E-Paper
Advertisement

Best Documentary OTT Platforms : మీరు డాక్యుమెంటరీ సినిమా ప్రియులా ? ఈ 7 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లతో ఎంజాయ్ పండగో

Best Documentary OTT Platforms : మీరు డాక్యుమెంటరీ సినిమా ప్రియులా ? ఈ 7 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లతో ఎంజాయ్ పండగో
Advertisement

Best Documentary OTT Platforms : సినిమాలు, సిరీస్ లకు ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్ వేదికగా మారిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి భాషలోనూ ఇవి ఆడియన్స్ ను పలకరిస్తున్నాయి. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం ముందుగా వీటినే సర్చ్ చేస్తున్నారు. అయితే డాక్యుమెంటరీ చిత్రాలను ఇష్టపడే వారికి కొన్ని ప్లాట్ ఫామ్స్ లో మాత్రమే ఎక్కువగా అందుబాటులో ఉంటున్నాయి. నిజమైన సంఘటనల ఆధారంగా వచ్చే ఈ రియల్ కంటెంట్‌ను కనుగొనడం కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. ఏ ప్లాట్‌ఫామ్‌లు అదిరిపోయే డాక్యుమెంటరీ కంటెంట్‌ను అందిస్తాయి ? వాటి వివరాలు ఏమిటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

డాక్యుమెంటరీలకు వేదికగా ఉన్న బెస్ట్ ప్లాట్‌ఫామ్స్ ఇవే 

డాక్యు-బే : ఈ ప్లాట్‌ ఫామ్ పూర్తిగా డాక్యుమెంటరీలకే అంకితం చేయబడింది. మీరు ఇక్కడ అన్ని రకాల డాక్యుమెంటరీలను చూసి ఆనందించవచ్చు. అలాగే మీరు మరెక్కడా కనుగొనలేని కంటెంట్ ఇందులో దొరుకుతుంది. మీకు కావాల్సిన కంటెంట్ ను ఇక్కడ ఒక సారి సర్చ్ చేస్తే దొరకచ్చు.

Advertisement

నెట్ ఫ్లిక్స్ : మంచి కంటెంట్ ఇచ్చే ఓటీటీలలో నెట్ ఫ్లిక్స్ కూడా ఒకటి. దీనికి ప్రత్యేకమైన అభిమానులు కూడా ఉన్నారు. అలాగే డాక్యుమెంటరీలకు కూడా ఇది ప్రధాన వేదికగా ఉంది.

కానోపీ : ఈ ప్లాట్‌ ఫామ్‌లో డాక్యుమెంటరీలను ఉచితంగా ఆస్వాదించవచ్చు. విద్యార్థులు తమ యూనివర్సిటీ ఇమెయిల్ చిరునామా కలిగి ఉంటే ఈ ప్లాట్‌ఫారమ్‌ను ఉచితంగా ఉపయోగించవచ్చు.

డిస్కవరీ ఛానల్ : డిస్కవరీ ఛానల్ గురించి తెలియని వాళ్ళు ఉండరు. కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకునే వారికి ఇది చాలా మంచి వేదిక. వినోదాన్ని పొందుతూనే మీరు ఏదైనా నేర్చుకోవాలనుకుంటే ఈ ప్లాట్‌ఫామ్ బెస్ట్ సజెషన్.

Advertisement

జియో హాట్‌స్టార్ : ఇది నేషనల్ జియోగ్రాఫిక్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. కాబట్టి మీరు దాదాపు అన్ని ఒరిజినల్ కంటెంట్‌ను ఇక్కడ చూడవచ్చు, ఇందులో కొన్ని అద్భుతమైన డాక్యుమెంటరీలు కూడా ఉన్నాయి.

హెచ్ బి ఓ మ్యాక్స్ : డాక్యుమెంటరీ ప్రియులకు ఇది సరైన వేదికగా ఉంది. HBO మ్యాక్స్ హై-ఎండ్ డాక్యుమెంటరీ చిత్రాలను అందిస్తుంది. పై ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్ డాక్యుమెంటరీల కంటెంట్ ను ఎక్కువగా అందిస్తున్నాయి. మీకు కావాలసిన కంటెంట్ ను సులభంగా వీటిలో చూసి ఆనందించవచ్చు.

 

Read Also : కేరళ స్టేట్ అవార్డు విన్నింగ్ సినిమాతో సహా ఈ వారం ఓటీటీలో చూడాల్సిన మలయాళం సినిమాలు

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×