E-Paper
Advertisement

మనుషుల కంటే జంతువులే బెటర్ అని ఫీలయ్యే అమ్మాయి… చూసేవాళ్ళకి క్రేజీ ఎక్స్ పీరియన్స్

మనుషుల కంటే జంతువులే బెటర్ అని ఫీలయ్యే అమ్మాయి… చూసేవాళ్ళకి క్రేజీ ఎక్స్ పీరియన్స్
Advertisement

Attenberg Movie on OTT : ఒక డిఫరెంట్ కంటెంట్ చూడాలనుకుంటే, ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను చూడచ్చు. ఇందులో పాత్రలు చాలా వింతగా ఉంటాయి. మనుషులతో ఎలా కలవాలో తెలియక హీరోయిన్ జంతువుల లాగా అరుస్తూ, వింతగా గెంతుతూ ఉంటుంది. ఆమె మనుషులకంటే జంతువులతోనే కనెక్టివ్ గా ఉంటుంది. మధ్యలో వచ్చే లవ్ స్టోరీ, తండ్రి సెంటిమెంట్ తో ఇది ఆసక్తిగా ఉంటుంది. బోరింగ్ గా ఉన్నప్పుడు ఈ సినిమా చూస్తే భలే అనిపిస్తుంది. ఎమోషన్స్ ను కొంచెం స్టైల్ మార్చి చూపిస్తుంది ఇది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే..

ఏ ఓటీటీలో చూడచ్చు అంటే

ఈ గ్రీక్ డ్రామా మూవీ పేరు ‘అటెన్‌బర్గ్’ (Attenberg). దీనిని అతిథి రాచెల్ తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్ అరియాన్ లేబ్డ్ తన మొదటి సినిమాతోనే వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘బెస్ట్ యాక్ట్రెస్’ అవార్డు కొట్టేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాలో ఇంజనీర్‌గా నటించిన యోర్గోస్ లాంతిమోస్ ప్రస్తుతం హాలీవుడ్‌లో ‘పూర్ థింగ్స్’ వంటి ఆస్కార్ సినిమాలతో స్టార్ డైరెక్టర్‌గా వెలుగుతున్నాడు. మొత్తం మీద ఈ సినిమా ఒక సాదాసీదా కథలా కాకుండా, మనిషిలో ఉండే మరో కోణాన్ని వెరైటీగా చూపిస్తుంది. ముబి, ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

మెరీనా అనే యువతికి లోకం పోకడ అస్సలు తెలియదు. 23 ఏళ్లొచ్చినా మనుషులతో ఎలా కలవాలో, ఎలా మాట్లాడాలో అర్థం కాదు. అందరూ పద్ధతిగా ఉంటే, ఈమె మాత్రం జంతువుల లెక్క వింత వింతగా అరుస్తూ, గోడల మీద గెంతుతూ వెరైటీగా ప్రవర్తిస్తుంది. ఈమెకు మనుషుల కంటే టీవీలో వచ్చే అటెన్‌బర్గ్ అనే జంతువుల డాక్యుమెంటరీలంటేనే పిచ్చి. ఆ జంతువులను చూసి, అవి ఎలా కొట్టుకుంటాయో, ఎలా ఆడుకుంటాయో అలాగే ఈమె కూడా చేస్తూ ఒక రకమైన పిచ్చి లోకంలో బతుకుతుంటుంది.

ఇక ఈమెకు బెల్లా అని ఒక స్నేహితురాలు ఉంటుంది. ఆ బెల్లాకి లోకజ్ఞానం ఎక్కువే, మగాళ్ల ముచ్చట్లు, ముద్దుల గోలలు బాగా తెలుసు. అసలు ముద్దు ఎట్లా పెడతారో తెలుసా? అని మెరీనాకు కూడా నేర్పిస్తుంటుంది. మరోపక్క మెరీనా తండ్రికి చావు దగ్గర పడినా, ఈమెలో ఈ పెద్దగా చలనం ఉండదు. కానీ లోలోపల ఏదో తెలియని బాధ ఉంటుంది. సరిగ్గా అదే టైమ్‌లో ఊర్లోకి ఒక కొత్త ఇంజనీర్‌ వస్తాడు. అతన్నిచూడగానే ఈమెకు కోరిక పుడుతుంది. ఆ కుర్రాడితో కలిసి మాట్లాడేందుకు మెరీనా ట్రై చేస్తుంది. కానీ ఈమె తీరు మొత్తం రివర్స్ అవుతుంది. అటు తండ్రి చనిపోవడం, ఇటు బెల్లా నేర్పించే పాడు పనులు, మధ్యలో ఈ కొత్త కుర్రాడితో పరిచయం.. వీటన్నిటి మధ్యలో మెరీనా తనని తాను తెలుసుకోవడమే ఈ సినిమా కథ.

Advertisement

Read Also : విద్యార్థిని మోజులో ప్రొఫెసర్… వద్దంటూనే చేసే తప్పు…

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×