// // Eesha OTT Release : హెబ్బా పటేల్ తెలుగు హారర్ మూవీ ఓటీటీలోకి -->
E-Paper
Advertisement

Eesha OTT Release : హెబ్బా పటేల్ తెలుగు హారర్ మూవీ ఓటీటీలోకి… దాదాపు రెండు నెలల తర్వాత… ఐయండిబిలో టాప్ రేటింగ్

Eesha OTT Release : హెబ్బా పటేల్ తెలుగు హారర్ మూవీ ఓటీటీలోకి… దాదాపు రెండు నెలల తర్వాత… ఐయండిబిలో టాప్ రేటింగ్
Advertisement

Eesha OTT Release : గత ఏడాది థియేటర్లలో రిలీజ్ అయిన తెలుగు హారర్ సినిమాలలో ‘ఈషా’ కూడా ఒకటి. విడుదలకు ముందే దీనికి భారీ ప్రచారం జరిగింది. అయితే బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేక పోయింది. అయితే దీనికి ఐయండిబిలో 9.3 రేటింగ్ ఉండటం విశేషం. ఇప్పుడు దాదాపు రెండు నెలల తర్వాత, ఈ హర్రర్ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ కూడా ఉంది. ఆ ట్విస్ట్ ఏమిటి ? ఇది ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం.

ఆ ట్విస్ట్ ఏమిటి ?

2025లో విడుదలైన హారర్ థ్రిల్లర్‌ ‘ఈషా’ (Eesha) సినిమాలో అదిత్ అరుణ్, హెబా పటేల్, అఖిల్ రాజ్, సిరి హన్మంత్, పృథ్వీరాజ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి శ్రీనివాస్ మన్నె దర్శకత్వం వహించగా, ఆర్ఆర్ ధ్రువన్ సంగీతం సమకూర్చారు. కే.ఎల్. దామోదర ప్రసాద్ సమర్పణలో హెచ్‌వీఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హేమ వెంకటేశ్వరరావు ఈ సినిమాను నిర్మించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తోంది. కానీ ట్విస్ట్ ఏమిటంటే ఇది ప్రస్తుతం భారతదేశం వెలుపల మాత్రమే అందుబాటులో ఉంది. అది కూడా అద్దె ప్రాతిపదికన స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వారం నుండి నేరుగా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

కథలో నలుగురు ప్రాణ స్నేహితులు ఉంటారు. వీళ్ళకి మూఢనమ్మకాలన్నా, జనాలను మోసం చేసే దొంగ బాబాలన్నా అస్సలు నచ్చదు. ఎలాగైనా ఆ మోసాలను అందరికీ చూపించాలనే ఉద్దేశంతో, ఒక బాబా చేస్తున్న క్షుద్రపూజలని లైవ్ లో పట్టుకోవడానికి ప్లాన్ చేస్తారు. ఈ క్రమంలో వీళ్ళంతా ఒక పాత బంగళాలోకి వెళ్తారు. అక్కడ వాళ్లు కెమెరాలు పెట్టి అసలు ఏం జరుగుతుందో కనిపెట్టాలనుకుంటారు. కానీ అక్కడ ఊహించని విధంగా, నిజంగానే కొన్ని వింత సంఘటనలు ఎదురవుతాయి.

ఆ ఇంట్లో ఏదో తెలియని భయంకరమైన శక్తి ఉందని వాళ్ళకి మెల్లగా అర్థమవుతుంది. తాము వేసిన ప్లాన్ రివర్స్ అవ్వడంతో, ఆ నలుగురు స్నేహితులు ప్రాణాలతో బయటపడటానికి నానా తంటాలు పడతారు. అసలు ఆ ఇంట్లో ఉన్న ఆత్మ ఎవరు? ఆ ఆధ్యాత్మిక గురువుకు, ఈ ఇంటికి ఉన్న సంబంధం ఏంటి? చివరికి ఆ స్నేహితులు ఆ గండం నుండి ఎలా బయటపడ్డారు ? అనేదే ఈ సినిమా క్లైమాక్స్.

Advertisement

Read Also :  ఐదుగురు హై ప్రొఫైల్ వ్యక్తులతో మోసం చేసే కాన్ మ్యాన్… క్లైమాక్స్ ట్విస్టుకు బుర్రపాడు

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×