E-Paper
Advertisement

OTT Movie: భయం పోయేందుకు బొద్దింకలు తినే అమ్మాయి… ప్రియున్ని దారుణంగా… తండ్రిని ఘోరంగా

OTT Movie: భయం పోయేందుకు బొద్దింకలు తినే అమ్మాయి…  ప్రియున్ని దారుణంగా… తండ్రిని ఘోరంగా
Advertisement

OTT Movie : మలయాళం సినమాలు స్లోగా రన్ అవుతూ ఉన్నా, మధ్యలో వచ్చే ట్విస్ట్లు కిరాక్ అనిపిస్తుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఇందులో ఆమె నవరసాలు పండిస్తుంది. కాలేజ్ లైబ్రరీలో స్టార్ట్ అయ్యే ఈ స్టోరీ కొందరి జీవితాలను తలకిందులు చేస్తుంది. మిస్టీరియస్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా, థ్రిల్లర్ ఫ్యాన్స్ కి సూట్ అవుతుంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

వైసాగ్ జోజన్ మొదటి సారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పేరు ‘కూర’. 2021లో విడుదలైన మలయాళం మిస్టరీ థ్రిల్లర్ మూవీలో కీర్తి ఆనంద్ (జెన్సీ), వర్థిక్ (వర్థిక్) లీడ్ రోల్స్‌లో నటించారు. జోజన్ సినిమాస్ ప్రొడక్షన్ నిర్మాణంలో 2021 సెప్టెంబర్ 8న థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా, ప్రస్తుతం Saina Play ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది 114 నిమిషాల రన్ టైమ్ తో ఐయండిబిలో 6.1/10 రేటింగ్ పొందింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

వర్థిక్ అనే కాలేజ్ స్టూడెంట్ ఒక రోజు లైబ్రరీలోకి వెళ్తాడు. అక్కడ జెన్సీ జైసన్ అనే సీనియర్ అమ్మాయి ఒక వింత స్థితిలో కనిపిస్తుంది. ఆమె కళ్లు తెరిచి, ఏమీ మాట్లాడకుండా, ఒక పుస్తకం మీద చూస్తూ కూర్చుని ఉంటుంది. ఆమె మీద అతను ఇంట్రెస్ట్ గా ఉంటాడు. ఆ తరువాత ఫ్రెండ్ షిప్ కూడా చేస్తాడు. ఆమెకి అమ్నీషియా వచ్చినట్టు అనిపిస్తుంది. వర్థిక్ జెన్సీ గతం తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు. అయితే జెన్సీ కి బొద్దింకలను తినే అలవాటు ఉంటుంది. ఆమె ఎక్కడ ఉన్నా వాటిని మాత్రం వదలకుండా ఆరగిస్తుంటుంది.

Read Also : గేమ్‌తో డేంజరస్ ఆత్మ రిటర్న్… చావును దగ్గరగా చూపించే మంత్రగత్తె… ఈ సినిమా చూస్తే గూస్ బంప్స్ పక్కా

Advertisement

ఆమె విచిత్ర ప్రవర్తన మీద అనుమానం వచ్చి ఫాలో చేస్తాడు వర్థిక్. ఆమె బొద్దింకను తినడం చూసి ఆశ్చర్యపోతాడు. అప్పుడే జెన్సీ అతన్ని ఒక గోతిలోకి తోసి చంపేసి ఏమీ తెలియనట్టు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆమె గతం కూడా రివీల్ అవుతుంది. అతని తండ్రి వల్ల ఆమె ఒక సైకిక్ గా మారింది. చిన్నప్పుడు ఎక్కువగా హింసకు గురవ్వడం వళ్ళ ఇలా మారిపోయి ఉంటుంది. ఆమె ఎందుకు వర్థిక్ ని చంపింది ? ఆమె గతంలో ఎలాంటి హింసలో చిక్కుకుంది ? ఈ కథకి ముగింపు ఏమిటి ? అనే విషయాలను, ఈ మలయాళ మిస్టరీ థ్రిల్లర్ సినిమాని చూసి తెలుసుకోండి.

 

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×