E-Paper
Advertisement

85 ఏళ్ల వయసులోనూ ఫిట్ గా ఉండటానికి కారణం చెప్పేసిన అలనాటి స్టార్

85 ఏళ్ల వయసులోనూ ఫిట్ గా ఉండటానికి కారణం చెప్పేసిన అలనాటి స్టార్
Advertisement

Murali Mohan diet :మూడు పదుల్లోనే ముప్పయ్ రోగాలని పోగేసుకుంటున్న ఈ కాలంలో 85 ఏళ్ల వయసు వచ్చినా ఇంకా అదే ఎనర్జీ, అంతే ఉత్సాహం… నటుడు మురళీ మోహన్ సొంతం. మరి ఇంత వయసు వచ్చినా కుర్రాడిలా కనిపించే మురళీ మోహన్ తను హెల్తీగా ఉండేందుకు ఏం డైట్ ఫాలో అవుతాడో మనమూ తెలుసుకుందామా!

85 ఏళ్ల వయసు వచ్చినా

Advertisement

మామూలుగా 70 దాటాయంటే చాలా మంది రిలాక్స్ మోడ్‌లోకి వెళ్తారు. కానీ 85 ఏళ్ల వయసు వచ్చినా మురళీ మోహన్ ఇప్పటికీ తన బిజినెస్ వ్యవహారాల్లో హుషారుగా పాల్గొనడం విశేషం. ఇక ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి గొప్ప వ్యక్తులను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్న ఆయనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని, అదే తనకి శ్రీరామరక్ష అని అనేక ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు. ఈ వయసులోనూ చర్మం మెరుస్తుండటానికి కారణం టెన్షన్స్‌ని మైండ్‌లోకి తీసుకోకపోవడమే అని తెలిపారు.

also read :మీ ఇంటి ‘ఆవకాయ’ ఏడాది దాటినా పాడవకుండా ఉండాలా? ఈ ‘సీక్రెట్’ చిట్కాలు మీ కోసమే!

Advertisement

డైట్ విషయానికి వస్తే చాలా స్ట్రిక్ట్

ఇక మురళీ మోహన్ డైట్ విషయానికి వస్తే చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారట. ఉదయాన్నే మార్నింగ్ కాఫీ తాగడం ఆయన అలవాటు. 9:30కి తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌లో డ్రై ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ మరియు ముఖ్యంగా రాగి జావ ఉండేలా చూసుకుంటారు. ఈ రాగి జావ ఎముకల బలానికి, శరీరానికి అవసరమైన ఎనర్జీని ఇస్తుందని ఆయన నమ్మకం.

ఇక మధ్యాహ్నం 2 గంటలకు లంచ్‌లో అన్నం తక్కువగా, కూరగాయలు, పప్పు ఎక్కువగా ఉండేలా జాగ్రత్త పడతారు. రాత్రికి పుల్కా లేదా ఉప్మా వంటి సింపుల్ ఫుడ్‌తో రాత్రి 8 గంటలకే డిన్నర్ ముగిస్తారు. కుదిరినంతవరకు మసాలా, ఆయిల్ ఫుడ్‌కు దూరంగా ఉంటారు.

ఆ సమయానికి ఏం కోరుకుంటుందో అదే

ఇక ఎక్కడ ఉన్నా బాడీ వర్కౌట్స్ మర్చిపోరు. ఉదయం 30 నుంచి 40 నిమిషాల పాటు నడవడం, యోగా, స్విమ్మింగ్ ప్రతిరోజూ చేస్తారు. అయితే ఎలా పడితే అలా కాకుండా, బాడీ ఆ సమయానికి ఏం కోరుకుంటుందో అదే చేస్తారట. యోగా, ప్రాణాయామం తప్పకుండా చేస్తూ బ్రీతింగ్‌పై కంట్రోల్ ఉంచుతారు.

ఇక షుగర్ (డయాబెటిస్) వంటి వ్యాధులు తమ జీన్స్‌లో లేవని, అయితే తన భార్య మరియు కోడలికి కొంచెం మోతాదులో ఉన్నాయని తెలిపారు. మొత్తానికి నటుడిగా, నిర్మాతగా, రియల్ ఎస్టేట్ వ్యాపారిగా సాధించిన విజయాల వెనుక ఈ డైట్ ప్లాన్ కీలక పాత్ర పోషిస్తుందన్న మాట!

also read :9 మందితో ఎఫైర్స్.. ఐఏఎస్ ఆఫీసర్‌తో పెళ్లి.. వెండితెర ‘రెండో భార్య’ రియల్ లైఫ్ విషాదం!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×