E-Paper
Advertisement

OTT Movie : లేడీ సూపర్ హీరోకు ఓటీటీ చిక్కులు… హిందువుల మనోభావాలపై దెబ్బకొట్టిన ‘లోకా చాప్టర్ 1’

OTT Movie : లేడీ సూపర్ హీరోకు ఓటీటీ చిక్కులు… హిందువుల మనోభావాలపై దెబ్బకొట్టిన ‘లోకా చాప్టర్ 1’
Advertisement

OTT Movie : థియేటర్లలోకి వచ్చిన కళ్యాణి ప్రియదర్శన్ సినిమా ‘లోకా చాప్టర్ 1-చంద్ర’ బాక్స్ ఆఫీస్ రికార్డులు తిరగరాసిన విషయం తెలిసిందే. డైరెక్టర్ డొమినిక్ అరుణ్, ప్రొడ్యూసర్ దుల్కర్ సల్మాన్ రూపొందించిన ఈ సినిమా, 2025 ఆగస్టు 28న విడుదలై దాదాపు 300 కోట్ల క్లబ్ లో చేరిన మొదటి మలయాళం సినిమాగా నిలిచింది. ఇప్పుడు ఓటీటీలో కూడా దూసుకెళ్తోంది. నెటిజన్లు ఈ సినిమా గురించి ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఫాంటసీ థ్రిల్లర్‌ను చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానులు, ఆన్‌లైన్‌లో విడుదలైన తర్వాత చాలా మంది సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. జేక్స్ బెజోయ్ సంగీతం, చమన్ చాకో ఎడిటింగ్‌ను ప్రశంసించారు. అలాగే కొన్ని వివాదాలు కూడా వస్తున్నాయి. ఈ వివాదాలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతున్నాయి.

1. బెంగళూరు వివాదం

ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ డైలాగ్‌లో బెంగళూరు మహిళల గురించి అవమానకరమైన కామెంట్ చేసినట్లు ఉంది. ఇది కర్ణాటక మహిళలను డీమీన్ తో పోల్చినట్లు ఉందని వాపోతున్నారు. అలాగే బెంగళూరును, పార్టీలు, డ్రగ్స్ హబ్ గా చూపించారని కూడా ఆరోపణలు వస్తున్నాయి. కన్నడ డైరెక్టర్ మన్‌సూర్ (బీమా ఫేమ్) మలయాళ సినిమాలు, బెంగళూరును డ్రగ్స్ & క్రైమ్ క్యాపిటల్‌గా చూపుతున్నాయని ట్విట్టర్ లో పోస్ట్ కూడా చేశాడు. ఇది సోషల్ మీడియాలోవైరల్ కావడంతో కర్ణాటక పోలీస్ లు లా వయొలేషన్ ఉంటే యాక్షన్ తీసుకుంటామని కూడా హెచ్చరించారు. దీంతో దుల్కర్ సల్మాన్ ప్రొడక్షన్ హౌస్ వే ఫేర్ ఫిల్మ్స్ అధికారిక స్టేట్‌మెంట్ కూడా ఇచ్చింది. ఈ సినిమాలో ఒక డైలాగ్ కర్ణాటక ప్రజల సెంటిమెంట్స్‌ను హర్ట్ చేసినట్లు తెలిసిందని, ఎవరినైనా హార్ట్ చేసుంటే మేము సారీ చెబుతున్నాం అంటూ చెప్పుకొచ్చారు. అంతే కాకుండా ఆ డైలాగ్‌ను ఎడిట్ చేసి తీసివేస్తాం అనడంతో ఆ వివాదం కొంత సర్దుమనిగింది.

Advertisement

Read Also :  అన్నతో పెళ్ళి తమ్ముడితో యవ్వారం… ఈ క్రేజీ కొరియన్ సిరీస్ కెవ్వు కేక

2. హిందూ వివాదం

ఈ సినిమాలో ఒక సీన్‌లో హిందూ రాజు ఒక టెంపుల్‌ను బర్న్ చేస్తున్నట్లు చూపించారని, క్రిస్టియన్ మిషనరీలు, కన్వర్ట్‌లను సేవియర్స్ గా పోర్ట్రే చేశారని ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇవి హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తున్నాయని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు ఈ సినిమాకి డైరెక్టర్ క్రిస్టియన్, ప్రొడ్యూసర్ ముస్లిం కాబట్టి ఇలా చేశారని టార్గెట్ చేస్తున్నారు. అయితే కర్ణాటక వివాదంపై మాత్రమే అపాలజీ ఇచ్చారు కానీ హిందూ సెంటిమెంట్స్ మీద ఇంకా రియాక్ట్ కాలేదు. అయితే కొందరు సోషల్ మీడియా వేదికగా అపాలజీ కోరుతున్నారు. ఏది ఏమైనా ఇలాంటి ఇష్యూస్ రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చాలా మంది నెటిజన్స్ అభిప్రాయ పడుతున్నారు.

Advertisement

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×