు వస్తాయి. సా-బు స్ట్రిక్ట్‌గా ట్రైన్ చేస్తాడు. అతని మెథడ్ చాలా హార్డ్ గా ఉన్నా కానీ ఎఫెక్టివ్ గా ఉంటాయి. మధ్యలో రొమాన్స్, ఫ్రెండ్‌షిప్, టీమ్ వర్క్ డెవలప్ అవుతాయి. సిరీస్ మొత్తం మెడికల్ కేసులు, ఎమర్జెన్సీ సర్జరీలు, డాక్టర్స్ మధ్య బాండింగ్ ఆసక్తిగా చూపిస్తుంది. ఎండింగ్ వరకు ఈ సిరీస్ హార్ట్ ని టచ్ చేస్తుంది.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×