E-Paper
Advertisement

అత్యాశకు పోతున్న ‘పెద్ది’ నిర్మాత.. అసలుకే మోసం వస్తుందేమో!

అత్యాశకు పోతున్న ‘పెద్ది’ నిర్మాత.. అసలుకే మోసం వస్తుందేమో!
Advertisement

Peddi Movie: ఒక్కోసారి సినిమాను నిర్మాతలు కావాలని కిల్ చేస్తుంటారు. అందుకు కారణం మాత్రం అత్యాశే. అవును, సినిమా మీద నమ్మకం ఉండొచ్చు. కానీ, పరిస్థితులకు అనుగుణంగా ఆ నమ్మకాన్ని క్యాష్ చేసుకోవాలి. అంతేకానీ, నా సినిమా తురుము, తోపు అని బిల్డప్‌లు ఇస్తే.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’కి వచ్చిన రిజల్ట్‌లే వస్తాయి. సరే, ఇప్పుడిదంతా దేని కోసమంటే.. ‘పెద్ది’ నిర్మాత వెంకట సతీష్ కిలారు (Venkata Satish Kilaru) పద్దతి గురించే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) హీరోగా, బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో ఆయన ‘పెద్ది’ (Peddi Movie) సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. కచ్చితంగా చరణ్‌కు ఈ సినిమా భారీ సక్సెస్‌ని ఇస్తుందని.. ఫ్యాన్స్, ప్రేక్షకులంతా అనుకుంటుంటే, నిర్మాత మాత్రం.. దీనిని క్యాష్ చేసుకోవాలని కక్కుర్తి పడుతున్నట్లుగా టాక్ నడుస్తుంది.

Also Read- మనీకా? రిలేషన్స్‌కా? దేనికి వేల్యూ ఇస్తారంటే? దువ్వాడ మాధురి ఆన్సర్ ఇదే!

పుష్ప 2కి డబుల్ ఇస్తామన్నా..

Advertisement

అవును, ‘పుష్ప 2’ చిత్రానికి ఎలాంటి బిజినెస్ జరిగిందో తెలియంది కాదు, ఆ చిత్రానికి జరిగిన బిజినెస్‌కు డబుల్ ఇవ్వడానికి బయ్యర్లు రెడీగా ఉంటే, నిర్మాత సతీష్ కిలారు మాత్రం మూడు రెట్లు కావాలని డిమాండ్ చేస్తున్నాడట. ఇది అతి కాకపోతే ఏమిటి? ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత హీరో రామ్ చరణ్‌కు హిట్ లేదు. భారీ అంచనాలతో వచ్చిన ‘గేమ్ ఛేంజర్’ భారీ దెబ్బేసింది. ప్రస్తుతం ఎలాగోలా ఒక హిట్టు పడాలని ఫ్యాన్స్ అందరూ వేచి చూస్తుంటే, నిర్మాత మాత్రం మళ్లీ ఛాన్స్ వస్తుందో, రాదో అన్నట్లుగా ఒక్కసారే మేడలు కట్టేయాలని, భారీగా ఎక్స్‌పెక్ట్ చేస్తుండటం, వారికి తీవ్ర నిరాశను తెప్పిస్తోంది. అటు చేసి, ఇటు చేసి.. ఈ నిర్మాత ఉన్న బయ్యర్లని కూడా రాకుండా చేసేలా ఉన్నాడంటూ వారు గగ్గోలు పెడుతున్నారు.

Also Read- ఇంకా తగ్గని ‘పెద్ది’ గ్లింప్స్ జోరు.. దేశ వ్యాప్తంగా నెం.1లో ట్రెండింగ్‌!

మొండిపట్టు పట్టుకుని కూర్చుంటే

Advertisement

మరోవైపు ఈ సినిమా అనుకున్న టైమ్‌కి వస్తుందా? ఏప్రిల్ 30న రిలీజ్ ఉంటుందా? అనేలా డౌట్స్ ఉన్నాయి. దాని గురించి ఆలోచించకుండా.. నాకు అంత కావాలి, ఇంత అయితేనే ఇస్తా? అని మొండిపట్టు పట్టుకుని కూర్చుంటే, ఫైనల్‌గా నష్టపోయేది ఎవరో, ఆయన గమనించాలి. ముందు బయ్యర్లు ఇస్తానన్నా రేటుకి ఇచ్చేసి, లిమిట్ పెట్టుకుని, ఆ లిమిట్ దాటి లాభాలు వస్తే.. పర్సేంటేజ్ అడగాలి కానీ, ఇలా బిజినెస్‌కే అడ్డంగా కూర్చుంటే ఎలా? అంటూ సినీ వర్గాలు కూడా సదరు నిర్మాత తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఒకవేళ ఈ సినిమా కనుక అనుకున్న టైమ్‌కి రాకపోతే, అటు ఓటీటీ రైట్స్ కొన్న నెట్‌ఫ్లిక్స్‌కు భారీగా సమర్పించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే, ఒకసారి వాయిదా పడింది. ఈసారి కూడా వాయిదా పడితే.. ఓటీటీ కూడా షాక్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి, ముందు సినిమాను వచ్చిన కాడికి అమ్మేసుకుంటే బెటర్ అనేది సినీ పరిశీలకుల అభిప్రాయం. చూద్దాం.. మరి ఈ వార్తలలో ఎంత నిజం ఉందో? ఈ నిర్మాత ఈ వార్తలపై ఎలా స్పందిస్తారో?

Also Read- Dhurandhar 2: ధురంధర్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్.. ఎప్పుడు? ఎక్కడంటే?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×