// // Crime Comedy OTT: అమ్మాయితో అలాంటి కోరిక.... -->
E-Paper
Advertisement

Crime Comedy OTT: అమ్మాయితో అలాంటి కోరిక… కుక్కల యాపారంతో కోట్లు… మస్త్ షేడ్స్ ఉన్న మూవీ

Crime Comedy OTT: అమ్మాయితో అలాంటి కోరిక… కుక్కల యాపారంతో కోట్లు… మస్త్ షేడ్స్ ఉన్న మూవీ
Advertisement

Crime Comedy OTT : అల్లరి చిల్లరగా తిరిగే కుర్రాళ్ళతో సరదాగా సాగిపోయే సినిమాను చూడాలనుకుంటే, ఇప్పుడు చెప్పుకోబోయే మూవీని చూసేయొచ్చు.  ఇప్పటి యూత్ ఎలా అడ్డదారుల్లో కెరీర్ నాశనం చేసుకుంటున్నారో ఈ సినిమా కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. ఈ కథ ఉత్తరప్రదేశ్‌లోని ఒక చిన్న పట్టణంలో నలుగురు యువకుల తో మొదలవుతుంది. వీళ్ళు తమ కోరికల కోసం నేరాల బాట పట్టడంతో కథ మలుపులు తిరుగుతుంది. బోల్డ్ కంటెంట్ కారణంగా, ఈ సినిమాకు పిల్లలు దూరంగా ఉండటం మంచింది.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ఈ హిందీ క్రైమ్ డ్రామా సినిమా పేరు ‘కెర్రీ ఆన్ కుట్టన్’ (Kerry on Kutton). అశోక్ యాదవ్ దర్శకత్వం వహించిన ఈ హిందీ సినిమా, త్రిశాంక్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో శశాంక్ శేఖర్ సింగ్ నిర్మించారు. ఈ చిత్రంలో సత్యజీత్ దూబే, ఆదిత్య కుమార్, ఆరాధన జగోతా, శివం ప్రధాన్, కరణ్ మహావర్ వంటి నటులు నటించారు. ఇది 2016 జూలై 1న విడుదలైంది. ఈ సినిమా బోల్డ్ కంటెంట్ కారణంగా, సెన్సార్ ‘A’ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈ సినిమా Amazon Prime Video లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ కథ ఉత్తరప్రదేశ్‌లోని బలియా అనే ఊరిలో జరిగే నలుగురు కుర్రాళ్ల చుట్టూ తిరుగుతుంది. వీళ్లంతా ఏదో ఒక పిచ్చి కోరికతో ఉంటారు. కెర్రీ అనే కుర్రాడు తన వర్జినిటీని ఎలాగైనా పోగొట్టుకోవాలని ట్రై చేస్తుంటే, అతని స్నేహితుడు కదంబరి మాత్రం ఊర్లో కుక్కలని అమ్మేసి పెద్ద డాన్ అయిపోవాలని కలలు కంటాడు. మరోవైపు జ్యోతి అనే అమ్మాయి తన ఊరి నుండి ఎలాగైనా పారిపోయి హాయిగా బ్రతకాలని చూస్తుంటుంది. సూరజ్ అనే మరో కుర్రాడు తన తండ్రిని ఎదిరించి ఏదో ఒకటి సాధించాలని తాపత్రయపడుతుంటాడు.
వీళ్ళ కోరికలు తీర్చుకోవడానికి వీళ్లు చేసే పనులు చిన్న చిన్న నేరాల నుండి మొదలై, చివరకు పెద్ద గ్యాంగ్‌స్టర్ గొడవల్లోకి దారితీస్తాయి. ఊహించని మలుపులతో వీళ్ళ జీవితాలు పూర్తిగా చిక్కుల్లో పడిపోతాయి. చివరికి వీళ్ళంతా ఆ చిక్కుల్లో నుంచి బయట పడతారా ? ఈ క్లైమాక్స్ ఏమిటి ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : 17 ఏళ్లకే ప్రెగ్నెంట్… చెల్లిని కూడా వదలని మొగుడు… దిమ్మ తిరిగే ట్విస్టులు కూడా

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×