// // Fantasy Drama ott : గ్రూట్ తో గేమ్సా ? మజా ఇచ్చే సూపర్ హీరో -->
E-Paper
Advertisement

Fantasy Drama OTT : గ్రూట్ తో గేమ్సా ? మజా ఇచ్చే సూపర్ హీరో సిరీస్… చిన్న పిల్లలకు పండగే

Fantasy Drama OTT : గ్రూట్ తో గేమ్సా ? మజా ఇచ్చే సూపర్ హీరో సిరీస్… చిన్న పిల్లలకు పండగే
Advertisement

Fantasy Drama OTT : ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ’ సినిమాలోని ‘బేబీ గ్రూట్’ చేసే అల్లరి పనులతో ఒక షార్ట్ సిరీస్ ఓటీటీలో సందడి చేసింది. 2022లో విడుదలైన మొదటి సీజన్‌లో మొత్తం 5 ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ సుమారు 5 నిమిషాల నిడివి ఉంటుంది. మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన ఈ యానిమేటెడ్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇది ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే ఇవరాల్లోకి వెళ్తే …

స్ట్రీమింగ్ ఎందులో అంటే

మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన ఈ యానిమేటెడ్ షార్ట్ ఫిలిమ్స్ సిరీస్ పేరు ‘ఐ యామ్ గ్రూట్’ (I Am Groot). ఇది 2022 ఆగస్టు 10న Jio Hotstarలో విడుదలైంది. గ్రూట్ పాత్రకు విన్ డీజిల్ వాయిస్ అందించారు. రాకెట్ రాకూన్ పాత్రలో బ్రాడ్లీ కూపర్ కనిపిస్తారు. కిర్‌స్టన్ లెపోర్ ఈ సిరీస్‌ను డైరెక్ట్ చేశారు. ఈ సిరీస్ చాలా సరదాగా, పిల్లల నుండి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. దీనికి కొనసాగింపుగా సెప్టెంబర్ 2023లో సీజన్ 2 కూడా విడుదలైంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ కథ బేబీ గ్రూట్ తన బాల్యంలో ఎదుర్కొన్న వింత అనుభవాల చుట్టూ తిరుగుతుంది. మొదటి ఎపిసోడ్‌లో కుండలో నుండి బయటపడి గ్రూట్ మొదటిసారి నడక నేర్చుకోగా, ఆ తర్వాత వేరే గ్రహంపై ఉన్న అతి చిన్న జీవులైన ‘గ్రండెల్స్’ ని కలుస్తాడు. స్పేస్ షిప్‌లో ఒంటరిగా ఉన్న సమయంలో తన రూపాన్ని మార్చుకోగలిగే ఒక వింత గ్రహాంతరవాసితో డ్యాన్స్ పోటీ పడటం, బురద స్నానం చేస్తూ తన ఒంటిపై పెరిగే ఆకులతో రకరకాల గెటప్‌లు మార్చుకోవడం వంటి సరదా సన్నివేశాలతో ఈ సిరీస్ సాగుతుంది.

చివరిగా గ్రూట్ తన గార్డియన్స్ బృందం (స్టార్-లార్డ్, గామోరా, డ్రాక్స్, రాకెట్) కోసం ఒక అందమైన చిత్రాన్ని గీయాలని నిర్ణయించుకుంటాడు. దానికోసం షిప్‌లోని వస్తువులన్నీ చిందరవందర చేస్తూ, పేలుళ్లు సృష్టిస్తూ ఒక చిత్రాన్ని సిద్ధం చేస్తాడు. తన అల్లరితో రాకెట్ రాకూన్‌ను ముప్పతిప్పలు పెట్టినప్పటికీ, చివరికి గ్రూట్ గీసిన ఆ బొమ్మను చూసి రాకెట్ మురిసిపోవడంతో ఈ చిన్న కథల సిరీస్ ముగుస్తుంది.

Advertisement

Read Also :  ఏకంగా 16 ఆస్కార్ నామినేషన్లు… గోల్డెన్ గ్లోబ్ కూడా ఫిదా… ఓటీటీలో గత్తరలేపుతున్న హర్రర్ మూవీ

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×