E-Paper
Advertisement

Gym at Home: ఇంట్లోనే మినీ వ్యాయామశాల.. బాడీ ఫిట్‌నెస్‌పై దిగులేలా!

Gym at Home: ఇంట్లోనే మినీ వ్యాయామశాల.. బాడీ ఫిట్‌నెస్‌పై దిగులేలా!
Advertisement

Gym at Home: ఈ ఉరుకుల పరుగుల జీవితంలో జిమ్‌కు వెళ్లి వ్యాయామం చేయడానికి అందరికీ సమయం ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఫిట్‌నెస్ సాధించాలంటే జిక్‌కే  వెళ్లాల్సిన అవసరం లేదు..  ఇంట్లోనూ మినీ జిమ్ ఏర్పాటు చేసుకోవచ్చు అని సూచిస్తున్నారు ఫిట్‌నెస్ నిపుణులు. సమయం ఉన్నప్పుడు ఇంట్లోనే వర్కౌట్స్ చేసుకుంటే.. మంచి శరీరాకృతిని సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు.  అదెలాంటే.. సాధారణ వ్యాయామశాలల్లో మాదిరిగా అన్ని పరికరాలు కాకపోయినా.. కేలరీలు తగ్గడానికి ఉపయోగపడే కొన్ని పరికరాలు ఇంట్లో చాలంటున్నారు. దీంతో జిమ్‌ తరహా అనుభూతిని పొందడంతో పాటు ఖర్చునూ అదుపు చేసుకోవచ్చంటున్నారు. మరి అదెలాగో చూద్దామా..

ప్రదేశాన్ని బట్టి జిమ్ ఏర్పాటు:

ఇంట్లో మీకున్న ప్రదేశంలోనే జిమ్‌ను ఏర్పాటుచేసుకోవాలంటే.. ముందుగా ఇంట్లో ఎంత ఖాళీ ప్రదేశం ఉందనే విషయాన్ని గుర్తించుకోవాలి. దీనికోసం ప్రత్యేకంగా ఓ గదిని కేటాయించగలరా, లేదా? అనేది అంచనా వేసుకోవాలి. ఇంట్లో స్థలం లేకపోతే బాల్కనీలో కూడా ఏర్పాటుచేసుకోవచ్చు. అప్పుడా ప్రదేశాన్ని బట్టి జిమ్‌ను ఏర్పాటుచేసుకోవడం సులభం అవుతుంది.

Advertisement

Read Also: తగ్గని వ్యాధులను తగ్గించే తానికాయ.. ఈ అద్భుత ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

మీ ఫిట్‌నెస్ లక్ష్యమేంటి?

సాధారణ వ్యాయామశాలల మాదిరిగా ఇంట్లోనూ అన్ని రకాల ఫిట్‌నెస్‌ పరికరాలు ఉండాల్సిన పనిలేదు. దానివల్ల ఇంట్లో స్థలం, డబ్బు.. రెండూ వృథానే. కాబట్టి.. మీరు చేరుకోవాల్సిన ఫిట్‌నెస్‌ లక్ష్యమేంటో ముందుగానే నిర్ణయించుకోండి. దానికి వర్కౌట్స్ పరికరాలను మాత్రం కొంటే సరిపోతుంది. దీంతో పాటు ఒక యోగా మ్యాట్‌ తప్పనిసరి. ఎందుకంటే.. పులప్స్‌, పుషప్స్‌.. వంటి నేలపై చేసే వ్యాయామాలకు అనువుగా ఉంటుంది.

ఎన్నో ప్రత్యమ్నాయాలు:

Advertisement

ఇంట్లో ఏర్పాటు చేసుకునే జిమ్ కోసం ఎక్కువ పరికరాలు ఎందుకు అనుకునే వారు.. ఇంట్లో ఉండే కొన్ని రకాల వస్తువుల్నీ వ్యాయామాల కోసం ఉపయోగించుకోవచ్చు. దీనికోసం వెయిట్‌ లిఫ్టింగ్‌ కోసం బరువైన వస్తువులు, పుషప్స్‌ కోసం బాస్కెట్‌ బాల్‌, జంపింగ్‌ కోసం స్కిప్పింగ్‌ రోప్‌, కార్డియో వ్యాయామాల కోసం మెట్లను కూడా ప్రత్యామ్నాయాలుగా వాడుకోవచ్చు.

మల్టీపర్సస్ మెషీన్స్ ఉత్తమం:

బాడీ ఫిట్‌నెస్‌ పరికరాలను ఎంచుకునే వారు.. ఒకే మెషీన్‌తో విభిన్న రకాల వ్యాయాలు చేయగలిగేలా మల్టీపర్పస్‌ మెషీన్స్‌ని ఎంచుకుంటే డబ్బుతో పాటు ఇంట్లో స్థలాన్ని కూడా ఆదా చేసుకోవచ్చు. దీని కోసం స్టెబిలిటీ బాల్‌తో కోర్‌ వ్యాయామాలు, యోగా.. వంటివి సాధన చేసుకోవచ్చు.

వెలుతురు ధారాళంగా ఉండేలా:

ఇంట్లోనే వ్యాయామశాలను ఏర్పాటు చేసుకోవాలనుకునే వారు.. ఆ ప్రాంతంలో గాలి, వెలుతురు, ధారాళంగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే.. వ్యాయామం చేసే క్రమంలో శరీరానికి చెమటలు పడుతుంది. ఇలాంటప్పుడు గాలి తగలకపోతే చిరాగ్గా ఉంటుంది. దీంతోపాటు సహజసిద్ధంగా బయటి నుంచి వచ్చే వెలుతురు మనసును ఉత్తేజితం చేస్తుంది.

Read Also: సీజనల్ వ్యాధులకు చెక్.. శీతాకాలంలో ఈ కూరగాయలు తింటే నిండు ఆరోగ్యం!

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×