E-Paper
Advertisement

Dhanush: ఓటీటీలోకి ధనుష్ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Dhanush: ఓటీటీలోకి ధనుష్ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Advertisement

Dhanush:ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఒకవైపు హీరోగా నటిస్తూనే.. మరొకవైపు దర్శకుడిగా పలు చిత్రాలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇక కోలీవుడ్ లోనే కాకుండా అటు హిందీలో కూడా నేరుగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే హిందీలో ఆయన నటించిన రొమాంటిక్ డ్రామా చిత్రం తేరే ఇష్క్ మే. ధనుష్ (Dhanush ) హీరోగా కృతిసనన్ (Krithi sanan) హీరోయిన్గా వచ్చిన ఈ సినిమా గత ఏడాది నవంబర్లో థియేటర్లలో విడుదలైంది. మొదటి షోతోనే మంచి పాజిటివ్ టాక్ అందుకుంది. అటు కథ, నటన, సంగీతం పరంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది.

ధనుష్ కొత్త మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. అటు ఈ సినిమా థియేటర్ రన్ కూడా ముగియడంతో ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కోసం సిద్ధమయ్యింది. అందులో భాగంగానే జనవరి 23 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఇకపోతే ఈ సినిమాను థియేటర్లలో చూడలేకపోయినవారు.. మరోసారి సినిమాను చూడాలనుకునే అభిమానులు కూడా ఈ విషయం తెలిసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో ధనుష్ – కృతి సనన్ ల కెమిస్ట్రీ తోపాటు.. భావోద్వేగాలతో నిండిన కథాంశం, ఆకట్టుకునే పాటలు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అటు ఓటీటీ విడుదలతో ఈ చిత్రానికి మరింత ప్రేక్షక ఆదరణ పెరుగుతుందని సినీవర్గాలు కూడా అంచనా వేస్తున్నారు. మరి థియేటర్లలో మంచి విజయం అందుకున్న ఈ సినిమా ఇటు ఓటీటీలో ఎలాంటి రేటింగ్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న ధనుష్..

Advertisement

ధనుష్ విషయానికి వస్తే.. సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ప్రముఖ బ్యూటీ మృనాల్ ఠాగూర్ (Mrunal thakur) తో ఈయన ప్రేమలో ఉన్నట్లు గత కొద్దిరోజులుగా వార్తలు జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే.అయితే ఇప్పుడు ఏకంగా వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజున వీరిద్దరూ ఒక్కటి కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటివరకు దీనిపై వీరి నుంచీ ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ గతంలో ఒకసారి ఇలాంటి వార్తలు రావడంతో మృనాల్ ఠాకూర్ వాటిని ఖండించింది. మరి ఈ వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం వీరిద్దరూ ఏకంగా వివాహం చేసుకోబోతున్నారు అంటూ వార్తలు రావడంతో అభిమానులు కూడా ఈ విషయంపై ఆరా తీస్తున్నారు.

ధనుష్ వ్యక్తిగత జీవితం..

ఇక ధనుష్ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే ఈయన ఇదివరకే సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్యను 2004లో వివాహం చేసుకున్నారు. మనస్పర్ధలు కారణంగా 20 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ 2024లో విడాకులు తీసుకున్నారు. పైగా ధనుష్ – ఐశ్వర్య దంపతులకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఇలాంటి సమయంలో వీరు విడాకులు తీసుకోవడం అప్పట్లో సంచలనం సృష్టించినా.. ఆ తర్వాత దీని గురించి జనాలు మాట్లాడుకోవడం మానేశారు. కానీ ఇప్పుడు ధనుష్ మళ్ళీ ఇలాంటి ఎఫైర్ రూమర్స్ ఎదుర్కోవడం గమనార్హం.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×