E-Paper
Advertisement

BHIM Small UPI Payments: ఇక పై రూ.5000 వరకు నో పిన్.. BHIM యాప్ లో కొత్త ఫీచర్

BHIM Small UPI Payments: ఇక పై రూ.5000 వరకు నో పిన్.. BHIM యాప్ లో కొత్త ఫీచర్
Advertisement

BHIM Small UPI Payments: యూపీఐ యాప్స్ తో రోజువారీ పేమెంట్స్ ఈజీ అయ్యాయి. యూపీఐ పేమెంట్స్ లో మరో కొత్త అప్డేట్ వచ్చింది. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI) కొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. యూపీఐ యాప్ లో పేమెంట్ చేసినప్పుడు ప్రతిసారీ 4 లేదా 6 అంకెల పిన్‌ ఎంటర్‌ చేయాల్సిన అవసరం లేకుండా.. బయోమెట్రిక్‌ సాయంతో డిజిటల్‌ చెల్లింపులు చేసే సదుపాయాన్ని తీసుకొచ్చింది. అంటే ఫేస్‌ రికగ్నిషన్‌ లేదా ఫింగర్‌ ప్రింట్‌ సాయంతో రూ.5 వేల వరకు పేమెంట్ చేయవచ్చు. ఈ ఆప్షన్ ను NPCIకి చెందిన డిజిటల్‌ పేమెంట్‌ యాప్‌ BHIMలో అందుబాటులోకి తెచ్చింది.

రూ.5000 వరకు పేమెంట్స్

బయోమెట్రిక్‌, ఫేస్‌ రికగ్నిషన్‌ ఫీచర్స్ ఉన్న ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ స్మార్ట్‌ఫోన్లలో ఈ ఫీచర్‌ పనిచేస్తుందని BHIM యాప్‌ తెలిపింది. దీనివల్ల రోజువారీ లావాదేవీలు మరింత వేగవంతంగా జరుగుతాయని పేర్కొంది. డిజిటల్ పేమెంట్స్‌లో బయోమెట్రిక్‌ డేటా ఫోన్‌లోనే ఎన్‌క్రిప్షన్‌ రూపంలో ఉంటుందని తెలిపింది. కిరాణా, కూరగాయల దుకాణాలు, చిన్న మొత్తంలో జరిపే లావాదేవీలకు ఈ సదుపాయం ఎంతో ఉపయోగపడనుంది. అయితే రూ.5 వేలకు పైబడిన లావాదేవీలకు మాత్రం సీక్రెట్ పిన్‌ ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.

Advertisement

ఈ ఫీచర్ ముఖ్యంగా తక్కువ విలువ గల చెల్లింపులు చేసే కస్టమర్లకు రోజువారీ లావాదేవీలను సులభతరం చేయనుంది. ప్రతిసారీ పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరాన్ని లేకుండా, పిన్ తప్పుగా ఎంటర్ చేయడం లేదా పిన్ మర్చిపోవడం వంటి సమస్యను తగ్గిస్తుంది. కస్టమర్లు పీర్-టు-పీర్ ట్రాన్స్ ఫర్స్, మర్చంట్ క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేయడం, ఆన్‌లైన్ కొనుగోళ్లు చేయడం వంటి అనేక సాధారణ కార్యకలాపాలకు బయోమెట్రిక్ అథెంటికేషన్‌ను ఉపయోగించుకోవచ్చు.

పిన్ దుర్వినియోగం కాకుండా

NPCI BHIM మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లలిత నటరాజ్ మాట్లాడుతూ.. పటిష్టమైన భద్రతా చర్యలను పాటిస్తూనే డిజిటల్ చెల్లింపులను సులభతరం చేయడానికి ఈ అప్‌డేట్ రూపొందించినట్లు తెలిపారు. బయోమెట్రిక్ పేమెంట్స్ నేరుగా కస్టమర్లకు మాత్రమే పనిచేస్తుంది. దీంతో పేమెంట్స్ ఈజీగా అవ్వడంతో పాటు భద్రతా పరంగా సమస్యలు తగ్గుతాయి. వేలిముద్రలు లేదా ఫేస్ రికగ్నిషన్ బయోమెట్రిక్ డేటా బయటకు షేర్ కాకుండా వినియోగదారుడి డివైజ్ లో స్టోర్ అవుతుంది. ఇది పిన్ దుర్వినియోగం లేదా అనధికారిక యాక్సెస్‌ ప్రమాదాలను తగ్గిస్తుంది.

Advertisement

రూ. 5,000 కంటే ఎక్కువ విలువ గల లావాదేవీల కోసం, వినియోగదారులు యూపీఐ పిన్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రోజువారీ డిజిటల్ చెల్లింపులను వేగవంతంగా, మరింత సులభతరం చేయడం ద్వారా లక్షలాది మంది వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది.

Also Read: యుపిఐ చెల్లింపుల సమయంలో మీ నెంబర్ కనిపిస్తోందా? బ్లాక్ చేయడానికి ఇలా చేయండి

ఎలా యాక్టివేట్‌ చేసుకోవాలి?

  • ఈ ఫీచర్‌ కోసం ముందుగా BHIM యూపీఐ యాప్‌ను ఓపెన్‌ చేయాలి.
  • ప్రొఫైల్‌లో లింకు చేయాల్సిన బ్యాంకు అకౌంట్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.
  • బయోమెట్రిక్‌ ట్రాన్సాక్షన్‌ ఆప్షన్‌ను యాక్టివ్‌ చేయాలి.
  • ఫింగర్‌ ప్రింట్‌ లేదా ఫేస్‌ రికగ్నిషన్‌ ఐడీని ధ్రువీకరించాలి.
  • రూ.5వేల వరకు లావాదేవీలు ఆప్షన్ ఎంచుకోవాలి.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×