E-Paper
Advertisement

Harish Shankar: ట్రోలర్స్‌పై ఘాటుగా స్పందించిన హరీష్ శంకర్.. హద్దు మీరితే అదే చేస్తా!

Harish Shankar: ట్రోలర్స్‌పై ఘాటుగా స్పందించిన హరీష్ శంకర్.. హద్దు మీరితే అదే చేస్తా!
Advertisement

Harish Shankar: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ (PSPK)తో ‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh) తర్వాత మరోసారి హరీష్ శంకర్ (Harish Shankar) చేసిన చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh). ఈ సినిమా రీసెంట్‌గా విడుదలై మిక్స్‌డ్ టాక్‌ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమాకు అంతగా కలెక్షన్స్ కూడా లేవనేలా ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ‘ధురంధర్ 2’ ఎఫెక్ట్ కూడా ఈ సినిమాపై పడటంతో, ఏ దశలోనూ ఈ సినిమా నిలబడలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ‘ఉస్తాద్’ లాస్ ప్రాజెక్ట్‌గా మిగిలిపోతుందనేలా ఇప్పటికే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే, హరీష్ శంకర్ మాత్రం నేనొక గొప్ప సినిమా తీశానని ఇంకా ఇంకా ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారు. మరో వైపు హరీష్ శంకర్ అప్డేట్ అవకుండా ఆ మూస ధోరణిలోనే సినిమా తీశాడంటూ నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ ట్రోలింగ్‌‌పై హరీష్ శంకర్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

Also Read- Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’.. మణిశర్మ డ్యూటీ ఎక్కేశారోచ్!

ఇంకా భజన అవసరమా?

Advertisement

సినిమాలో మంచి కంటెంట్ ఉంది.. కచ్చితంగా ఈ సినిమాను జనాలకు రీచ్ అయ్యేలా చేయాలని ఆయన హీరోయిన్ శ్రీలీలతో కలిసి ప్రమోషన్స్ నిర్వహిస్తూ, ఎప్పుడూ ఏ సినిమాకు లేని విధంగా ఆయన కష్టపడుతున్నారు. ఇది చాలు.. సినిమా పరిస్థితి ఏంటనేది చెప్పడానికి. పవన్ కళ్యాణ్ సినిమా బాగుంటే, ఇంత ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. ‘ఓజీ’ సినిమాకు ఏం చేశారు? సరిగా ప్రీ రిలీజ్ వేడుక కూడా జరగలేదు. ఆ సినిమా బాగానే కలెక్షన్స్ రాబట్టింది కదా. సినిమాలో కంటెంట్ ఉంటే, అదే జనాలను ఆకర్షిస్తుంది. ఆఫ్‌కోర్స్ సినిమాలో మంచి కంటెంట్ ఉంది.. కాదని అనడం లేదు.. కాకపోతే, రొటీన్ అనేలా అవే గన్ ఫైట్స్, అవే డైలాగ్స్, భజన.. ఇదంతా అవసరమా? అని కొంత మంది ఫ్యాన్స్ కూడా అంటున్నారంటే, హరీష్ శంకర్ ఏం సినిమా తీశారో ఒక్కసారి ఆగి ఆలోచించాలి.

Also Read- Lavanya: మద్యం మత్తులో రాజ్ తరుణ్ మాజీ ప్రియరాలు లావణ్య.. అడ్డంగా బుక్కయిందిగా!

ఎవడైనా హద్దు మీరితే..

Advertisement

ప్రస్తుతం ఇవే ప్రశ్నలతో హరీష్ శంకర్‌పై ట్రోలింగ్ నడుస్తుంది. సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్‌పై మీరు ఏ విధంగా ఫీలవుతున్నారనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘ఎవరెవరో, ఏదేదో మాట్లాడుకుంటూ ఉంటారు. కనీసం వాళ్లు ఎవరో కూడా చెప్పుకోవడానికి ధైర్యం లేదు. ఎవరో ఫొటో పెడతారు.. ఏవేవో రాతలు రాస్తుంటారు. అలాంటి వారిని అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. నిజంగా ఆ ట్రోలింగ్స్‌ని పట్టించుకుంటే మాత్రం, అసలు నేను సోషల్ మీడియాలోనే ఉండను. ఎవడైనా హద్దు మీరి, అసభ్యకరంగా రియాక్ట్ అయితే మాత్రం బ్లాక్ చేసి పడేస్తా. ఇంకా అతి మించితే చట్టపరమైన చర్యలకు కూడా వెనుకాడను’’ అని హరీష్ శంకర్ చెప్పుకొచ్చారు. నిజమే విమర్శ అయితే తీసుకోవచ్చు. తద్వారా ఎంతో కొంత నేర్చుకునే అవకాశం ఉంది. కానీ, విమర్శ పేరుతో హక్కులకు లింక్ చేస్తూ.. ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తామంటే కుదరదు కదా. అదే చెబుతున్నారు హరీష్ శంకర్.

Also Read- Sabdham OTT: రిలీజ్ అయిన ఒక సంవత్సరం తర్వాత ఓటీటీలోకి రానున్న ఆది పినిశెట్టి హారర్ థ్రిల్లర్..!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×