E-Paper
Advertisement

Netflix: ఇంటర్నెట్ లేకపోయినా.. నెట్ ఫ్లిక్స్ సినిమాలు, సీరిస్‌లు చూసేయొచ్చు, జస్ట్ ఇలా చేస్తే చాలు!

Netflix: ఇంటర్నెట్ లేకపోయినా.. నెట్ ఫ్లిక్స్ సినిమాలు, సీరిస్‌లు చూసేయొచ్చు, జస్ట్ ఇలా చేస్తే చాలు!
Advertisement

Netflix Downloads: ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సరికొత్త కంటెంట్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. లేటెస్ట్ సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఎంటర్ టైన్ చేస్తుంది. వినియోగదారులు నెట్ ఫ్లిక్స్ లోని కంటెంట్ చూడాలంటే కచ్చితంగా నెట్ ఉండాల్సిందే. అయితే, నెట్‌ ఫ్లిక్స్ 2016 నవంబర్‌ లో డౌన్‌ లోడ్‌ అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అప్పటి నుంచి ఈ సర్వీసును మరింత అప్ డేట్ చేస్తూ వస్తోంది. డౌన్ లోడ్ చేసుకున్న సినిమా లేదంటే వెబ్ సిరీస్ చూడటం పూర్తి చేసిన తర్వాత.. ఆటోమేటిక్ డౌన్‌ లోడ్స్ నుంచి డిలీట్ అయ్యేలా నెట్‌ ఫ్లిక్స్ సెట్టింగ్స్ తీసుకొచ్చింది. అదే సమయంలో ఎప్పుడూ ఆఫ్‌ లైన్‌ లో చూడటానికి ఇప్పుడు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఇంటర్నెట్ లేకుండానే నెట్ ఫ్లిక్స్లో సినిమాలు, సిరీస్ లు చూడొచ్చు. కానీ, కొన్ని కండీషన్స్ తో.. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

నెట్ ఫ్లిక్స్ డౌన్ లోడ్ ఆప్షన్ ఎలా పని చేస్తుందంటే?  

నెట్ ఫ్లిక్స్ లో డౌన్ లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఇంటర్నెట్ ఉన్నప్పుడు మీకు నచ్చిన సినిమాలు, సీరియల్ ఎపిసోడ్‌ లు డౌన్‌ లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఆఫ్‌ లైన్‌ లో అంటే ఇంటర్నెట్ లేకుండా చూసుకోవచ్చు.

ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

Advertisement

⦿ ముండుగా నెట్ ఫ్లిక్స్ యాప్ ఓపెన్ చేయండి.

⦿ మీరు చూడాలనుకున్న సినిమా, సిరీస్ సెర్చ్ చేయండి.

Advertisement

⦿ సినిమా అయితే పక్కనే Download ↓ బటన్ ఉంటుంది → క్లిక్ చేయండి.

⦿ సిరీస్ అయితే ప్రతి ఎపిసోడ్ పక్కన డౌన్‌ లోడ్ బటన్ ఉంటుంది.  కొన్నిసార్లు పూర్తి సీజన్ డౌన్‌లోడ్ ఆప్షన్ కూడా వస్తుంది.

డౌన్‌లోడ్ అయినవి ఎక్కడ చూడాలి?

నెట్ ఫ్లిక్స్ యాప్ దిగువన డౌన్ లోడ్ ట్యాబ్ ఉంటుంది.  అక్కడ మీ డౌన్‌ లోడ్ అయిన సినిమాలు, సిరీస్ లు అన్నీ కనిపిస్తాయి.

Read Also: ఈ విమానాలు ఎక్కితే.. కిటికీ నుంచి స్వర్గం కనిపిస్తుంది, ఆ ఫీలే వేరు మామ!

కొన్ని కండీషన్స్ ఉన్నాయండోయ్!

⦿ కొన్ని సినిమాలు/సిరీస్‌లకు సంబంధించి డౌన్‌లోడ్ ఆప్షన్ ఉండదు.

⦿ డౌన్‌ లోడ్ చేసిన కంటెంట్ 30 రోజుల వరకు మాత్రమే ఉంటుంది.

⦿ ఒకసారి ప్లే చేస్తే 48 గంటల్లో (కొన్నింటికి 7 రోజులు) చూసేయాలి.  లేదంటే మళ్లీ ఇంటర్నెట్ కనెక్ట్ చేసి రీ ఆక్టివేట్ చేయాలి.

⦿ స్టోరేజ్ ఎక్కువ కావాలి. ఒక HD సినిమా 2–5 GB వరకు తీసుకుంటుంది.

⦿ ప్రయాణం చేసేటప్పుడు, నెట్ లేని ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు ముందుగానే వైఫైలో డౌన్‌ లోడ్ చేసుకుంటే మంచిది.

Read Also: ముద్దు పెట్టుకుంటున్నారా? ఆగండి.. ఆగండి.. ముందు ఇది చదవండి, లేకపోతే..

అక్కడ నో డౌన్ లోడ్ ఆప్షన్!

నెట్ ఫ్లిక్స్ కోసం ఇంకా Mac యాప్ లేదు.  Mac ల్యాప్‌టాప్‌ లో డౌన్‌ లోడ్ ఆప్షన్ లేదు. త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

Read Also: ఇల్లు అద్దెకు దొరకడం లేదని.. రోజుకో అబ్బాయి ఇంట్లో గడుపుతున్న అమ్మాయి, అదెలా?

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×