E-Paper
Advertisement

Onion Juice: నిజమా? ఉల్లితో ఏపుగా జుట్టు.. శాస్త్రవేత్తలు చెప్పింది వింటే ఏమైపోతారో!

Onion Juice: నిజమా? ఉల్లితో ఏపుగా జుట్టు.. శాస్త్రవేత్తలు చెప్పింది వింటే ఏమైపోతారో!
Advertisement

ఈ రోజుల్లో జుట్టు రాలడం అనేది చాలా మందిని వేధిస్తున్న సమస్య. జుట్టు పల్చబడటం, బట్టతల మీద మచ్చలు, చుండ్రు లాంటి సమస్యలు కామన్ గా కనిపిస్తున్నాయి. అయితే, జుట్టు ఆరోగ్యంగా ఉంచేందుకు ఉల్లిపాయ రసం అనేది కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తారు. అంతేకాదు, జుట్టుకు సహజమైన బలం, రంగును అందిస్తుందంటారు. తాజాగా జర్నల్ ఆఫ్ డెర్మటాలజీలో జరిపిన ఒక అధ్యయనంలో ఉల్లిపాయరసం, జుట్టుకు మధ్య ఉన్న ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. 8 వారాల పాటు రోజుకు రెండుసార్లు ఉల్లిపాయ రసాన్ని ఉపయోగించిన వారిలో నిజమైన జుట్టు తిరిగి పెరిగినట్లు తెలిపింది. ఇంతకాలం ఉల్లిపాయ రసం జుట్టుకు మేలు చేస్తుందనే విషయాన్ని బలంగా కన్ఫార్మ్ చేసింది.

ఉల్లిపాయ రసం వెనుక అసలు విషయం!  

ఉల్లిపాయలు కేవలం వంటగదిలో ఉపయోగించే వెజిటెబుల్ మాత్రమే కాదు. ఇందులో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టుకు సూపర్ హీరోలా పని చేస్తుంది. జుట్టును బలంగా, ఆరోగ్యంగా ఉంచే ప్రోటీన్ అయిన కెరాటిన్‌ను తయారు చేయడానికి సల్ఫర్ సహాయపడుతుంది. కొల్లాజెన్ పెరగడానికి కారణం అవుతుంది. ఇది నెత్తికి నల్లటి రంగును అందిస్తుంది. జుట్టు బాగా పెరగడానికి సహాయపడుతుంది. సల్ఫర్  జుట్టు కుదుళ్లకు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. పోషకాలు అందేలా చేస్తుంది. ఈ కారణంగా జుట్టు బలంగా, నల్లగా పెరుగుతుంది.

ఉల్లిపాయ రసంతో జుట్టుకు మేలు!

Advertisement

2002లో జర్నల్ ఆఫ్ డెర్మటాలజీలో జరిపిన అధ్యయనంలో అలోపేసియా అరేటా ఉన్నవారిపై ఉల్లిపాయ రసాన్ని పరీక్షించారు. ఉల్లిపాయ రసాన్ని రోజుకు రెండుసార్లు పూసిన 23 మందిలో, 20 మంది అంటే 87%  మంది  8 వారాల తర్వాత కొత్త జుట్టు వచ్చింది. ఉల్లిపాయ రసం జుట్టు పెరగడంలో మాత్రమే కాదు, స్కిన్ ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది.   ఉల్లిపాయలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచుతాయి. చుండ్రును తగ్గిస్తాయి. జుట్టు ఫోలికల్స్‌ ను యాక్టివేట్ చేసి కొత్త జుట్టు మొలవడానికి సాయపడుతుంది.

పురుషుల బట్ట మాయం అవుతుందా?

ఈ అధ్యయనం పురుషుల ప్యాటర్న్ బట్టతల మీద కాకుండా అలోపేసియా అరేటాపై దృష్టి పెట్టింది. పురుషుల ప్యాటర్న్ బట్టతల DHT అనే హార్మోన్ వల్ల వస్తుంది. ఉల్లిపాయ రసం దీనిని పరిష్కరిస్తుందని ఎలాంటి ఆధారం లేదు. ఉల్లిపాయ రసం కొన్ని రకాల జుట్టు రాలడానికి సహాయపడవచ్చు.  కానీ, జన్యు పరంగా వచ్చే బట్టతలకి పరిష్కారం చూపించదు. పురుషులు ప్యాటర్న్ బట్టతలతో బాధపడితే, మినాక్సిడిల్, వైద్యుడి సలహాలతో పాటు ఇతర చికిత్సలు అవసరం కావచ్చు.

ఉల్లిపాయ రసాన్ని ఎలా ఉపయోగించాలి?

Advertisement

ఇంట్లో ఉల్లిపాయ రసాన్ని తయారు చేయడం చాలా సులభం. 2, 3  ఉల్లిపాయలను తొక్క తీసి ముక్కలుగా కోయండి. వాటిని  మెత్తని పేస్ట్ అయ్యే వరకు రుబ్బాలి. రసాన్ని తీయాలి. ఆ జ్యూస్ ను మీ వేళ్లు లేదంటే కాటన్ బాల్‌ తో  నెత్తి మీద మసాజ్ చేయాలి. అరగంట పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత షాంపూతో కడగాలి. 8 వారాల పాటు రోజుకు రెండుసార్లు ఇలా చేస్తే, బట్టతలపై కొత్త జుట్టు వచ్చే అవకాశం ఉంటుంది.

Read Also: ఖర్జూరాన్ని ఇలా తీసుకున్నారంటే.. వందల రోగాలు మటుమాయం!

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×