E-Paper
Advertisement

బైక్‌పై వెళ్తూ పాటలు వింటున్నారా? అయితే మీ డ్రైవింగ్ లైసెన్స్ గోవిందా!

బైక్‌పై వెళ్తూ పాటలు వింటున్నారా? అయితే మీ డ్రైవింగ్ లైసెన్స్ గోవిందా!
Advertisement

Earphone Riding: ఈ రోజుల్లో రోడ్డుపై ద్విచక్రవాహనం నడిపేటప్పుడు చెవిలో ఇయర్ ఫోన్స్, ఇయర్ బడ్స్ పెట్టుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. అయితే ప్రయాణంలో పాటలు వినడమనేది.. కొందరికి ఒక ఎంటర్ టైన్ మెంట్ కావొచ్చు. కానీ ఈ అలవాటు వారితో పాటు రోడ్డుపై వెళ్లే మిగతావారిని సైతం ప్రమాదంలోకి నెట్టొచ్చు. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని బైక్ నడపడం వల్ల రోజు రోజుకు ప్రమాదాలు పెరుగుతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు సైతం చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. చట్ట ప్రకారం ఎలాంటి చర్యలు ఉంటాయో ఈ కథనంలో చూద్దాం.

ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే..

సాధారణంగా రోడ్డుపై వెళ్తున్నప్పుడు మన దృష్టితో పెట్టు, చెవులు సైతం అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ చెవుల్లో ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని ఎక్కువ శబ్దంతో పాటలు వింటూ వెళ్తే.. వెనుక నుంచి వచ్చే వాహనాల హార్న్ శబ్దాలు, అంబులెన్స్ సైరన్లు వినిపించవు. అంతేకాకుండా ఒక్కోసారి పక్క వాహనదారులు, ట్రాఫిక్ పోలీసులు ఇచ్చే ఎమర్జెన్సీ వార్నింగ్స్ సైతం చెవిన పడకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో భారీ ప్రమాదాలు జరిగే అవకాశముందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఏదైనా తేడా జరిగితే జీవితాంతం బాధపడాల్సిందేనని పేర్కొంటున్నారు.

ట్రాఫిక్ రూల్స్ ఏం చెబుతున్నాయ్?

Advertisement

ట్రాఫిక్ రూల్స్ ప్రకారం.. ఇయర్ ఫోన్లు పెట్టుకొని బైక్ లేదా స్కూటర్ నడపడం ముమ్మాటికీ తప్పే. ఇలా చేయడాన్ని ‘డిస్ట్రాక్టెడ్ డ్రైవింగ్’ (ఏకాగ్రత లేని డ్రైవింగ్) గా ట్రాఫిక్ పోలీసులు పరిగణిస్తారు.అటు మోటార్ వాహనాల చట్టం ప్రకారం కూడా ఇది తీవ్రమైన నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుంది.

రూ.5 వేల వరకూ జరిమానా!

ఇయర్ ఫోన్స్ పెట్టుకొని బైక్ నడుపుతూ పట్టుబడితో భారీగా చలానాలు విధించే హక్కు పోలీసులకు ఉంటుంది. మెుదటిసారి అలా దొరికితే ఏపీ, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో రూ.1,000 నుండి రూ. 2,000 వరకు జరిమానా విధిస్తారు. కొన్ని రాష్ట్రాల్లో అయితే ఈ ఫైన్ రూ.5,000 వరకు ఉంది. అయితే జరిమానా విధించిన తర్వాత కూడా ఇదే తప్పు రిపీట్ గా చేస్తూ పట్టుబడితే.. డ్రైవింగ్ లైసెన్స్ ను సస్పెండ్ చేయడం లేదా రద్దు చేసే అధికారం పోలీసులకు ఉంటుంది.

Advertisement

Also Read: హ్యుందాయ్‌కు బిగ్ షాక్.. ఏప్రిల్-జూన్‌లో కుప్పకూలిన లాభాలు.. ఎగుమతులు సైతం డౌన్!

పాటల కంటే ప్రాణమే ముఖ్యం!

అయితే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని బైక్ పైన వెళ్లేవారు కొన్ని బేసిక్ విషయాలను మర్చిపోతున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. పాటల కంటే ప్రాణం ఎంతో విలువైందన్న ప్రాథమిక సూత్రాన్ని వారు గుర్తుంచుకోవాలని హితవు పలుకుతున్నారు. డ్రైవింగ్ సమయంలో ఏకాగ్రతను దెబ్బతీసే ఎలాంటి పనులు చేయవద్దని సూచిస్తున్నారు. సేఫ్ గా ఇంటికి చేరక పాటలు వింటారో.. సినిమాలు చూస్తారో మీ ఇష్టమని స్పష్టం చేస్తున్నారు.

Also Read: విశాఖ రైల్వే స్టేషన్‌కు మహర్దశ.. ఎయిర్‌పోర్ట్ రేంజ్ సౌకర్యాలు.. 6 కొత్త ప్లాట్‌ఫామ్‌లు!

Tags

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×