E-Paper
Advertisement

Ram Pothineni: పడ్డాం అని తెలుసు, వస్తున్నాం వడ్డీతోపాటు తిరిగిస్తాం

Ram Pothineni: పడ్డాం అని తెలుసు, వస్తున్నాం వడ్డీతోపాటు తిరిగిస్తాం
Advertisement

Ram Pothineni: మహేష్ బాబు దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా అంచనాల కంటే కూడా రామ్ పోతినేని అభిమానుల ఆశలన్నీ కూడా దీని మీదే ఉన్నాయి. ఎందుకంటే ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత ఇప్పటివరకు ఊహించిన స్థాయి సక్సెస్ రాలేదు. అయితే ఈ సినిమాకి సంబంధించి కంటెంట్ అంతా కూడా విపరీతంగా ఆకట్టుకుంది.

ఈ సినిమా 27న విడుదలవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ వైజాగ్ లో ఒక మ్యూజికల్ కన్సర్ట్ నిర్వహించింది. ఈ ఈవెంట్ లో రామ్ పోతినేని ఆసక్తికరమైన స్పీచ్ ఇచ్చాడు.

రామ్ పోతినేని స్పీచ్ 

Advertisement

నా కెరియర్ లో ఇది ఒక ప్రౌడెస్ట్ ఫిలిం. సినిమాకి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ కోసం రెండు సంవత్సరాలు వెతికాను. కొంతమంది మెలోడీస్ ఇస్తున్నారు లేకపోతే ఇంకొంతమంది మాస్ సాంగ్స్ ఇస్తున్నారు. రెండు కూడా ఇవ్వగలిగే స్టామినా ఉన్నోళ్లు వివేక్ అండ్ మార్విన్ ఈ సినిమాకి సంబంధించి ఆల్రెడీ మంచి మ్యూజిక్ ఇచ్చారు.

భాగ్యశ్రీ మొదట ఈ సినిమా కోసం అనుకున్నప్పుడు ఇంత బ్యూటిఫుల్ గా ఉంది పర్ఫామెన్స్ చేయగలుగుతుందో అనుకున్నాం కానీ ఒక వీడియో చూసిన తర్వాత కంప్లీట్ క్లారిటీ వచ్చేసింది. ఇదివరకే చెప్పినట్లు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి చాలా ఏళ్ళు తర్వాత ఒక మంచి హీరోయిన్ దొరికింది.

Advertisement

ఏదో కొత్తగా చేయాలి అనుకునే టైంలో మహేష్ నాకు పరిచయం అయ్యాడు. కొన్ని సందర్భాల్లో రాజ్ కుమార్ హిరానీ లా అనిపిస్తాడు. మరికొన్ని సందర్భాల్లో ఇంతియాజ్ అలీ లా అనిపిస్తాడు. అంటూ భారీ ఎలివేషన్ ఇచ్చాడు రామ్.

పడ్డామని తెలుసు వడ్డీతో తిరిగి ఇస్తాం 

జీవితంలో పైకి రావాలంటే రెండుండాలి.ఒకటి ప్యాషన్.. రెండోది పర్పస్. నా దగ్గర ఆ రెండూ టన్నుల టన్నుల కొద్దీ ఉన్నాయ్. వస్తున్నాం… లేస్తున్నాం.. మళ్లీ కొడుతున్నాం.. అంతే. అంటూ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపారు.

మొత్తానికి ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధిస్తుంది అనే నమ్మకాన్ని తన స్పీచ్ తో ఇచ్చాడు రామ్ పోతినేని. ఈ సినిమా నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

Also Read: Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన ప్రొడ్యూసర్ , ఇంకా ఏ రికార్డ్స్ ఉండవు

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×