E-Paper
Advertisement

Mahesh Babu’s Luxury Cars: అమ్మో.. మహేష్ బాబు దగ్గర ఇన్ని లగ్జరీ కార్లు ఉన్నాయా? ఒక్కోదాని ధర ఎంత అంటే?

Mahesh Babu’s Luxury Cars: అమ్మో.. మహేష్ బాబు దగ్గర ఇన్ని లగ్జరీ కార్లు ఉన్నాయా? ఒక్కోదాని ధర ఎంత అంటే?
Advertisement

Actor Mahesh Babu Luxury Cars: తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ హీరోగా కొనసాగుతున్న మహేష్ బాబు దగ్గర అద్భుమైన కార్లు ఉన్నాయి. ఆయన గ్యారేజీలో క్రేజీ అల్ట్రా లగ్జరీ వెహికిల్స్ ఉన్నాయి. వీటిని రూ.5.4 కోట్లకు పైగా విలువైన కస్టమైజ్డ్ గోల్డ్ కలర్ రేంజ్ రోవర్ తో పాటు రోల్స్ రాయిస్ ఘోస్ట్, రేంజ్ రోవర్ వోగ్, ఆడి ఇ ట్రాన్, లంబోర్గిని గల్లార్డో లాంటి టాప్ రేంజ్ లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇవి అద్భుతమైన సౌకర్యంతో పాటు కళ్లు చెదిరే లుక్ తో ఆకట్టుకుంటాయి.

మహేష్ బాబు లగ్జరీ కార్ కలెక్షన్ గురించి..

ఇప్పుడు మనం మహేష్ బాబు దగ్గర ఉన్న లగ్జరీ కారు కలెక్షన్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన దగ్గర ఉన్న కార్లు ఏంటి? వాటి ధర ఎంత అనేది తెలుసుకుందాం..

Advertisement

⦿ రేంజ్ రోవర్ SV (గోల్డ్ ఎడిషన్): మహేష్ బాబు ఈ కారును 2023లో కొనుగోలు చేశారు. ఈ టాప్ ఆఫ్ ది లైన్ SUV ధర రూ. 5.4 కోట్లకు పైగా ఉంటుంది. ఇది పవర్ ఫుల్ 4.4-లీటర్ V8 ఇంజిన్‌ను కలిగి ఉంది.

⦿ రేంజ్ రోవర్ వోగ్, ఆటోబయోగ్రఫీ: మహేష్ బాబుకు ఆయన భార్య నమ్రత గిఫ్ట్ గా ఇచ్చిన వోగ్ తో పాటు పలు రేంజ్ రోవర్లను కలిగి ఉన్నారు. వీటి ధరలు ఇంచుమించు రూ. 2.18 కోట్ల నుంచి ప్రారంభం అవుతాయి.

Advertisement

⦿ లంబోర్గిని గల్లార్డో: మహేష్ బాబు కారు కలెక్షన్‌లో ఇదో లగ్జరీ స్పోర్ట్స్ కారు. దీని విలువ దాదాపు రూ. 2.80 కోట్లు ఉంటుంది.

⦿ ఆడి ఇ ట్రాన్: మహేష్ బాబు దగ్గర ఆడి కంపెనీకి చెందిన రూ. 1.19 కోట్ల విలువ చేసే ఈ ఎలక్ట్రిక్ SUVకూడా ఉంది.

⦿ రోల్స్ రాయిస్ ఘోస్ట్: టాలీవుడ్ సూపర్ స్టార్ దగ్గర ఉన్న అత్యంత విలాసవంతమైన కార్లలో ఇది ఒకటి. మహేష్ బాబు ఈ కారులో అత్యంత తరచుగా ప్రయాణాలు చేస్తుంటారు. అత్యంత ముఖ్యమైన సినిమా వేడుకలకు ఇందులో వెళ్తుంటారని ఆయన మిత్రులు చెప్తుంటారు.

⦿ మెర్సిడెస్ బెంజ్ GL క్లాస్, S క్లాస్: అటు రూ.1.5 కోట్ల విలువైన మెర్సిడెస్ GL క్లాస్ SUVతో పాటు, మెర్సిడెస్ బెంజ్ S క్లాస్ సెడాన్ మహేష్ గ్యారేజీలో ఉన్నాయి.

⦿ BMW 7 సిరీస్: సుమారు 1.30 కోట్ల విలువ చేసే కలిగిన BMW 7 730Ld లగ్జరీ సెడాన్ కూడా ఉంది.

⦿ టయోటా ల్యాండ్ క్రూయిజర్: అతడి కారు కలెక్షన్స్ లో ఈ లగ్జరీ SUV కూడా ఉంది. దీని ధర రూ. 1.5 కోట్ల కంటే ఎక్కువ ధర ఉంటుంది.

⦿ వీటితో పాటు, మహేష్ బాబు దగ్గర రూ. 6 కోట్లకు పైగా విలువైన కస్టమ్ బిల్ట్ వానిటీ వ్యాన్ కూడా ఉంది.

మహేష్ బాబు సినిమాల గురించి..

ప్రస్తుతం మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది.

Read Also: లగ్జరీ కారుకొన్న హాట్ బ్యూటీ ఊరశ్వి, కాస్ట్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×