E-Paper
Advertisement

OTT Movie : ఫోన్ కాల్ తో కిర్రాక్ స్కామ్… ఈ వెబ్ సిరీస్ ను ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు భయ్యా

OTT Movie : ఫోన్ కాల్ తో కిర్రాక్ స్కామ్… ఈ వెబ్ సిరీస్ ను ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు భయ్యా
Advertisement

OTT Movie : రియల్ లైఫ్ సైబర్ క్రైమ్ నేరాల ఆధారంగా తీసిన ఒక వెబ్ సిరీస్ ను ఆడియన్స్ ఆసక్తికరంగా చూస్తున్నారు. ఝార్ఖండ్‌లోని జమ్తారా అనే ఒక చిన్న పట్టణంలో జరిగే ఈ స్కామ్ లో, యువకులు ఫోన్ కాల్స్, SMS, ఫేక్ వెబ్‌సైట్స్ ద్వారా దేశవ్యాప్తంగా కోట్లు మోసం చేస్తారు. ఈ ప్రదేశం భారతదేశ స్కామ్ క్యాపిటల్‌ గా పేరు పొందింది. ఈ సిరీస్ లో మోసాలు జరిగే తీరును, కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు. ఇది థ్రిల్లర్, లవ్, యాక్షన్ ఎలిమెంట్స్ తో హీట్ పుట్టిస్తోంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

“జమ్తారా – సబ్‌కా నంబర్ ఆయేగా” (Jamtara – Sabka Number Ayega) అనే ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ సౌమేంద్ర పాధి దర్శకత్వంలో రూపొందింది. ఇందులో అంశుమాన్ పుష్కర్, రోహిత్ ఖురానా, హర్షద్ మెహతా, దిబ్యేందు భట్టాచార్య, జియాన్ గుప్తా ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది సీజన్ 1 (10 ఎపిసోడ్‌లు) 2020 జనవరి 10న, సీజన్ 2 (8 ఎపిసోడ్‌లు) 2022 సెప్టెంబర్ 23న విడుదలై, నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈ హిందీ సిరీస్ తెలుగు, తమిళం భాషల్లో కూడా అందుబాటులో ఉంది. ఇది ఐయండిబిలో 7.3/10 రేటింగ్ సాధించింది.

కథలోకి వెళ్తే

Advertisement

ఈ సిరీస్ జార్ఖండ్‌లోని జామ్తారా జిల్లాలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించబడింది. ఇది చిన్న పట్టణాల్లోని యువకులు ఆధునిక సాంకేతికతను ఉపయోగించి చేసే ఆన్‌లైన్ కుంభకోణాల గురించి వివరిస్తుంది. ఇందులో సన్నీ, రాకీ అతని స్నేహితులు, ప్రజలకు ఫోన్ కాల్స్ చేసి వారి బ్యాంక్ వివరాలు, OTPలు సేకరించి మోసాలకు పాల్పడుతుంటారు. ఈ కార్యకలాపాల ద్వారా వచ్చిన డబ్బుతో వాళ్ళు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటారు. ఈ దందాకు రాజకీయ నాయకుల అండదండలు కూడా ఉంటాయి.

Read Also : 100 గంటలు… టీనేజర్ ను కిడ్నాప్ చేసి లైవ్ లోనే ఆ పాడు పని… మెంటలెక్కించే రియల్ క్రైమ్ స్టోరీ

Advertisement

అయితే ఈ స్కామ్‌లు బయటి ప్రపంచానికి తెలియడంతో, పోలీసుల జోక్యం మొదలవుతుంది. రాజకీయ నాయకుల మధ్య ఆధిపత్య పోరు, యువకుల మధ్య విభేదాలు, పోలీసుల విచారణతో కథ ఉత్కంఠభరితంగా సాగుతుంది. సన్నీ ఈ స్కామ్ లో ప్రధానంగా ఉంటాడు. అతను ఒక లవ్ స్టోరీని కూడా నడుపుతాడు. అయితే క్లైమాక్స్ ఊహించని మలుపులు తిరుగుతుంది. చివరికి వీళ్ళంతా పోలీసులకు దొరుకుతారా ? వీళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి ? రాజకీయంగా, పోలీసుల పరంగా వీళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు ? అనే విషయాలను, ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ను చూసి తెలుసుకోండి. ఈ సిరీస్ డిజిటల్ యుగంలో జరిగే కొత్త రకం నేరాలను, వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతుంది.

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×