E-Paper
Advertisement

Horror Movie OTT : తలలు లేని శవాలు తేలే నది… నరాలు కట్టయ్యే సస్పెన్స్… క్లైమాక్స్ లో ఫ్యూజులు అవుటయ్యే ట్విస్ట్

Horror Movie OTT : తలలు లేని శవాలు తేలే నది… నరాలు కట్టయ్యే సస్పెన్స్… క్లైమాక్స్ లో ఫ్యూజులు అవుటయ్యే ట్విస్ట్
Advertisement

Horror Movie OTT : సూపర్‌నాచురల్ మిస్టరీవచ్చిన ఒక హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలో మంచి వ్యూస్ టో దూసుకు పోతోంది. 19వ శతాబ్దపు వియత్నాం నేపథ్యంలో సాగే ఈ కథలో ఊహించని ట్విస్ట్లు వస్తూనే ఉంటాయి. ఒక గ్రామంలో తల లేని శవం కేసును ఛేదించడానికి వచ్చిన డిటెక్టివ్ కియెన్ ఎదుర్కొన్న అతీంద్రియ శక్తుల చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది ఈ సినిమాకి. ఈ హారర్ థ్రిల్లర్ సినిమా పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే 

2025లో వచ్చిన ఈ వియత్నామీస్ సూపర్‌నాచురల్ మిస్టరీ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘డిటెక్టివ్ కియెన్: ది హెడ్‌లెస్ హారర్’ (Detective Kien: The Headless Horror). విక్టర్ వు దర్శకత్వంలో ఇది రూపొందింది. ఐయండిబిలో 6.8/10 రేటింగ్ ను పొందింది. సుమారు 1 గంట 50 నిమిషాలు ఉన్న ఈ సినిమా Amazon Prime Videoలో అందుబాటులో ఉంది. ఒక్క సారి చూస్తే అస్సలు వదిలి పెట్టరు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

19వ శతాబ్దపు వియత్నాంలోఒక గ్రామంలోని ఒక సరస్సులో, వరుసగా తలలు లేని శవాలు బయటపడటంతో గ్రామస్థులంతా తీవ్ర భయాందోళనలకు గురవుతారు. ఇదంతా నీటిలో ఉండే ఒక భయంకరమైన దెయ్యం చేస్తున్న పని అని అక్కడి వాళ్ళు నమ్మడం మొదలుపెడతారు. ఇదే సమయంలో ఒక యువతి అకస్మాత్తుగా అదృశ్యం కావడంతో, ఆమె పిన్ని మూన్ డిటెక్టివ్ కియెన్‌ను సహాయం కోసం పిలుస్తుంది. కియెన్ ఆ గ్రామానికి చేరుకుని, ఈ మిస్టరీ వెనుక ఉన్నది అతీంద్రియ శక్తి కాదని, మనుషుల కుట్ర అని అనుమానిస్తూ ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తాడు.

దర్యాప్తు క్రమంలో కియెన్ ఆ గ్రామ పెద్దలు, మత గురువు దాచిన అనేక రహస్యాలను బయటపెడతాడు. గ్రామస్థులకు భ్రాంతులు కలిగించడానికి ఒక రకమైన విషపూరిత పొగను వాడుతున్నారని, దెయ్యం పేరుతో కొందరు వ్యక్తులు ఘోరమైన అకృత్యాలకు పాల్పడుతున్నారని అతను గుర్తిస్తాడు. ఈ మిస్టరీని ఛేదించే క్రమంలో కియెన్ అనేక ప్రాణాంతక దాడులను ఎదుర్కొంటాడు. చివరికి అమ్మాయి మిస్సింగ్ వెనుక ఉన్న అసలు కారణాన్ని, వరుస హత్యల వెనుక ఉన్న నిజమైన నేరస్థులను పట్టుకోవడంతో కథ ముగుస్తుంది.

Advertisement

Read Also : అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో అదుర్స్… కానీ ఇప్పటిదాకా విడుదలకు నోచుకోని సన్నీ లియోన్ మూవీ… ఎట్టకేలకు ఓటీటీ డేట్ లాక్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×