// // Action Thriller OTT : గ్యాంగ్‌స్టర్ల సామ్రాజ్యాన్ని గడగడలాడించే క్లీనర్ -->
E-Paper
Advertisement

Action Thriller OTT : గ్యాంగ్‌స్టర్ల సామ్రాజ్యాన్ని గడగడలాడించే క్లీనర్… ప్రేమ కోసం వైల్డ్ రివేంజ్… కిరాక్ స్టోరీ

Action Thriller OTT : గ్యాంగ్‌స్టర్ల సామ్రాజ్యాన్ని గడగడలాడించే క్లీనర్… ప్రేమ కోసం  వైల్డ్ రివేంజ్… కిరాక్ స్టోరీ
Advertisement

Action Thriller OTT : ఓటీటీలో ఒక యాక్షన్ మూవీ ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. సినిమా అంతా ఫుల్ సీరియస్‌గా, డార్క్ గ్యాంగ్‌స్టర్ డ్రామాలాగా సాగుతుంది. రన్ టైమ్ సుమారు 1 గంట 48 నిమిషాలతో ఎక్కడా బోర్ కొట్టకుండా సాగిపోతుంది. యాక్షన్ సీక్వెన్స్‌లు మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవచ్చు. శవాలను శుభ్రం చేసే వ్యక్తి , తన ప్రేయసి హత్య తరువాత ప్రతీకార యాత్ర మొదలుపెడతాడు. ఆ తరువాత స్టోరీ మొత్తం సీరియస్ మూడ్‌లో సాగుతుంది. థ్రిల్లర్ ఫ్యాన్స్ ఈ సినిమాను చూస్తూ ఎగిరి గంతులు కూడా వేస్తారు.

ఎక్కడ చూడచ్చు అంటే

‘తత్సుమి’ (Tatsumi) అనే జపనీస్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా 2025 నవంబర్ 14న విడుదలైంది. ఈ సినిమాను హిరోషి షోజీ డైరెక్ట్ చేశారు. ఆయన గతంలో తీసిన ‘కెన్ అండ్ కాజు’ (Ken and Kazu) అనే సినిమాకు కూడా మంచి పేరు వచ్చింది. ఈయన సినిమాలు చాలా వైలెంట్ గా ఉంటాయి. ఇందులో యుయా ఎండో (తత్సుమి), కొకోరో మోరిటా (అవోయ్) ప్రధాన పాత్రల్లో నటించారు. మెయిన్ రోల్ ‘తత్సుమి’గా యుయా ఎండో అద్భుతంగా నటించాడు ఇందులో. అమాయకంగా కనిపిస్తూనే క్రూరంగా మారే పాత్ర అది. ఇక ప్రతీకారం కోసం తపించే అమ్మాయిగా కొకోరో మోరిటా నటించింది. ఇది 2023లోనే టోక్యో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. కానీ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో నవంబర్ 2025లో విడుదలైంది. ఇది ప్రైమ్ వీడియో (Prime Video), ఆపిల్ టీవీ (Apple TV) ప్లాట్‌ ఫామ్‌లలో అద్దెకు మాత్రమే అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ కథ అంతా తత్సుమి అనే ఒక సైలెంట్ కుర్రాడి చుట్టూ తిరుగుతుంది. అయితే అతను మామూలోడు కాదు, జపాన్ డాన్ల దగ్గర పనిచేస్తుంటాడు. వాడి పని ఏంటంటే, ఎక్కడైనా గొడవలు జరిగి ఎవరైనా చనిపోతే, ఆ శవాలను మాయం చేసి ఆ ప్లేస్‌ను నీట్‌గా క్లీన్ చేయడం. ఎవరితోనూ పెద్దగా మాట్లాడడు, తన పని తాను చేసుకుని పోతుంటాడు. కానీ ఒకరోజు అతని లవర్ ను కొంతమంది గ్యాంగ్‌స్టర్లు దారుణంగా చంపేస్తారు. దాంతో వాడి లోపల ఉన్న కోపం ఒక్కసారిగా బయటపడుతుంది.అక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. చనిపోయిన ఆమెకు అవోయ్ అనే ఒక తిక్క చెల్లెలు ఉంటుంది. ఆమెకు కూడా తన అక్కను చంపినోళ్లపై పిచ్చి కసి ఉంటుంది.

ఇక రివేంజ్ తీర్చుకు నేకి తత్సుమి ప్లాన్ ప్రకారం వెళ్లాలనుకుంటే, ఈ పిల్ల మాత్రం నేనే అందరినీ అడ్డంగా నరికేస్తానని అంటుంది. ఇక చేసేది లేక, తత్సుమి ఆ పిల్లను తనతో పాటు తిప్పుకుంటూ, ఇద్దరూ కలిసి ఆ హంతకుల వేట మొదలుపెడతారు. తత్సుమి అవోయ్ కోసం ప్రాణాలకు తెగించి పోరాడతాడు. ఒక పక్క పోలీసులు, మరోపక్క క్రూరమైన గ్యాంగ్‌స్టర్ల మధ్యలో ఈ ఇద్దరూ ఎలా నెగ్గారు ? ఆ రక్తపాతం ఎక్కడికి దారితీసింది ? అనే విషయాలను, ఈ గ్యాంగ్‌స్టర్ మూవీని చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : Fantasy Thriller : వింతలోకంలో మరో వింత… కారణం లేకుండా కత్తులు పట్టే మనుషులు… గాల్లోనే గల్లంతయ్యే ప్రాణాలు

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×