E-Paper
Advertisement

దెయ్యం పట్టిన బిడ్డ కోసం తల్లి ఆరాటం… దెయ్యాల దెబ్బకు దద్దరిల్లే స్టోరీ… ఒంటరిగా చూస్తే గుండె గల్లంతే

దెయ్యం పట్టిన బిడ్డ కోసం తల్లి ఆరాటం… దెయ్యాల దెబ్బకు దద్దరిల్లే స్టోరీ… ఒంటరిగా చూస్తే గుండె గల్లంతే
Advertisement

Horror Thriller OTT : ఇండోనేషియన్ హారర్ సినిమాలంటే వెన్నులో వణుకు పుట్టాల్సిందే. అలా భయపెడతాయి ఈ సినిమాలు. కేవలం దెయ్యాలు కనిపించి భయపెట్టడమే కాకుండా, వాటి వెనుక ఉన్న చేతబడి, క్షుద్రపూజల రహస్యాల చుట్టూ ఈ కథలు కేక పెట్టిస్తుంటాయి. ఈ నేపథ్యంలో గత ఏడాది ఒక హారర్ సినిమా తెగ భయపెట్టింది. ఇండోనేషియా సంప్రదాయాల్లోని బ్లాక్ మ్యాజిక్ ను ఈ సినిమాలో చాలా డీటైల్డ్‌గా చూపించారు. ఈ కథలో ఒక తల్లి, దెయ్యం పట్టిన తన బిడ్డను కాపాడుకోవడానికి చేసే పోరాటం ప్రధానంగా కనిపిస్తుంది. సినిమా నడిచే కొద్ది ప్రేక్షకులకు ఒక థ్రిల్లింగ్ అనుభూతిని ఇస్తుంది.

నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్

ఈ ఇండోనేషియన్ సూపర్ నేచురల్ హారర్ సినిమా పేరు ‘జలన్ పులాంగ్’ (Jalan Pulang). ఇందులో లూనా మాయ, తస్యా నమ్యా, షరీఫా డానిష్, సుజివో తేజో ముఖ్య పాత్రల్లో నటించారు. ఇది 2025 జూన్ 19న థియేటర్లలో విడుదలైంది. ఇండోనేషియాలో ఈ సినిమాకు భారీ స్పందన వచ్చింది. విడుదలైన మొదటి వారంలోనే సుమారు 10 లక్షల మంది థియేటర్లలో ఈ సినిమాను చూశారు. ఇది అక్కడ ఒక పెద్ద రికార్డు కూడా. దర్శకుడు జెరో పాయింట్‌కి ఇది మొదటి సినిమా అయినప్పటికీ, స్క్రిప్ట్ కోసమే ఆయన ఏడాదిన్నర కాలం కష్టపడ్డారు. సినిమాలోని క్షుద్రపూజలు, ఆచారాలు చాలా సహజంగా ఉండాలని లోకల్ కల్చర్‌పై రీసెర్చ్ కూడా చేశారు. ఇక అఘి నరోత్తమ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాలోని భయానక వాతావరణాన్ని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఒక ఊళ్ళో లాస్టిని అనే మహిళ తన మొగుడు వింతగా చనిపోవడంతో చాలా దిగులు పడుతుంటుంది. కానీ అంతకంటే పెద్ద కష్టం ఆమె కూతురు రూపంలో వస్తుంది. ఆ చిన్నపిల్ల మీద ఏదో దుష్టశక్తి ఆవహించినట్టు వింతగా ప్రవర్తిస్తుంటుంది. కొన్ని రోజుల్లో ఆ దెయ్యాన్ని వదిలించకపోతే ఆ పిల్లకు ప్రాణగండం ఉంటుందని లాస్టినికి అర్థమవుతుంది. దాంతో చేతిలో ఉన్న కొద్దిపాటి టైమ్‌లో తన బిడ్డను ఎలాగైనా బతికించుకోవాలని ఆమె గట్టిగా నిర్ణయించుకుంటుంది. ఆ దెయ్యాన్ని వదిలించే దారి కోసం తన మిగతా పిల్లలను తీసుకుని లాస్టిని ఇండోనేషియాలోని జావా దీవి అంతా తిరుగుతుంది. దారిలో ఆమెకు ఎన్నో భయంకరమైన సంఘటనలు ఎదుర్కొని, తన బిడ్డ కోసం ఒక పిచ్చిదానిలా పోరాడుతుంది.

ఇక ఈ ప్రయాణంలో ఆమెకు కొందరు మంత్రగాళ్లు, ఆత్మలతో మాట్లాడేవాళ్లు తారసపడతారు. చివరికి ఐదు రోజులే టైమ్ ఉండటంతో కథ చాలా స్పీడ్ అందుకుంటుంది. ఆ దుష్టశక్తి నుండి తన కూతురిని విడిపించడానికి లాస్టిని ఒక భయంకరమైన మంత్రగాడిని ఆశ్రయిస్తుంది. అక్కడ జరిగే క్షుద్రపూజలు, ఆత్మల పోరాటం చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. అసలు లాస్టిని మొగుడు ఎందుకు చనిపోయాడు? తన కూతురినే ఆ దెయ్యం ఎందుకు పట్టుకుంది? ఈ దెయ్యాల గోల నుంచి వీళ్ళు బయటపడ్డారా ? అనే విషయాలతో ఈ క్లైమాక్స్ దద్దరిల్లిపోతుంది.

Advertisement

Read Also : పిచ్చెక్కిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్… గురువును మించిన శిష్యురాలు… ప్రతీ ఎపిసోడ్ ఉత్కంఠభరితమే

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×