E-Paper
Advertisement

OTT Movie : ప్రియురాలిని కిరాతకంగా చంపే ప్రియుడు… మరో ముగ్గురితో అదే పని… వీడి పిచ్చికి బుర్ర బ్లాస్ట్

OTT Movie : ప్రియురాలిని కిరాతకంగా చంపే ప్రియుడు… మరో ముగ్గురితో అదే పని… వీడి పిచ్చికి బుర్ర బ్లాస్ట్
Advertisement

OTT Movie : ఇప్పుడు ఏ భాషలో చూసినా థ్రిల్లర్ సిరీస్ ల హవా కొనసాగుతోంది. ఆడియన్స్ కూడా వీటికి బాగా కనెక్ట్ అయిపోయారు. టైమ్ దొరికితే చాలు థ్రిల్లర్ జానర్ ని ఓ పట్టు పడుతున్నారు. ఈ ఏడాది వచ్చిన ఒక క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఆసక్తికర కథనంతో ఉత్కంఠంగా సాగుతోంది. ఈ కథలో ఒక యువకుడు 2 రోజుల్లో నలుగురిని చంపుతాడు. అందులో అతని ప్రియురాలు కూడా ఉంటుంది. అతను ఎందుకు చంపాడనే విషయం మీద స్టోరీ నడుస్తుంటుంది. థ్రిల్లర్ ఫ్యాన్స్ ఓ సారి లుక్ వేయాల్సిన సిరీస్ ఇది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

2025లో విడుదలైన ఈ హిందీ మాక్‌డాక్యుమెంటరీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘బ్లాక్, వైట్ & గ్రే: లవ్ కిల్స్’. పుష్కర్ సునిల్ మహాబల్ డైరెక్షన్ లో స్వరూప్ సంపత్ & హేమల్ థక్కర్ దీనిని నిర్మించారు. ఇందులో మయూర్ మోర్, పలక్ జైస్వాల్, దేవేన్ భోజని, తిగ్మంశు ధులియా లీడ్ రోల్స్ లో నటించారు. 6 ఎపిసోడ్స్ తో వచ్చిన మొదటి సీజన్ ఐయండిబిలో 7.5/10 రేటింగ్ పొందింది. ఇది 2025 మే 2నుంచి Sony LIV లో అన్ని సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

నాగ్‌పూర్‌కు చెందిన డానియల్ అనే ఒక మధ్యతరగతి యువకుడు ఉంటాడు. అతనిపై 2 రోజుల్లో 4 మందిని చంపాడని ఆరోపణలు వస్తాయి. అందులో అతని ప్రేమికురాలు కూడా ఉంటుంది. అతను ఒక శక్తివంతమైన రాజకీయ నాయకుడి కుమార్తె తో ప్రేమలో ఉంటాడు. వాళ్ళ మధ్య కుల, సామాజిక అంతరాల కారణంగా స్టోరీ డార్క్ టర్న్ తీసుకుంటుంది. ఒక హోటల్‌లో జరిగే సంఘటనల తర్వాత, ఆ యువకుడిపై నాలుగు హత్యల ఆరోపణలు వస్తాయి. అందులో అతని ప్రియురాలు, ఒక పోలీసు అధికారి, ఒక క్యాబ్ డ్రైవర్ ఒక బాలుడు ఉంటారు.

Read Also : టామ్ క్రూజ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… ‘మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రికనింగ్’ను ఓటీటీలో ఫ్రీగా ఎక్కడ చూడవచ్చో తెలుసా ?

Advertisement

యునైటెడ్ కింగ్‌డమ్ నుండి వచ్చిన ఒక జర్నలిస్ట్ ఈ కేసును డాక్యుమెంటరీ రూపంలో పరిశోధించడం ప్రారంభిస్తాడు. అతని కుటుంబ సభ్యులతో పాటు, చాలా మందిని ఇంటర్వ్యూ చేస్తాడు. విచారణలో భాగంగా అనేక విషయాలు వెలుగులోకి వస్తాయి. ప్రేక్షకులను చివరి వరకు ఉత్కంఠకు గురిచేస్తాయి. చివరికి డానియల్ ఆ నాలుగు హత్యలు ఎందుకు చేశాడు ? ప్రేమలో విఫలం కావడంతోనే ఇలా చేశాడా ? మరేదైనా కోణం ఉందా ? అనే ప్రశ్నలకు సమాధానాలను, ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను చూసి త్రలుసుకోవాల్సిందే.

 

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×