E-Paper
Advertisement

Horror Thriller OTT : డబ్బుకోసం కన్నింగ్ ప్లాన్… అద్దెకు వచ్చి బురిడి కొట్టించే పాపలు… షాక్ ఇచ్చే సైకో డాక్టర్

Horror Thriller OTT : డబ్బుకోసం కన్నింగ్ ప్లాన్… అద్దెకు వచ్చి బురిడి కొట్టించే పాపలు… షాక్ ఇచ్చే సైకో డాక్టర్
Advertisement

Horror Thriller OTT : థ్రిల్లర్ సినిమాలకు ఉన్న క్రేజ్ మిగతా సినిమాలతో పోలిస్తే ఎక్కువే. ఎంత థ్రిల్లింగ్ గా ఉంటే, ఈ సినిమాలు అంత బాగా హిట్ అవుతుంటాయి. ఓటీటీలో ఈ జానర్ కంటెంట్ తో వస్తున్న సినిమాలే ఇప్పుడు ట్రెండింగ్ లో కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో కూడా థ్రిల్ ఓ రేంజ్ లో ఉంటుంది. ఈ సినిమాలో ఇద్దరు అమ్మాయిలు చిన్న చిన్న మోసాలు చేస్తూ, జల్సాలు చేస్తుంటారు. అయితే ఒక సైకో డాక్టర్ చేతిలో పడ్డాక వీళ్ళ జీవితం తలకిందులు అవుతుంది. ఈ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరిలో నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే

ఈ అమెరికన్ హారర్ థ్రిల్లర్ సినిమా పేరు ‘ట్విస్టెడ్’ (Twisted). ఈ సినిమాను డైరెక్ట్ చేసిన డారెన్ లిన్ బౌస్మాన్, హారర్ సినిమాల్లో ఫేమస్ అయిన Saw II, III, IV చిత్రాలకు కూడా దర్శకుడు. అందుకే ఈ సినిమాలో రక్తం చిందించే ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ సినిమాలో నటించిన లారెన్ లావెరాకు హారర్ ఫ్యాన్స్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె ఇంతకుముందు Terrifier 2 లో నటించి పాపులర్ అయ్యింది. ఇక విలన్‌గా నటించిన జిమోన్ హౌన్సో హాలీవుడ్ లో పరిచయం ఉన్న మోహమే. ఈ సినిమా 2026 ఫిబ్రవరి 6న నుంచి ప్రైమ్ వీడియో, Zee5 ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులోకి వచ్చింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

న్యూయార్క్‌లో పలోమా, స్మిత్ అనే ఇద్దరు కిలాడీ లేడీలు ఉంటారు. వీళ్ల పని ఏంటంటే… తమవి కాని ఖరీదైన విలాసవంతమైన అపార్ట్‌మెంట్లను చూపిస్తూ, అమాయకపు జనాలకు అద్దెకు ఇస్తామని చెప్పి అడ్వాన్స్‌లు నొక్కేసి జెండా ఎత్తేస్తుంటారు. ఇలా ఈజీగా డబ్బులు సంపాదించేసి లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటారు. అలాగే ఆ డబ్బుతో జల్సాలు చేస్తుంటారు కూడా. కానీ ఒకరోజు వీళ్లు వేసిన ప్లాన్ రివర్స్ అవుతుంది. వీళ్ళు డాక్టర్ రాబర్ట్ కెజియన్ అనే ఒక సర్జన్ అపార్ట్‌మెంట్‌లోకి పొరపాటున అడుగుపెడతారు. ఆ డాక్టర్ చూడటానికి చాలా పద్ధతిగా ఉన్నా, లోపల మాత్రం అసలు సిసలైన సైకో. ఈ ఇద్దరు అమ్మాయిలు తన ఇంటిని అద్దెకు ఇస్తామని ఎర వేస్తున్నారని తెలుసుకున్న డాక్టర్, వాళ్లను వదిలేయకుండా తన గదిలో బంధిస్తాడు.

అక్కడనుంచి మొదలవుతుంది అసలు ఆట. ఆ డాక్టర్ దగ్గర ఒక వింతైన మెషిన్ ఉంటుంది. ఆ మెషిన్ ద్వారా ఒక మనిషి మెదడులోని జ్ఞాపకాలను, అనుభవాలను ఇంకో మనిషిలోకి మార్చవచ్చని అతను నమ్ముతుంటాడు. ఆ ప్రయోగం కోసమే ఈ అమ్మాయిలను బలిపశువులను చేయాలని ప్లాన్ చేస్తాడు. ఇప్పుడు కథ పీక్స్ లోఉంటుంది. చివరికి ఆ డాక్టర్ దగ్గర నుండి ఈ ఇద్దరు కిలాడీలు తప్పించుకున్నారా ? అతని ప్రయోగాలకు బలైపోయారా ? అనే విషయాలను,ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also :  చావు భయంతో వణికిపోయే డ్యాన్సర్లు… అవంతిక వందనపు నటించిన హాలీవుడ్ థ్రిల్లర్ ఓటీటీలోకి… ఎక్కడ చూడచ్చు అంటే

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×