E-Paper
Advertisement

ఊహించని మలుపులతో ఓటీటీలోకి వచ్చేస్తున్న క్రైమ్ కామెడీ… ఎప్పుడు ఎక్కడ చూడచ్చో తెలుసా ?

ఊహించని మలుపులతో ఓటీటీలోకి వచ్చేస్తున్న క్రైమ్ కామెడీ… ఎప్పుడు ఎక్కడ చూడచ్చో తెలుసా ?
Advertisement

Crime Comedy Series : ఓటీటీలోకి ఒక కొత్త క్రైమ్ కామెడీ స్ట్రీమింగ్ కి వస్తోంది. గత ఏడాది వచ్చిన ఈ సిరీస్ మొదటి సీజన్ సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు రెండో సీజన్ ను కూడా ఆడియన్స్ ముందుకు తెస్తున్నారు. దీనికి ఐయండిబిలో 7.7 రేటింగ్ కూడా ఉంది. ఉద్యోగం పోయి, విడాకులు తీసుకున్న తర్వాత విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డ ఒక వ్యక్తి చుట్టూ కథ తిరుగుతుంది. అతను దొంగతనాలకు పాల్పడుతుండటంతో కథ ఊహించని ట్విస్టులు ఇస్తుంది. ఆడియన్స్ ను ఏమాత్రం నిరాశపరచదు ఈ సిరీస్. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలోకి వస్తుంది ? అనే వివరాల్లోకి వెళ్తే..

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఈ అమెరికన్ క్రైమ్ డార్క్ కామెడీ సిరీస్ పేరు ‘యువర్ ఫ్రెండ్స్ అండ్ నెబర్స్’ (Your Friends & Neighbors). ఇందులో జాన్ హామ్, అమండా పీట్, ఒలివియా మున్ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సిరీస్‌లో జాన్ హామ్ ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా, జాన్ హామ్ స్వయంగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరించారు. ఈ సిరీస్ ను జోనాథన్ ట్రోపర్ రూపొందించారు. ఈయన గతంలో ‘Banshee’, ‘Warrior’ వంటి హిట్ సిరీస్‌లను అందించారు. స్టెఫానీ లైంగ్, క్రెయిగ్ గిల్లెస్పీ దీనిని డైరెక్ట్ చేశారు. మొదటి సీజన్ 2025 ఏప్రిల్ 11న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి వచ్చింది. రెండో సీజన్ 2026 ఏప్రిల్ 3 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

కూప్ అనే వ్యక్తి మంచి ఉద్యోగంతో ఒక రిచ్ ఏరియాలో జీవిస్తుంటాడు. అయితే కాలం కలిసిరాక ఉద్యోగం పోతుంది, దానికి తోడు పెళ్ళాం కూడా విడాకులు ఇచ్చి వెళ్ళిపోతుంది. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా, తన పరువు కోసం చుట్టుపక్కల ఉన్న ధనవంతుల ముందు ఇంకా బిల్డప్ ఇస్తుంటాడు. ఈ లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేయడం కోసం, అతను తన సొంత ఏరియాలోనే ఉన్న తన స్నేహితులు, పొరుగువారి ఇళ్లలో పక్కా ప్లాన్‌తో దొంగతనాలు మొదలుపెడతాడు. అంటే బయటికి జెంటిల్‌మన్ లా కనిపిస్తూ, లోపల మాత్రం గట్టి స్కెచ్ వేసే దొంగగా మారుతాడు.

ఈ దొంగతనాలు చేసే క్రమంలో కూప్ అనుకోకుండా ఒక పెద్ద చిక్కులో పడతాడు. తను ఎవరినైతే దోచుకుంటున్నాడో, వాళ్లందరి వెనుక నమ్మలేని చీకటి నిజాలు, సీక్రెట్లు తెలుసుకుంటాడు. అతను దొంగతనం చేసిన ప్రతి ఇల్లు ఒక కొత్త తలనొప్పిని తెచ్చిపెడుతుంది. పోలీస్ వాళ్లు ఒక పక్క, లోకల్ గ్యాంగ్‌లు ఇంకో పక్క అతని వెనుక పడటంతో, కూప్ ఈ గోల నుంచి ఎలా బయటపడ్డాడు, తన పరువును ఎలా కాపాడుకున్నాడు అనేదే ఈ క్రైమ్ డ్రామా అసలు మజా. ఇక సీజన్ 2 లో కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. కూప్ చేసే దొంగతనాలు కొంత మంది కనిపెడతారు. ఆ తరువాత కూప్ ఎమి చేస్తాడానే క్రమంలో కథ ఉంటుంది.

Advertisement

Read Also : ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తున్న 26 ఏళ్ల హాలీవుడ్ మూవీ… యాక్టింగ్ ఇరగదీసిన బ్రాడ్ పిట్… ఐయండిబిలో 8.8 రేటింగ్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×