E-Paper
Advertisement

డబ్బుల కోసమే బాయ్ ఫ్రెండ్ తో ప్రేమ డ్రామా… నాగ దుర్గ తమిళ మూవీ తెలుగు స్ట్రీమింగ్ షురూ

డబ్బుల కోసమే బాయ్ ఫ్రెండ్ తో ప్రేమ డ్రామా… నాగ దుర్గ తమిళ మూవీ తెలుగు స్ట్రీమింగ్ షురూ
Advertisement

Romantic Comedy: ప్రేమలో ఖర్చులు చేయడం కొత్త విషయం కాదు. కానీ ప్రేమ కోసం చేసిన ఖర్చులే ఒక యువకుడి జీవితాన్ని నడి రోడ్డు మీద పడేస్తే ? ప్రేమ, డబ్బు, నమ్మకం… ఈ మూడు కలిసి ఒకరి జీవితాన్ని ఎలా మార్చేస్తాయో సరదాగా చూపించే సినిమానే Love Oh Love. ప్రముఖ తెలుగు యూట్యూబర్ నాగ దుర్గ కోలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయమైన ఈ రొమాంటిక్ కామెడీ డ్రామాలో… ప్రేమలో జరిగే ఆర్థిక ఇబ్బందులను వినోదాత్మకంగా చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మరి ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చింది ? తెలుగులో చూడొచ్చా ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

రఘువరన్ అనే మధ్యతరగతి యువకుడు మన హీరో. వచ్చే ప్రతీ రూపాయిని ఇంట్లో తండ్రికి ఇచ్చేస్తాడు. తన ఖర్చులకు కూడా తండ్రి దగ్గర అడిగి తీసుకునే అమాయకుడు. అయితే అతను ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. మొదట ఆ ప్రేమకథ చాలా అందంగా సాగుతుంది. కానీ కొద్దికొద్దిగా ఆ ప్రేమలో డబ్బు కూడా ప్రధాన పాత్ర పోషించడం మొదలవుతుంది. ప్రియురాలి కోరికలు, రిచ్ లైఫ్ స్టైల్ కోసం రఘువరన్ తన సంపాదనకే కాదు… క్రెడిట్ కార్డులపై కూడా ఆధారపడాల్సి వస్తుంది.

Advertisement

ప్రేమ కోసం చేస్తున్నానని అనుకున్న ప్రతి ఖర్చు… చివరకు అతన్ని భారీ అప్పుల్లోకి నెట్టేస్తుంది. ప్రియురాలి కోరికలు తీర్చడం తన బాధ్యత అనుకుని, సంపాదనకు మించిన ఖర్చులు చేసి, రోడ్డున పడతాడు. పరిస్థితి చేతికి అందకుండా పోవడంతో ఈ బంధం నుంచి బయట పడాలని రఘువరన్ నిర్ణయించుకుంటాడు. కానీ అక్కడే కథ మరో మలుపు తిరుగుతుంది.

ప్రియురాలు అతనిపై పోలీస్ ఫిర్యాదు చేయడంతో కథ పోలీస్ స్టేషన్‌కు చేరుతుంది. అక్కడ రఘువరన్ తన ప్రేమకథను, ప్రేమ కోసం తాను పడిన ఆర్థిక కష్టాలను చెప్పే విధానం నవ్వులు పంచుతుంది. అసలు వీళ్ళకు ఏమైంది ? నిజంగా ఎవరి తప్పు ఎక్కువగా ఉంది ? డబ్బు కారణంగా మొదలైన ఈ సమస్య ఎలా ముగిసింది ? అనే అంశాల చుట్టూ కథ ఆసక్తికరంగా సాగుతుంది.

తెలుగులోనూ అందుబాటులో

Advertisement

ప్రస్తుతం ‘లవ్ ఓ లవ్’ మూవీ Amazon Prime Videoలో అవైలబుల్ గా ఉంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో నాగ దుర్గ, పవిష్ నారాయణ్ ప్రధాన పాత్రల్లో నటించగా, సెల్వరాఘవన్, కె.ఎస్. రవికుమార్, వనితా విజయ్‌కుమార్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. ప్రేమ, డబ్బు, నేటి యువత ఎదుర్కొనే ఆర్థిక ఒత్తిడిని కామెడీతో మిళితం చేసిన తీరు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. లైట్ హార్ట్‌డ్ రొమాంటిక్ కామెడీలు, రిలేషన్‌షిప్‌లలో వచ్చే సరదా సమస్యలు, నేటి యువత జీవితానికి దగ్గరగా ఉండే కథలు ఇష్టపడే మూవీ లవర్స్ ఒకసారి చూడొచ్చు. నవ్వులతో పాటు ప్రేమలో నమ్మకం, బాధ్యత, ఆర్థిక క్రమశిక్షణ ఎంత ముఖ్యమో చెప్పే ఈ సినిమా వీకెండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు మంచి ఆప్షన్.

Read Also: అమెరికాను కుదిపేసిన రియల్ సైకో స్టోరీ… తెలుగులోనే ఈ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×