// // Avatar Fire And Ash OTT : "అవతార్ ఫైర్ అండ్ యాష్" స్ట్రీమింగ్ -->
E-Paper
Advertisement

Avatar Fire And Ash OTT : “అవతార్ ఫైర్ అండ్ యాష్” డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ ?

Avatar Fire And Ash OTT : “అవతార్ ఫైర్ అండ్ యాష్” డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ ?
Advertisement

Avatar Fire And Ash OTT : సైన్స్ ఫిక్షన్ చిత్రం “అవతార్: ఫైర్ అండ్ యాషెస్” 2025 డిసెంబర్ 19న థియేటర్లలో విడుదలై ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని సాధించింది. ఈ సినిమా లో ఉండే అద్భుతమైన విజువల్స్ ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. ఈ చిత్రం థియేటర్లలో చేసిన సందడి ముగియడంతో, ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లలో ఎప్పుడు విడుదల అవుతుందో తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. మరి ఇది ఎందులో స్ట్రీమింగ్ కి రానుంది ? ఎప్పుడు రాబోతోంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఎందులో స్ట్రీమింగ్ కాబోతోంది అంటే 

జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన “అవతార్: ఫైర్ అండ్ యాషెస్” ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఈ సినిమా జియో హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. అయితే నిర్మాతలు ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటనలు చేయలేదు. కానీ ఈ చిత్రం ఏప్రిల్, మే లో వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇదే ఫ్రాంచైజీలోని సెకండ్ పార్ట్ థియేటర్లలో విడుదలైన ఆరు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. ఇక ఆ టైమింగ్ ని దృష్టిలో పెట్టుకుంటే ఏప్రిల్, మే నెలలో ఇది వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద $1.2 బిలియన్లకు పైగా వసూలు చేసింది. అంతేకాకుండా జేమ్స్ కామెరూన్ ఇప్పటికే అవతార్ 4, 5 లను కూడా తీస్తున్నట్లు ప్రకటించడం జరిగింది.

Advertisement

Read Also :  బందిపోటు రాణిగా మారే గృహిణి… తెల్ల దొరలకు చుక్కలు… క్రేజీ బెంగాలీ మూవీ

స్టోరీ ఏమిటంటే

గత సినిమాల్లో మనం అడవిలో ఉండే ‘ఓమటికాయ’ తెగను, నీటిలో ఉండే ‘మెట్కాయినా’ తెగను చూశాము. ఈ మూడవ భాగంలో ‘యాష్ పీపుల్’ అనే కొత్త నావీ తెగను జేమ్స్ కామెరాన్ పరిచయం చేశారు. వీళ్ళు అగ్నిపర్వతాల ప్రాంతంలో నివసిస్తారు. ఇప్పటివరకు నావీలు మంచి వారుగా, ప్రకృతి ప్రేమికులుగా మాత్రమే కనిపించారు. కానీ ఈ సినిమాలో నావీ తెగల మధ్య ఉండే చీకటి కోణాన్ని చూపించారు. ‘యాష్ పీపుల్’ ఇతర నావీల కంటే కొంచెం క్రూరంగా ఉంటారు. ఈ తెగకు నాయకురాలిగా ‘వరాంగ్’ అనే కొత్త పాత్ర కనిపిస్తుంది. తను పాండోరాలోని ఇతర తెగలకు పెద్ద సవాలుగా మారుతుంది. ఒక వైపు మానవుల ముప్పు కొనసాగుతుండగానే, నావీ తెగల మధ్య వచ్చే విభేదాలు సినిమాని ఆసక్తికరంగా నడిపిస్తాయి. చివరికి వీళ్ళ మధ్య విభేదాలు సమసిపోతాయా ? మానవుల వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×