E-Paper
Advertisement

Mojtaba Khamenei: ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేని కొడుకు మోజ్తాబాకు గాయాలు, ఆయన ఆచూకీ ఎక్కడ?

Mojtaba Khamenei: ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేని కొడుకు మోజ్తాబాకు గాయాలు, ఆయన ఆచూకీ ఎక్కడ?
Advertisement

Mojtaba Khamenei: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. త్వరలో ఇరాన్ కొత్త సుప్రీంగా మోజ్తాబా ఖమేనీని నియమించేందుకు తెర వెనుక ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. టెహ్రాన్‌పై యుద్ధం ప్రారంభించినప్పటి నుండి దాదాపు 3,400 దాడులు నిర్వహించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.

ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేని కొడుకు మోజ్తాబాకు గాయాలు

Advertisement

ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో అయితుల్లా అలీ ఖమేని కొడుకు 56 ఏళ్ల మోజ్తాబా ఖమేనీ గాయపడినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు జోరుగా వస్తున్నాయి. గతవారం అయితుల్లా అలీ ఖమేని.. 40 మంది ఆదేశ జాతీయ భద్రతాదారులతో భేటీ అయ్యారు.  ఆ సమయంలో ఇరాన్ కార్యాలయంపై అమెరికా-ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేశాయి. ఆ దాడుల్లో ఖమేనీతోపాటు 40 మంది ఆ దేశ జాతీయ భద్రతాసలహాదారులు మరణించారు.

అంతేకాదు ఆ దాడుల్లో మోజ్తాబా భార్య జహ్రా హద్దాద్ అదెల్, కొడుకు కూడా మరణించాడు. మోజ్తాబా ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడని చెబుతున్నాయి. ఆ తర్వాత మోజ్తాబా జాడ కనిపించలేదు. అతడు రహస్యంగా ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడని, అందుకే బయటకు కనిపించలేదని అంటున్నారు. ఇటీవల ఇరాన్‌లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సుప్రీంగా మోజ్తాబా ఎంపిక చేసినట్టు వార్తలు వచ్చాయి.

Advertisement

ఆచూకీ లేని  మోజ్తాబాకు, ఆపై ట్రీట్‌మెంట్

పాశ్చాత్య దేశాలను తీవ్రంగా వ్యతిరేకించే వారిలో అతడు ఒకడు. తండ్రి ఖమేని అధికారంలో ఉన్నప్పుడు తెర వెనుక తీవ్రమైన ప్రభావాన్ని చూపాడని చెబుతున్నాయి. అంతేకాదు అణు బాంబులను అభివృద్ధి చేయాలని వాదించిన వారిలో మోజ్తాబా కూడా ఒకడని అంటున్నారు. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) తో బలమైన సంబంధాలను కలిగి ఉన్నాడు.

సంప్రదాయవాద మతాధికారి వేల కోట్లు కలిగి ఉన్నాడనే ఆరోపణలు లేకపోలేదు. యూకెలో విలువైన లగ్జరీ ప్యాడ్‌లను కలిగి ఉన్నట్లు సమాచారం. అతడి ఆస్తి బిషప్ అవెన్యూలో 11 ఇళ్లు ఉన్నాయట. ఆ ప్రాంతాన్ని దీనిని బిలియనీర్స్ రో అని పిలుస్తారట. దుబాయ్‌లో ఓ విల్లా, ఫ్రాంక్‌ఫర్ట్, మల్లోర్కాలోని హోటళ్లు కలిగి ఉన్నాడని తెలుస్తోంది.

ALSO READ: ఇరాన్‌ చమురు డిపోలపై వరుసగా బాంబులదాడి, ఎగిసిపడిన మంటలు

క్రిప్టోకరెన్సీలతోపాటు బంగారం, వజ్రాలు సుమారు $ 300 డాలర్ల మిలియన్లు వరకు ఉన్నట్లు చెబుతున్నాయి. గల్ఫ్‌లో షిప్పింగ్ వ్యాపారాలు ఉన్నాయట. జనవరిలో క్రిప్టోకరెన్సీని ఉపయోగించి దాదాపు 250 పౌండ్ల మిలియన్లను దుబాయ్‌కు తరలించినట్లు ప్రచారం లేకపోలేదు. ప్రైవేట్ జెట్, అత్యవసర ప్రయాణాలకు హెలికాప్టర్, మెర్సిడెస్ కార్ల సముదాయాన్ని కలిగి ఉన్నాడని రాసుకొచ్చాయి.

తండ్రి హత్యకు ముందు అతడు కోమ్‌లోని అతిపెద్ద సెమినరీలో బోధించాడట మోజ్తాబా. మానవ హక్కులను అణిచి వేయడంలో అతడ్ని క్రూరుడిగా చెబుతుంటారు. ఇరాన్-ఇరాక్ యుద్ధంలో అదే పని చేసిందని అంటున్నారు. రానున్న రోజుల్లో మోజ్తాబా ఖమేనీ గురించి ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×