// // Horror Thriller OTT : 8 ఏళ్ల తర్వాత 3,000 ఏళ్ల నాటి పురాతన శవపేటికలో -->
E-Paper
Advertisement

8 ఏళ్ల తర్వాత 3,000 ఏళ్ల నాటి పురాతన శవపేటికలో… గుండె జారిపోయే సీన్లు

8 ఏళ్ల తర్వాత 3,000 ఏళ్ల నాటి పురాతన శవపేటికలో… గుండె జారిపోయే సీన్లు
Advertisement

Horror Thriller OTT : ఒళ్లు గగుర్పొడిచే హర్రర్ మూవీస్ ఓటీటీలో ఎన్నో ఉన్నాయి. కానీ థియేటర్లలో డదడదలాడించి, తాజాగా ఓటీటీలోకి వచ్చిన హారర్-థ్రిల్లర్ చిత్రం Lee Cronin’s The Mummy (2026). Evil Dead Rise ఫేమ్ దర్శకుడు లీ క్రోనిన్ తెరకెక్కించిన ఈ హర్రర్ మూవీ పాత యాక్షన్-అడ్వెంచర్ మమ్మీ సినిమాలా మాత్రం ఉండదు.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఈ హర్రర్ విజువల్ వండర్ 2026 ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలో రిలీజ్ అయ్యింది. జేమ్స్ వాన్ – జేసన్ బ్లమ్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత ఈ సినిమా Amazon Prime Videoలో రెంట్‌ కి స్ట్రీమింగ్‌ కు అందుబాటులోకి వచ్చేసింది. మే 19 నుంచి ఈ హర్రర్ మూవీ అందుబాటులోకి వచ్చింది. నటాలీ గ్రేస్ దెయ్యం పట్టిన అమ్మాయిగా ఒళ్లు గగుర్పొడిచే యాక్టింగ్ ను కనబరిచింది. ‘Evil Dead’, ‘Hereditary’ వంటి ప్యూర్ హారర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా పీడకల లాంటి అనుభూతిని ఇవ్వడం మాత్రం పక్కా.

కథలోకి వెళ్తే…

Advertisement

చార్లి కానన్ (జాక్ రేనర్) అనే జర్నలిస్ట్, అతని కుటుంబం చుట్టూ తిరిగే స్టోరీ ఇది. ఈ ఫ్యామిలీ అంతా కలిసి ఈజిప్ట్‌ కు వెళ్తుంది. వాళ్ళకు 9 ఏళ్ల చిన్న కూతురు కేటీ కూడా ఉంటుంది. అయితే ఆ పాప ఎడారిలో అకస్మాత్తుగా మిస్ అవుతుంది. ఫ్యామిలీ అంతా కలిసి ఎంత వెతికినా ఆ పాప జాడ మాత్రం దొరకదు. అయితే షాకింగ్ గా 8 సంవత్సరాల తర్వాతకు స్టోరీ మారుతుంది. ఆ కుటుంబం అమెరికాలోని అల్బుకెర్కీ నగరంలో స్థిరపడుతుంది. ఈ క్రమంలో వారికి ఈజిప్ట్ డిటెక్టివ్ డాలియా నుండి ఫోన్ కాల్ వస్తుంది. 3,000 ఏళ్ల నాటి పురాతన శవపేటికలో కేటీ ప్రాణాలతో దొరికిందనేది ఆ కాల్ సారాంశం.

Also Read : సినిమా హిస్టరీలోనే అత్యంత భారీ బడ్జెట్… హైవోల్టేజ్ యాక్షన్ తో సాగే మాస్టర్ పీస్ సిరీస్

Advertisement

8 ఏళ్ల క్రితం మిస్ అయిన ఆ పాప 17 ఏళ్ల వయసులో ఇంటికి తిరిగి వస్తుంది. ఇన్నేళ్ల తరువాత కేటీని చూసి తల్లిదండ్రులు తెగ సంతోష పడతారు. కానీ ఆమె మానసికంగా బాగా దెబ్బతింటుంది. ఆమె శరీరంపై ప్రాచీన మంత్రాల రాతలు రాసి ఉన్న బట్టలు ఉంటాయి. ఇక్కడే ట్విస్ట్ ఉంటుంది. ఆమెను ఇంటికి తీసుకు వచ్చాక ఆ ఇంట్లో వింత వింత సంఘటనలు జరుగుతాయి. భయంకరమైన నరకంలా తయారవుతుంది ఇల్లు. ఆకలి, ఎండ లేకపోవడం వల్ల ఆమె అలా మారిందని ముందు అనుకుంటారు. కానీ ఆమెను బంధించిన వారు ఆమె శరీరాన్ని పురాతన ఈజిప్షియన్ దుష్టాత్మకు వాహనంగా మార్చేశారని చార్లి దంపతులు గ్రహించడానికి ఎక్కువ సమయం పట్టదు. కేటీ శరీరం నుండి ఒక్కో కట్టు విడిపోతున్న కొద్దీ, ఆమెలోని ఆ రాక్షస శక్తి మరింత స్ట్రాంగ్ అవుతుంది. మరి ఆ అమ్మాయిని తల్లితండ్రులు ఎలా కాపాడుకున్నారు ? చివరికి ఏమైంది ? అనేది తెలుసుకోవాలంటే ఈ మూవీని చూడాల్సిందే.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×