E-Paper
Advertisement

OTT Movie : ఓటీటీలోకి బెంగాలీ డిటెక్టివ్ థ్రిల్లర్… డాక్టర్ హత్య కేసుతో ఉత్కంఠ రేపే స్టోరీ… క్లైమాక్స్ వరకు ట్విస్టులే

OTT Movie : ఓటీటీలోకి బెంగాలీ డిటెక్టివ్ థ్రిల్లర్… డాక్టర్ హత్య కేసుతో ఉత్కంఠ రేపే స్టోరీ… క్లైమాక్స్ వరకు ట్విస్టులే
Advertisement

OTT Movie : ఓటీటీలో ఇప్పుడు డిటెక్టివ్ థ్రిల్లర్లు ప్రజాదరణ పొందుతున్నాయి. ప్రతి భాషలో ఇలాంటి సిరీస్లు, సినిమాలు ట్రెండింగ్ లో కూడా ఉంటున్నాయి. ఆడియన్స్ ని రెండుగంటల పాటు టెన్షన్ పెడుతూ కుర్చీల్లో కూర్చోబెడుతున్నాయి. బెంగాల్ ఇండస్ట్రి నుంచి అలాంటి సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చింది. గత ఏడాది థియేటర్లలో అడుగుపెట్టిన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ ని పలకరిస్తోంది. ఈ కథ ఒక డాక్టర్ మర్డర్ మిస్టరీ చుట్టూ తిరుగుతుంది. ఊహించని ట్విస్ట్లు ఇందులో వస్తూనే ఉంటాయి. డిటెక్టివ్ థ్రిల్లర్ ఫ్యాన్స్ మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

ఈ బెంగాలీ డిటెక్టివ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘అరణ్యర్ ప్రాచీన్ ప్రోబాద్’ (Aranyar Prachin Probad). దులాల్ డే దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జీతూ కమల్, సిలాజిత్ మజుందార్ వంటి నటులు నటించారు. 2024 జులై 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, 2024 డిసెంబర్ 13 నుంచి ZEE5 ఓటీటీలో లో స్ట్రీమింగ్ అవుతోంది. దాదాపు రెండు గంటల నిడివి ఉన్న ఈ థ్రిల్లర్ సినిమా ఐయండిబిలో 6.6/10 రేటింగ్ పొందింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

పానాఘాట్ అనే గ్రామంలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్‌కు డాక్టర్ అమిత్ రాయ్ వస్తాడు. అతను పేదలకు మంచి ట్రీట్‌మెంట్ ఇవ్వడం మొదలుపెడతాడు. ఇది లోకల్ నర్సింగ్ హోమ్స్, కరప్ట్ ఆఫీసర్స్ బిజినెస్‌ను డిస్టర్బ్ చేస్తుంది. దీంతో అతనికి శత్రువులు తెలీకుండానే పెరుగుతారు. సడన్‌గా ఒకరోజు అతను మర్డర్ అవుతాడు. ఈ కేసును CID అధికారి సుదర్శన్‌ తీసుకుని ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. అతనికి అరణ్య అనే మెడికల్ స్టూడెంట్ తోడుగా ఉంటూ ఈ కేసుకి హెల్ప్ చేస్తుంది. తొందర్లోనే ఈ మర్డర్ వెనక పెద్ద తలకాయలు, కరెప్షన్ ఉందని తెలుస్తుంది. సస్పెన్స్, ట్విస్ట్స్‌తో కూడిన గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. స్టోరీ నడిచే కొద్ది దిమ్మతిరిగే విషయాలు బయటపడతాయి. ఇది మామూలుగా జరిగిన హత్యకాదని తెలుస్తుంది. చివరికి సుదర్శన్‌ ఈ కేసు వెనుక ఉన్న అసలు హంతకులను కనిపెడతాడా ? అమిత్ రాయ్ ని చంపింది ఎవరు ? ఎందుకు చంపారు ? ఈ క్లైమాక్స్ ఏమిటి ? అనే విషయాలను, ఈ బెంగాలీ డిటెక్టివ్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.

 

Advertisement

 

 

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×