E-Paper
Advertisement

Rajamouli : సుమ లీక్ చేసిన వీడియోలో ఇది గమనించారా? రాజమౌళి మామూలోడు కాదు

Rajamouli : సుమ లీక్ చేసిన వీడియోలో ఇది గమనించారా? రాజమౌళి మామూలోడు కాదు
Advertisement

Rajamouli : కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మంచి కీర్తి సంపాదించిన ఏకైక డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి. అసలు హాలీవుడ్ సినిమాని అందుకోలేము అనుకునే తరుణంలో హాలీవుడ్ దర్శకులు కూడా ఆశ్చర్యపడేలా చేసిన దర్శకుడు రాజమౌళి. తాను తీసిన బాహుబలి అనే సినిమా తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచింది. విపరీతమైన గౌరవాన్ని తీసుకొచ్చింది.

ఇప్పటివరకు రాజమౌళి కెరియర్ లో ఒక డిజాస్టర్ సినిమా కూడా లేదు. ఆడియన్స్ ఏమి కోరుకుంటారో అని బాగా తెలిసిన వ్యక్తి రాజమౌళి. ఈయన దర్శకత్వంలో చివరగా వచ్చిన ట్రిపుల్ ఆర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సక్సెస్ సాధించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా ఎస్ఎస్ఎంబి 29. మహేష్ బాబు నటిస్తున్న ఈ సినిమా మీద ప్రపంచ వ్యాప్తంగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్ నవంబర్ 15న రామోజీ ఫిలిం సిటీ లో జరగనుంది.

వీడియోలో ఇది గమనించారా?

Advertisement

మామూలుగా సినిమాకి సంబంధించి చాలా మంది ప్లాన్స్ వేస్తుంటారు. కానీ ఈవెంట్ కూడా అద్భుతమైన ప్లాన్ వేస్తున్నాడు రాజమౌళి. బాహుబలి సినిమాలో కాలకేయులు మాహిష్మతి సామ్రాజ్యం మీదకు వచ్చినప్పుడు శివగామి దేవి ఏ ప్రణాళిక అయితే చెబుతుందో అచ్చం అలానే రాజమౌళి కూడా ప్లాన్ చేస్తున్నాడు.

ఆ ఈవెంట్ కోసం చాలామందిని ఒక రూమ్ లో కూర్చుని పెట్టి క్లాసెస్ తీసుకుంటున్నాడు. అయితే రాజమౌళి ఇలా చేస్తుండటం చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. చాలామంది కూడా ఒక ఈవెంట్ కోసం ఇంత కేర్ తీసుకుంటున్నాడు అంటూ ప్రశంసలు ఇస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సుమ కనకల విడుదల చేశారు.

Advertisement

సుమ విడుదల చేసిన వీడియోలు క్షుణ్ణంగా పరిశీలిస్తే రాజమౌళి ఎడమ చేతితో రాస్తున్నారు. ఎడమ చేతితో రాజమౌళి రాస్తారు అని చాలామందికి తెలియదు. ఈ వీడియోలో ఎంతమంది ఆ విషయాన్ని గమనించారో గానీ రాజమౌళి ఎడమ చేతి వాటం అని అర్థమయింది.

ఎడమ చేతివాటం ప్రత్యేక లక్షణాలు 

సృజనాత్మకత ఎక్కువగా ఉన్నవాళ్లకు ఎడమ చేతి వాటం వస్తుంది అని చాలా పరిశోధనలు చెప్పాయి. ఆర్ట్, డిజైన్, మ్యూజిక్, రైటింగ్ వంటి క్రియేటివ్ ఫీల్డ్‌లలో మంచి పొజిషన్లో ఉంటారు అని చాలామంది అంటుంటారు. అయితే ఎడమ చేతి వాటం ఉన్నవాళ్లు కేవలం పది నుంచి 15% వరకు మాత్రమే ఉంటారు అని తెలుస్తుంది. రాజమౌళి సాధించిన సక్సెస్ విధానం చూస్తుంటే ఇది కూడా నిజమేమో అని అనిపిస్తుంది.

Also Read: Akhanda 2 : న్యూటన్ చచ్చి బతికిపోయాడు, ఇదెక్కడి ఫిజిక్స్ బోయా

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×