// // Road Accident: ఇన్నోవా కారు, బైక్ ఢీ.. స్పాట్‌లోనే భార్యాభర్తలు..? -->
E-Paper
Advertisement

Road Accident: ఇన్నోవా కారు, బైక్ ఢీ.. స్పాట్‌లోనే భార్యాభర్తలు..?

Road Accident: ఇన్నోవా కారు, బైక్ ఢీ.. స్పాట్‌లోనే భార్యాభర్తలు..?
Advertisement

నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నెల్లూరు-ముంబై జాతీయ రహదారిపై ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం పాలయ్యారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆత్మకూరు మండలం బోయిల సిరివెళ్ల గ్రామానికి చెందిన చావల మాధవ,  భార్య మనోజిని బైక్‌పై ఆత్మకూరు నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. అదే సమయంలో, కడప నుంచి నెల్లూరు వైపు వేగంగా వస్తున్న ఇన్నోవా కారు వారి బైక్‌ను అతి వేగంగా ఢీకొట్టింది. ఈ ధాటికి దంపతులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.

Advertisement

విషయం తెలుసుకున్న ఆత్మకూరు ఎస్సై జిలాని తన సిబ్బందితో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం  నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై జిలాని తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలు మరణించడంతో బోయిల సిరివెళ్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×