E-Paper
Advertisement

Sperm: ఒక్క స్పెర్మ్‌ లో.. 0.8 జీబీ డేటా? మీరు స్కలించే వీర్యం ఎన్ని జీబీల డేటాతో సమానమో తెలుసా?

Sperm: ఒక్క స్పెర్మ్‌ లో.. 0.8 జీబీ డేటా? మీరు స్కలించే వీర్యం ఎన్ని జీబీల డేటాతో సమానమో తెలుసా?
Advertisement

Sperm Genetic Data: సంతానోత్పత్తిలో వీర్యం కీలక పాత్ర పోషిస్తుంది. శృంగార సమయంలో పురుషుడి నుంచి విడుదలై.. స్త్రీలోనికి ప్రవేశిస్తుంది. వీర్య కణం అండాశయంతో కలిసి ఫలదీకరణ జరుగుతుంది. ఫలితంగా కొత్త జీవి ప్రాణం పోసుకుంటుంది. తొమ్మిది నెలల తర్వాత తల్లి గర్భం నుంచి శిశువు భూమ్మీదికి అడుగు పెడుతుంది. స్త్రీ నుంచి ప్రతి నెల ఒక అండం మాత్రమే విడుదలవుతుండగా, పురుషుడి నుంచి విడుదలయ్యే వీర్యంలో కోటాను కోట్ల వీర్య కణాలు ఉంటాయి. తాజాగా వీర్య కణాలను సంబంధించి పరిశోధకులు ఆసక్తికర విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు. ఒక్క వీర్య కణంలో ఎంతో జెనెటిక్ డేటా ఉంటుందని వివరించారు. ఒక్క స్పెర్మ్ లో 0.8 జీబీ జన్యు డేటా ఉంటుందని తేల్చారు.

6 మిల్లీ లీటర్ల వీర్యంలో 39 విలియన్లకు పైగా వీర్య కణాలు

సాధారణంగా ఒక్కసారి పురుషుడి స్కలించే వీర్యం సుమారు 2 నుంచి 6 మిల్లీ లీటర్లు ఉంటుంది. దానిలో సుమారు 39 మిలియన్లకు పైగా వీర్య కణాలు ఉంటాయి. ఈ లెక్కన చూసుకుంటే ఒక్కసారి విడుదలయ్యే వీర్యంలో ఉండే జన్యు డేటా ఎంతో డిజిటల్ సమాచారం కంటే ఎక్కువగా ఉంటుంది. వీర్య కణంలో ఉన్న జీవసంబంధమైన సమాచారం మిలియన్ల సినిమాలకు సమానం అంటున్నారు పరిశోధకులు. అంతేకాదు,  భూమ్మీద ఉన్న అతి పెద్ద లైబ్రరీల కంటే ఎక్కువ జ్ఞానాన్ని కలిగి ఉంటుందంటున్నారు. వీర్య కణం మానవ శరీరం ఎంత శక్తివంతమైనది, సంక్లిష్టమైనది అనే విషయాన్నిఈ డేటాను బట్టి అర్థం చేసుకోవచ్చంటున్నారు. ప్రకృతి కంటితో చూడలేనంత చిన్న వీర్య కణంలో ఎంత సమాచారాన్ని నిల్వ చేయగలదో నిరూపిస్తుంది.

ఒక్కోసారి స్కలించే వీర్యంలో ఎంత డేటా ఉంటుందంటే?          

Advertisement

ఒక్కసారి విడుదలయ్యే వీర్యంలో 39 మిలియన్లకు పైగా వీర్య కణాలు ఉంటాయి. ఒక్కో వీర్య కణంలో 0.8 జీబీ డేటా అంటే.. మొత్తం వీర్యంలో 32 మిలియన్ సినిమాలకు సమానమైన డేటా ఉంటుంది. 1.6 మిలియన్ ఫోటోలకు సమానమైన సమాచారాన్ని కలిగి ఉంటుంది. 40 బిలియన్ సాంగ్స్  డేటాతో సమానం. 6000 అతిపెద్ద లైబ్రరీలలోని సమాచారం ఒక్క చోట పోగేస్తే వీర్యంలోని జన్యు డేటాకు ఈక్వల్. 18 మిలియన్ ఫుల్ ఎన్ సైక్లోపీడియాలు, 90 ట్రిలియన్ల టైప్ చేసిన పేజీలు స్పెర్మ్ జెనెటిక్ డేటా సమానంగా ఉంటుంది.

Read Also: లిప్‌స్టిక్ కిల్లర్ కేస్.. డ్రైనేజీలో చిన్నారి శరీర భాగాలు, మరో ఇద్దరు హత్య.. ఆ కుర్రాడే చంపాడా?

వీర్యం గురించి..

Advertisement

పురుషుడి వృషణాల నుంచి తయారయ్యే జెల్ లాంటి పదార్థం వీర్యం. ఒక్కసారి ఎజాకులేషన్‌లో 6 మిల్లీ లీటర్ల వరకు వస్తుంది. ఇది తెలుపు, బూడిద రంగులో జిగటగా ఉంటూ కొద్దిసేపటికి ద్రవంగా మారుతుంది. ఒక్క స్పెర్మ్ స్త్రీలోని అండాన్ని చేరడానికి సుమారు 200 కిలోమీటర్లు ఈదుతుంది. ప్రతి స్పెర్మ్ సెల్‌ లో 23 క్రోమోజోమ్ లు ఉంటాయి. ఈ 23 క్రోమోజోమ్‌లలో 22 ఆటోజోమ్‌లు, ఒక సెక్స్ క్రోమోజోమ్ (X లేదంటే Y) ఉంటుంది. Y క్రోమోజోమ్ కారణంగా మగ పిల్లాడు, X క్రోమోజోమ్ కారణంగా ఆడపిల్ల పుడుతుంది.

Read Also: ఒడిలో నిద్రిస్తున్న చిన్నారి మాయం.. 6 నెలలు తర్వాత ఊహించనిది జరిగింది, కన్నీళ్లు పెట్టించే ఘటన!

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×