E-Paper
Advertisement

TVS Hero Bajaj: టీవీఎస్, హీరో, బజాజ్.. ఈవీ టూ వీలర్ మార్కెట్ వీటి వాటా ఇంత ఉందా?

TVS Hero Bajaj:  టీవీఎస్, హీరో, బజాజ్.. ఈవీ టూ వీలర్ మార్కెట్ వీటి వాటా ఇంత ఉందా?
Advertisement

భారత్ లో ఎలక్ట్రిక్ టూ వీలర్స్ రోజు రోజుకు మరింత విస్తరిస్తున్నాయి. పెట్రో ధరల పెరుగదలకు తోడు గ్రీన్ ఎనర్జీ మీద ప్రజల్లో అవగాహన కలుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. స్టార్టప్ కంపెనీల ఆలోచనలో నుంచి పుట్టిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఇప్పుడు తమ ఆధిపత్యాన్ని కోల్పోయాయి. టీవీఎస్ మోటార్స్, బజాజ్ ఆటో,  హీరో మోటోకార్ప్ జనవరి 2026 నాటికి ఈ విభాగంలో 60 శాతం ఆక్రమించాయి. ఆటోమోటివ్ మార్కెట్ పరిశోధన సంస్థ జాటో డైనమిక్స్ ప్రకారం.. 2023లో ఈ సంఖ్య కేవలం 34 శాతంగా ఉంది.

గత ఏడాది భారీగా విడుదలైన ఎలక్ట్రిక్ స్కూటర్లు

గత సంవత్సరంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల రాక మరింత పెరిగింది. నిజానికి స్టార్టప్‌లు ఈ విభాగాన్ని క్రియేట్ చేశాయి. కానీ, ఇప్పుడు ఈ విభాగంలోకి పాపులర్ బ్రాండ్స్ ఎంట్రీ ఇచ్చాయి. ఓకే ఛార్జ్ తో మంచి రేంజ్ ను అందించేలా తయారు చేశాయి.  ఎలక్ట్రిక్ స్కూటర్ల కొనుగోలుకు దేశ వ్యాప్తంగా భారీగా పెరిగింది. అదే సమయంలో కొనుగోలుదారులు విశ్వసనీయత, సర్వీస్ యాక్సెస్, దీర్ఘకాలిక మెయింటెనెన్స్ ఖర్చులపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. అందుకే అనుగుణంగానే తయారీ సంస్థలు పని చేస్తున్నారు.

EV స్కూటర్లలో TVS, బజాజ్  పనితీరు  

Advertisement

2026 ప్రారంభం నుంచి TVS, బజాజ్ ఆటో మంచి దూకుడు కనబరుస్తుంది.  రెండు కంపెనీల మధ్య గట్టిపోటీ ఏర్పడింది.  తక్కువ ధరలతో పాటు కస్టమర్లకు అద్భుతమైన మోడల్స్ అందించేలా ప్రయత్నిస్తున్నాయి. TVS మోటార్ EV స్కూటర్లను మరింత క్రేజీగా తయారు చేస్తుంది. మంచి లుక్ తో పాటు రేంజ్ తో ఆకట్టుకుంటుంది. ఈ బ్రాండ్ Q3 FY26 ఫలితాల తర్వాత, TVS మోటార్ CEO  KM రాధాకృష్ణన్, ఫ్లాగ్‌షిప్ iQube, ఇటీవల ప్రవేశపెట్టిన ఆర్బిటర్ రెండింటికీ డిమాండ్ బలంగా ఉందని చెప్పారు. భిన్న కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకుంటుందని వెల్లడించారు. డిసెంబర్ 2025 త్రైమాసికంలో 100,000 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది.

ఇక బ్యాటరీ ప్యాక్ సరఫరా సమస్యలను పరిష్కరించిన తర్వాత బజాజ్ ఆటో కూడా అద్భుతమైన రీఎంట్రీని చూపించింది. సరఫరా సాధారణ స్థాయికి చేరిన తర్వాత ఉత్పత్తి పెరిగింది. డిసెంబర్ త్రైమాసికంలో అమ్మకాలు పెరిగాయి. దీని వలన బ్రాండ్ ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో రెండవ స్థానాన్ని తిరిగి పొందగలిగింది. బజాజ్ యువ రైడర్లు, మహిళలను లక్ష్యంగా చేసుకుని మరింత అందుబాటులో ఉండే ట్రిమ్‌ను తీసుకురావడం ద్వారా చేతక్ లైనప్‌ను విస్తృతం చేసింది. విశ్వసనీయత,  వ్యాల్యూ మీద దృష్టి సారిస్తూనే వారి పరిధిని పెంచింది.

Advertisement

ఇక ఈవీలను మరింత పెంచేందుకు కేంద్రం PM E-DRIVE పథకం 2026 బడ్జెట్‌ లో ప్రకటించబడింది. బలమైన, సమీకృత సరఫరా చైన్ ను తయారీదారులకు ఈ పథకం మరింత ప్రయోజనకరంగా మారింది. ప్రస్తుతం ఇండియాలో తయారవుతున్న స్కూటర్లు విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి.

Read Also:  ఓలా To హీరో.. ఈ స్కూటర్లకు లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదండోయ్!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×