E-Paper
Advertisement

OTT Movie : మానసిక రోగం ఉన్న అమ్మాయిపై మనసు… పెళ్లి చేసుకుందాం అనుకుంటే మెంటలెక్కించే ట్విస్ట్

OTT Movie : మానసిక రోగం ఉన్న అమ్మాయిపై మనసు… పెళ్లి చేసుకుందాం అనుకుంటే మెంటలెక్కించే ట్విస్ట్
Advertisement

OTT Movie : కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా తరేజ నటించిన ‘కె ర్యాంప్’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ లో అడుగు పెట్టేసింది. దీపావళి సందర్బంగా 2025న అక్టోబర్ 18న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా, పాజిటివ్ టాక్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంది. నెల రోజుల్లోనే ఓటీటీలోకి అడుగు పెట్టి డిజిటల్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. రొమాంటిక్, కామెడీ థీమ్స్ తో ఈ సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా సరదాగా సాగిపోతుంది. ఈ సినిమా ఏ ఓటీటీలోకి వచ్చింది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే..

ఆహా వీడియోలో స్ట్రీమింగ్

‘కె ర్యాంప్’ (K-Ramp) అనే ఈ సినిమాకి జైన్స్ నాని తొలి సారిగా దర్శకత్వం వహించారు. ఇందులో కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా, నరేష్ వీకే, సాయి కుమార్, వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రల్లో నటించారు. రాజేష్ దండా, శివ బొమ్మక్ దీనిని నిర్మించారు. ఆహా వీడియోలో నవంబర్ 15 నుంచి ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. 2 గంటల 20 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ఐయండిబిలో 8.1/10 రేటింగ్ పొందింది.

స్టోరీ ఏంటంటే

Advertisement

కృష్ణ (సాయి కుమార్) అనే ధనవంతుడైన వ్యాపారవేత్త కొడుకు కుమార్ (కిరణ్ అబ్బవరం). చిన్నతనంలో తల్లిని కోల్పోవడంతో, తండ్రి గారాబంతో పెరిగి, చదువు సంధ్యలను పక్కన పెట్టి, స్నేహితులతో కలిసి అల్లరిచిల్లరిగా తిరుగుతుంటాడు. అతనిని దారిలో పెట్టాలని భావించిన తండ్రి, ఒక పండితుడి సలహా మేరకు కేరళలోని ఒక కాలేజ్ లో చేర్పిస్తాడు. అక్కడకు వెళ్లిన కుమార్, తన మామతో కలిసి ఎప్పటిలాగే సరదాగా గడుపుతుంటాడు. ఇలా సాగుతున్న ఇతని ప్రయాణం అనుకోకుండా మలుపు తిరుగుతుంది. కుమార్ ని ఒక ప్రమాదం నుంచి కాపాడిన మెర్సీ జాయ్ (యుక్తి తరేజా) అనే యువతిని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు.

Read Also : కమిషనర్ కూతురు హత్య… 5 రోజుల తరువాత బ్రతికొచ్చే అమ్మాయి… ఇంటెన్స్ తమిళ మిస్టరీ థ్రిల్లర్

ఇద్దరికీ మంచి స్నేహం ఏర్పడుతుంది. ఇక మెర్సీతో స్నేహం ప్రేమగా మారుతున్న సమయంలో, ఆమె స్ట్రెస్ డిజార్డర్ (PTSD) అనే మానసిక సమస్యతో బాధపడుతోందని కుమార్‌కు తెలుస్తుంది. ఈ సమస్య కారణంగా మెర్సీకి ప్రజలను నమ్మడం కష్టంగా ఉంటుంది. అంతే కాకుండా ఆమెలో ఆత్మహత్య ఆలోచనలు ఎప్పుడూ కలుగుతుంటాయి. కుమార్ ఈ పరిస్థితుల ప్రభావంతో మెర్సీ కష్టాలలో పాలు పంచుకుంటాడు. ఈ ప్రయాణంలో కుమార్ అల్లరి, చిల్లర పనులు మాని బాధ్యత గల వ్యక్తిగా మారుతాడు. క్లైమాక్స్ ఊహించని ఒక ట్విస్ట్ తో ముగుస్తుంది. ఆ ట్విస్ట్ ఏమిటి ?  చివరికి మెర్సీకి ఉన్న ఆ వ్యాధి నయం అవుతుందా ? వీళ్ళ ప్రేమకథ పెళ్లి వరకు పోతుందా ? అనే విషయాలను, ఈ కామెడీ రోమంటిక్ ఎంటర్టైనర్ సినిమాని చూసి తెలుసుకోండి.
Advertisement

 

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×