E-Paper
Advertisement

OTT Movie : వరుసగా ప్రెగ్నెంట్ అయ్యే జైల్లో ఉన్న అమ్మాయిలు… మెంటల్ మాస్ ట్విస్టులున్న మిస్టరీ థ్రిల్లర్

OTT Movie : వరుసగా ప్రెగ్నెంట్ అయ్యే జైల్లో ఉన్న అమ్మాయిలు… మెంటల్ మాస్ ట్విస్టులున్న మిస్టరీ థ్రిల్లర్
Advertisement

OTT Movie : మలయాళం సినిమాల తరువాత అంత రియలిస్టిక్ గా ఉండే స్టోరీలు బెంగాల్ ఇండస్ట్రీ నుంచే వస్తున్నాయి. ఇక్కడి నుంచి థ్రిల్లర్ వెబ్ సిరీస్ లు, సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ఇవి కూడా మంచి వ్యూస్ తోనే ముందుకు వెళ్తున్నాయి. రీసెంట్ గా ఒక థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటీటీలో టాప్ వ్యూస్ తో నడుస్తోంది. ఈ సిరీస్ లో మహిళలలు జైలులో ప్రెగ్నెంట్ అవుతుంటారు. ఈ స్కాండిల్ ఛేదించే క్రమంలో ఒక జర్నలిస్ట్ ప్రాణాలకు తెగించి పోరాడుతుంది. ఇంటెన్స్, ఎమోషనల్, గ్రిప్పింగ్ ఎలిమెంట్స్ తో సాగే ఈ బెంగాలీ సిరీస్, థ్రిల్లర్ ఫ్యాన్స్ కి మస్ట్ వాచ్ స్టోరీ. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

‘అనుసంధాన్’ (Anusandhan) ఒక బెంగాలీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. అదితి రాయ్ దర్శకత్వంలో ఇది రూపొందింది. ఇది 2025 నవంబర్ 7న హోయిచాయి (Hoichoi) ఓటీటీ ప్లాట్‌ఫామ్ లో రిలీజ్ అయింది. ఇందులో సుభాష్రీ గంగూలీ, స్వాగతా ముఖర్జీ లీడ్ రోల్స్ లో నటించారు. 8 ఎపిసోడ్స్ తో వచ్చిన ఈ సిరీస్ ఐయండిబిలో 8.1/10 రేటింగ్ పొందింది. దీనికి తెలుగు, తమిళ్, కన్నడ డబ్బింగ్ ఆప్షన్ కూడా ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

అనుమితా సేన్ అనే జర్నలిస్ట్ రూప్పూర్ మహిళా జైలు లో జరుగుతున్న స్కాండల్‌ను ఎక్స్‌పోజ్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. జైలులో మహిళలు ప్రెగ్నెంట్ అవుతున్నారనే షాకింగ్ రిపోర్ట్ ఆమె దగ్గరకి వస్తుంది. అనుమితా ఈ స్కాండల్‌ను డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. జైలుకి వెళ్ళి లోలితా అనే ప్రెగ్నెంట్ మహిళను కలుస్తుంది. లోలితా స్టోరీ విని, అనుమితా ఈ కుట్ర వెనుక రూప్పూర్ జైల్ అధికారులు, పవర్‌ఫుల్ పాలిటికల్ ఫోర్సెస్ ఉన్నాయని గ్రహిస్తుంది. అయితే ఆధారాలు దొరకడం కష్టంగా ఉంటుంది. కానీ ఆమె ఇన్వెస్టిగేషన్ వల్ల ఆమెనే ఒక మర్డర్ కేసులో ఫ్రేమ్ చేస్తారు. ఒక సాక్షి మర్డర్‌కు ఆమెనే బ్లేమ్ చేసి జైలుకు పంపేస్తారు.

Read Also : సిటీలో డ్రైవర్ గా అడుగుపెట్టి అండర్ వరల్డ్ అవతారం… అమ్మ సెంటిమెంట్ తో అదిరిపోయే కన్నడ యాక్షన్ థ్రిల్లర్

Advertisement

జైలు లోపల అనుమితాను టార్చర్ చేస్తారు. అయితే ఆమె దీనికి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెడుతుంది. ఆమె ఇతర ప్రెగ్నెంట్ మహిళలను రహస్యంగా జైలులోనే కలుస్తుంది. ఆమె జైలు అధికారుల కుట్రలను బయటి ప్రపంచానికి చూపించాలనుకుంటుంది. ఈ సమయంలో ఆమె ఎన్నో అడ్డంకుల్ని ఎదుర్కొంటుంది. చివరికి ఆమె ఈ స్కాండల్‌ ను బయట పెడుతుందా ? జైలులో మహిళను ప్రెగ్నెంట్స్ ఎలా అవుతుంటారు ? అనే విషయాలను, ఈ సిరీస్ ను చూసి తెలుసుకోండి. మొత్తం మీద ఈ సిరీస్ మహిళల అబ్యూస్, సిస్టమ్ కరప్షన్ మీద స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తుంది.

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×