E-Paper
Advertisement

Crime Thriller Movie OTT : ఓటీటీలోకి వచ్చేసిన హెబ్బా పటేల్ థ్రిల్లర్ మూవీ… కథ అంతా 10 కోట్ల డ్రగ్ చుట్టూనే… ఎక్కడ చూడచ్చు అంటే ?

Crime Thriller Movie OTT : ఓటీటీలోకి వచ్చేసిన హెబ్బా పటేల్ థ్రిల్లర్ మూవీ… కథ అంతా 10 కోట్ల డ్రగ్ చుట్టూనే… ఎక్కడ చూడచ్చు అంటే ?
Advertisement

Crime Thriller Movie OTT : ఓటీటీలోకి కొన్ని సినిమాలు సడెన్ సర్ప్రైజ్ ఇస్తూ ఆడియన్స్ కి షాక్ ఇస్తున్నాయి. థియేటర్లలో వచ్చే సినిమాలు ఓటీటీలోకి రావడం సాధారణమే. అయితే రిలీజ్ అయిన రెండు వారాలకే, అది కూడా ఎటువంటి సమాచారం లేకుండా వస్తే అది షాకింగ్ న్యూస్ కాకపోతే ఏమౌతుంది. హెబ్బాపటేల్ నటించిన లేటెస్ట్ మూవీ సెడన్ గా ఓటీటీలోకి స్ట్రీమింగ్ కి వచ్చి షాక్ ఇచ్చింది. అయితే థియేటర్లలో ఈ సినిమాకు అంతగా రెస్పాన్స్ రాలేదు. ఎప్పుడు వచ్చిందో కూడా చాలామందికి తెలీదు. క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో వచ్చినా కూడా ప్రేక్షకులను మెప్పించలేక పోయింది. కథ అంతా 10 కోట్ల డ్రగ్స్ డ్రగ్స్ చుట్టూ తిరుగుతుంటుంది. అయితే థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉండటంతో డిజిటల్ గా పుంజుకునే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్

ఈ తెలుగు సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌ సినిమా పేరు ‘రేపు ఉదయం 10 గంటలకు’ (Repu udayam 10 gantalaku). ఇందులో హెబ్బా పటేల్, చైతన్య రావు, అభినవ్ గోమటం, కిరీటి దామరాజు, సాహితి అవంచ, వాసు ఇంటూరి, మోహిత్ ప్రధాన పాత్రలు పోషించారు. చెందు ముద్దు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. గతంలో వచ్చిన ‘ఓ పిట్ట కథ’, ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ సినిమాలు కూడా ఈయనే దర్శకత్వంలోనే తెరకెక్కాయి. మాస్ మీడియా సమర్పణలో రామ్ వీరపనేని ఈ సినిమాను నిర్మించగా, ప్రిన్స్ హెన్రీ సంగీతం అందించారు. ఈ సినిమా మార్చి 14న థియేటర్లలో విడుదల అయింది. కేవలం 2 వారాల్లోనే శ్రీరామ నవమి సందర్భంగా మార్చి 27 నుంచి ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఈ కథ కొంతమంది క్యారెక్టర్లను కలుపుతూ సాగుతుంది. మొదట సరదాగా మొదలై ఆ తరువాత సీరియస్ మోడ్ కి వెళ్తుంది. కథలో ఒక మొదట అంబులెన్స్ డ్రైవర్ (అభినవ్ గోమఠం)తో మొదలవుతుంది. అతను ఒక శవాన్ని తీసుకెళ్ళే క్రమంలో మిగతా స్టోరీలు కలుస్తూంటాయి. అతడు ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిన ఒక జంటకు లిఫ్ట్ ఇస్తాడు. అంతేకాదు ఇందులో (హెబ్బా పటేల్) వేశ్య పాత్రలో కనిపిస్తుంది. ఆమె దగ్గరకు విటుడిగా ఒక యువకుడు (చైతన్య రావు) వస్తాడు. వీళ్లందరి మధ్య కామన్ లింక్ 10 కోట్ల డ్రగ్స్ తో ముడిపడి ఉంటుంది. అసలు సమస్య ఏంటంటే.. రేపు ఉదయం 10 గంటల కల్లా వాళ్లు ఒక పని పూర్తి చేయాలి. లేదంటే వాళ్ల ప్రాణాలకే ముప్పు వస్తుంది. పోలీసులు, విలన్ వచ్చేలోపు ఆ గందరగోళం నుంచి బయటపడాలి. తెల్లవారుజాము అవుతున్న కొద్దీ టెన్షన్ పెరుగుతుంది. చివరికి ఆ 10 గంటల గండం ఏమిటి ? దాని నుంచి వీళ్ళు బయటపడ్డారా ? అనేదే అసలు కథ.

Read Also :  మెంటలెక్కించే మెడికల్ కాలేజీ ప్రేమ… స్నేహితుల సరదాకు కొంప కొల్లేరు… ఓటీటీలోకి తమిళ రొమాంటిక్ డ్రామా

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×