// // Romantic Comedy Drama OTT : బెస్ట్ మలయాళం లవ్ స్టోరీ -->
E-Paper
Advertisement

జంప్ అయ్యి ప్రేమ పెళ్లి… మిస్ అవ్వకుండా చూడాల్సిన బెస్ట్ మలయాళం లవ్ స్టోరీ

జంప్ అయ్యి ప్రేమ పెళ్లి… మిస్ అవ్వకుండా చూడాల్సిన బెస్ట్ మలయాళం లవ్ స్టోరీ
Advertisement

Romantic Comedy Drama OTT : టీనేజ్ వయసులోనే ప్రేమలో పడితే ? ఆ ప్రేమను పెద్ద వాళ్ళు ఒప్పుకోకపోతే ? జంప్ అయ్యి పెళ్లి చేసుకుంటే ? తరువాత ఏం జరుగుతుంది అనే విషయాన్ని కళ్ళకు కట్టినట్టు ఓ రొమాంటిక్ మలయాళం సినిమాలో చూపించారు. మరి ఆ సినిమా పేరేంటి ? దాని కథ ఏంటి ? అన్నది తెలుసుకుందాం పదండి.

సోనీ లివ్ లో స్ట్రీమింగ్

అరుణ్ డి. జోస్ దర్శకత్వంలో వచ్చిన ఒక క్లీన్ యూత్‌ఫుల్ మలయాళ రోమాంటిక్ కామెడీ డ్రామా Journey of Love 18+. 2023లో విడుదలైన ఈ మూవీ పక్కా యూత్ ఫుల్ డ్రామా. టైటిల్‌లో ’18+’ ఉన్నప్పటికీ ఇందులో ఎలాంటి అసభ్యత లేదు. కేవలం పెళ్లి వయసు చుట్టూ తిరిగే ఒక చక్కని సోషల్ సెటైరికల్ డ్రామా. ఈ ఫీల్-గుడ్ ఎంటర్టైనర్ Sony LIV ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో తెలుగు డబ్బింగ్ వెర్షన్‌తో పాటు ఒరిజినల్ మలయాళంలోనూ స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంది. నస్లెన్, మాథ్యూ థామస్, మీనాక్షి ఇందులో కీలక పాత్రలు పోషించారు. క్రిస్టో జేవియర్ అద్భుతమైన మ్యూజిక్ సినిమాకు ప్రధాన ఆకర్షణ.

కథలోకి వెళ్తే…

Advertisement

కథ ఉత్తర కేరళలోని ఒక చిన్న గ్రామం నేపథ్యంలో నడుస్తుంది. 2009లో సాగే స్టోరీ ఇది. పాలిటెక్నిక్ డ్రాపౌట్ అఖిల్ (నస్లెన్ కె. గఫూర్). స్థానిక కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్త కూడా. అదే ఊరిలోని మోస్ట్ పవర్‌ఫుల్ పార్టీ లోకల్ సెక్రటరీ రవీంద్రన్ కూతురైన అతిర (మీనాక్షి దినేష్)తో లవ్ లో పడతాడు. వాళ్ళ ప్రేమను అతిర ఇంట్లో పెద్దలు అస్సలు ఒప్పుకోరు. దాంతో అతిర ఒకరోజు అఖిల్‌కు ఫోన్ చేసి విషయం చెబుతుంది. తాను ఇల్లు వదిలి వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నానని, వచ్చి తీసుకెళ్లమని అడుగుతుంది. పారిపోయి పెళ్లి చేసుకుందామని చెప్పడంతో అఖిల్ కూడా రెడీ అవుతాడు.

Also Read : బయట అడుగు పెడితే చావు మూడినట్టే… గుండెల్లో దడ పుట్టించే జాంబీలు… ఓటీటీలోకి సరికొత్త హారర్ థ్రిల్లర్

Advertisement

అఖిల్ తన క్లోజ్ ఫ్రెండ్స్ రంజు (మాథ్యూ థామస్), పట్టార్‌ల సాయం కోరతాడు. గతంలో పారిపోయి పెళ్లి చేసుకున్న అనుభవం ఉన్న రాజేష్ (బిను పప్పు) అనే టిప్పర్ డ్రైవర్ ను వీళ్ళు హెల్ప్ అడుగుతారు. రాజేష్ మొదట భయపడినా, ఆ తర్వాత తలిపరంబలోని ఒక గుడిలో పెళ్లి చేయడానికి ప్లాన్ చేస్తాడు. అయితే ఆ ఊరు మొత్తం అతిర తండ్రి పార్టీ ఆధిపత్యంలో ఉండడం అన్నది అక్కడ ట్విస్ట్. పైగా అదే సమయంలో ఒక పొలిటికల్ గొడవ జరిగి ఊరిలో 24 గంటల హర్తాల్ (బంద్) ప్రకటించడంతో వీరి ప్లాన్ కాంప్లికేటెడ్ – ఫన్నీగా అవుతుంది. మరి చివరికి ఈ జంట పెళ్లి చేసుకున్నారా లేదా ? పార్టీ పెద్దలు వీళ్ళ ప్రేమ గురించి తీసుకున్న నిర్ణయాలు ఏంటి ? అన్నది తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×