E-Paper
Advertisement

Horror Comedy OTT: రాత్రిపూట మాత్రమే కనిపించే ఊరు… బర్త్ డే పార్టీలో చేరే దయ్యాలు… ఐఎండిబీలో 7.4 రేటింగ్

Horror Comedy OTT: రాత్రిపూట మాత్రమే కనిపించే ఊరు… బర్త్ డే పార్టీలో చేరే దయ్యాలు…  ఐఎండిబీలో 7.4 రేటింగ్
Advertisement

Horror Comedy OTT : ఇప్పుడు హారర్ కామెడీ సినిమాల ట్రెండ్ అయితే నడుస్తోంది. ఏ భాషలో వచ్చిన ఈ సినిమాలు, మినిమం గ్యారెంటీ తో నిర్మాతలను కాపాడేస్తున్నాయి కూడా. ఈ మధ్య వచ్చిన ‘సర్వం మాయ’ 100 కోట్ల క్లబ్లో చేరి అందర్నీ ఆశ్చర్య పరచింది. ఈ నేపథ్యంలో ఒక గుజరాతి హారర్ కామెడీ కూడా మంచి హిట్ గా నిలిచింది. ఈ కామెడీ ట్రాక్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అక్కడ ముగ్గురు వ్యక్తులు అనుకోకుండా ఒక ఊరిలో ఇరుక్కుపోతారు. అయితే అది ఒక దయ్యాల ఊరు, రాత్రి పూట మాత్రమే కనిపిస్తుంది. అక్కడ జరిగే సంఘటనలు పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాయి.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ఈ గుజరాతీ హర్రర్ కామెడీ సినిమా పేరు ‘భల్లే పధర్యా’ (Bhalle Padharya). మనీష్ కుమార్ మాధవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో భరత్ చావడా, ప్రేమ్ గధ్వి, సౌరభ్ రాజ్యగురు, రాగి జాని ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని పూజ ఎన్ మాధవ్ నిర్మించారు. 1 గంట 58 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకి, ఐయండిబిలో 7.5/10 రేటింగ్ లభించింది. 2024 అక్టోబర్ 11న విడుదలైన ఈ గుజరాతీ హారర్ కామెడీ, ప్రస్తుతం Amazon Prime Videoలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ముగ్గురు దోస్తులు బర్త్‌డే పార్టీ కోసం ఫుల్లుగా ఎంజాయ్ చేద్దామని డిసైడ్ అవుతారు. వీళ్ళు అడవిలో ఉన్న ఒక రిసార్టుకు బయల్దేరుతారు. దారిలో ఎదురయ్యే అపశకునాలను అస్సలు పట్టించుకోకుండా, కారు వేగంగా పోనిచ్చి చివరకు ఒక పాడుబడ్డ ఊరికి చేరుకుంటారు. అక్కడ సీన్ కట్ చేస్తే, ఆ ఊరు మామూలు ఊరు కాదు! అది కేవలం రాత్రి పూట మాత్రమే కనిపిస్తూ, పగలు మాయమైపోయే ఒక శాపగ్రస్తమైన ఊరు. అక్కడున్న జనాలంతా ఎప్పుడో చచ్చిపోయి ఆత్మలుగా తిరుగుతుంటారు.

వీళ్లు లోపలికి వెళ్లగానే ఆ దయ్యాలు వీళ్లను చుట్టుముట్టి, తమకు శాప విముక్తి కలిగించమని టార్చర్ పెడతాయి. దీంతో ఆ ముగ్గురు దోస్తుల ప్యాంట్లు తడిచిపోతాయి. చావో రేవో తేల్చుకోవాలని డిసైడ్ అయిన మన హీరోలు, ఆ దయ్యాల నుండి ఎలాగోలా తప్పించుకోవడానికి చేసే పిచ్చి పిచ్చి ప్రయత్నాలే ఈ సినిమా. భయం కంటే భీభత్సమైన కామెడీయే ఇందులో ఎక్కువ. చివరకు ఆ ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారా ? ఆ దయ్యాలకే చుక్కలు చూపించారా ? అనేది ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : Horror comedy OTT: న్యూ ఇయర్ పార్టీలో నరాలు తెంపేసే ఉత్కంఠ… చావు కేక పెట్టించే సరదా

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×